PoliticsDeekshitha Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lockdown8a852b14-fe77-4318-aa1c-67ebd9e52a71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/lockdown8a852b14-fe77-4318-aa1c-67ebd9e52a71-415x250-IndiaHerald.jpgనిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. ఈనెల 31నుంచి భారత్ లో లాక్ డౌన్ పెడుతున్నారని కొందరు, కాదు కాదు డిసెంబర్ 31, జనవరి 1 రెండ్రోజులు మాత్రమే లాక్ డౌన్ పెడతారని కొందరు ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా సర్కులేట్ అయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా చాలామంది వీటిని నమ్మారు కూడా. కానీ కొంతమంది బిజినెస్ వర్గాలను టార్గెట్ చేశారని, ఇది వట్టి పుకారేనని కొట్టిపారేశారు. కానీ రాను రాను ఈ పుకారే నిజమయ్యేలా ఉంది. అయ్యేలా ఉండటం కాదు, కర్నాటకలో నిజమైంది కూడా. దీంతో ఇప్పుడు మిగతా రాషlockdown{#}Karnataka;January;INTERNATIONAL;CM;Telugu;India;News;Decemberపుకారే నిజమైంది.. భారత్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు..పుకారే నిజమైంది.. భారత్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు..lockdown{#}Karnataka;January;INTERNATIONAL;CM;Telugu;India;News;DecemberWed, 22 Dec 2021 09:02:34 GMTనిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. ఈనెల 31నుంచి భారత్ లో లాక్ డౌన్ పెడుతున్నారని కొందరు, కాదు కాదు డిసెంబర్ 31, జనవరి 1 రెండ్రోజులు మాత్రమే లాక్ డౌన్ పెడతారని కొందరు ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా సర్కులేట్ అయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా చాలామంది వీటిని నమ్మారు కూడా. కానీ కొంతమంది బిజినెస్ వర్గాలను టార్గెట్ చేశారని, ఇది వట్టి పుకారేనని కొట్టిపారేశారు. కానీ రాను రాను ఈ పుకారే నిజమయ్యేలా ఉంది. అయ్యేలా ఉండటం కాదు, కర్నాటకలో నిజమైంది కూడా. దీంతో ఇప్పుడు మిగతా రాష్ట్రాలు కూడా ఆంక్షలు పెట్టే దిశగా ఆలోచన చేస్తున్నాయి.

కర్నాటకలో ఆంక్షలు..
కర్నాటక సర్కారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించింది. ఒకటి రెండు కాదు, ఏకంగా నాలుగు రోజులపాటు ఈ ఆంక్షలు పెట్టింది. డిసెంబర్ 30నుంచి జనవరి 2 వరకు ఆంక్షలు ఉంటాయని ప్రకటించారు సీఎం బసవరాజ్ బొమ్మై. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో ఒమిక్రాన్ కి స్వాగతం పలకడం ఎందుకని ప్రశ్నిస్తున్నారాయన. బహిరంగ ప్రదేశాల్లో జరిగే పార్టీలపై ఆంక్షలు అమలులో ఉంటాయి.

కర్నాటక తొలి అడుగు వేయడంతో.. ఇతర రాష్ట్రాలు కూడా ఆ దిశగా ధైర్యం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు కానీ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై మాత్రం ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అయితే అవి రెండ్రోజులకు పరిమితమా లేక కర్నాటక లాగా నాలుగు రోజులపాటు ఆంక్షలు విధిస్తారా అనేది వేచి చూడాలి. మిగతా ప్రాంతాల్లో కూడా ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరగడంతో ఆందోళనలు నెలకొన్నాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై పరిమితంగా ఆంక్షలు విధించినా ఫలితం కనపడ్డంలేదు. దీంతో ప్రయాణాలపై పూర్తి స్థాయిలో ఆంక్షలు పెట్టే ఆలోచన కేంద్రం చేస్తుందా లేదా అనేది చూడాలి.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

మారు వేషంలో తిరుగుతున్న ఎమ్మెల్యే..!

48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు

తెలంగాణ బాట‌లో ఏపీ : కాంగ్రెస్‌కు కొత్త ర‌థ‌సార‌థి..?

జ‌గ‌న్ అడ్డా : రాజీ రాజ‌కీయంలో గెలుపు ఎవ‌రిది?

షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !

టీఆర్ఎస్ vs బీజేపీ : `కారు` స్పీడుకు కార‌ణ‌మ‌దేనా..?

యావత్ప్రపంచానికే గణిత మేధావి రామానుజన్

ఆ సెంటిమెంట్ కే ఫిక్స్ అయిన బంగార్రాజు..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Deekshitha Reddy]]>