PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu in lot of tention-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/chandrababu in lot of tention-415x250-IndiaHerald.jpgఏపీ సీఎం జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ప‌థ‌కం.. ఓటీఎస్‌(వ‌న్ టైం సెటిల్మెంట్‌). దీని ద్వా రా.. దాదాపు 30 ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న పేద‌ల ఇళ్ల‌కు సంబంధించిన సంపూర్ణ హ‌క్కుల‌ను వారికి అందించే కార్య‌క్ర‌మం. వాస్తవానికి దీనిపై ఆదిలో మ‌హిళ‌లు, పురుషులు.. పేద‌లు కూడా అనేక అపోహ‌లు పెట్టుకున్నారు. ప్ర‌తిప‌క్షం ప్రచారాన్ని నిజ‌మ‌నే అనుకున్నారు. కానీ, వాస్త‌వాల‌ను ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. దీని ప్ర‌కారం ఇప్పుడు గ్రామాల్లోనూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ఏర్ప‌డింది. ఎందుకChandra Babu{#}CM;courtఓటీఎస్‌పై బాబు అందుకే కోర్టుకు వెళ్ల‌లేదా...!ఓటీఎస్‌పై బాబు అందుకే కోర్టుకు వెళ్ల‌లేదా...!Chandra Babu{#}CM;courtWed, 22 Dec 2021 22:00:00 GMTఏపీ సీఎం జ‌గ‌న్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన ప‌థ‌కం.. ఓటీఎస్‌(వ‌న్ టైం సెటిల్మెంట్‌). దీని ద్వా రా.. దాదాపు 30 ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న పేద‌ల ఇళ్ల‌కు సంబంధించిన సంపూర్ణ హ‌క్కుల‌ను వారికి అందించే కార్య‌క్ర‌మం. వాస్తవానికి దీనిపై ఆదిలో మ‌హిళ‌లు, పురుషులు.. పేద‌లు కూడా అనేక అపోహ‌లు పెట్టుకున్నారు. ప్ర‌తిప‌క్షం ప్రచారాన్ని నిజ‌మ‌నే అనుకున్నారు. కానీ, వాస్త‌వాల‌ను ప్ర‌భుత్వం వ‌లంటీర్ల‌తో వివ‌రించే ప్ర‌య‌త్నం చేసింది. దీని ప్ర‌కారం ఇప్పుడు గ్రామాల్లోనూ ప్ర‌జ‌ల్లో చైత‌న్యం ఏర్ప‌డింది.

ఎందుకంటే.. ఏళ్ల‌త‌ర‌బ‌డి ప్ర‌భుత్వాలు క‌ట్టించిన లేదా.. ప్ర‌భుత్వాలు ఇచ్చిన స్థ‌లాల్లో.. ఉంటున్న ప్ర‌జ‌ల కు ఆయా ఇళ్ల‌పై ఎలాంటి హ‌క్కులు లేకుండా పోయాయి. వారు స‌ద‌రు ఇంటిపై యాజ‌మాన్య హ‌క్కులు లేకుండానే ఉంటున్నారు. అప్పులు తెచ్చుకుందామ‌న్నా.. ప్రైవేటు వ‌డ్డీ వ్యాపారుల‌ను ఆశ్ర‌యించాల్సి రావ‌డం.. ప‌ట్టా కాయితాలు త‌మ వ‌ద్ద లేక‌పోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక‌, ఇంట్లో శుభ‌కార్యాల కోస‌మో.. వైద్యం కోసం.. ఎక్కువ మొత్తంగా డ‌బ్బులు కావాల్సి వ‌చ్చిన‌ప్ప‌డు.. స‌ద‌రు ఇంటిని అయిన కాడికి తెగ‌న‌మ్ము కోవాల్సి వ‌చ్చింది.

దీనివ‌ల్ల‌.. పేద‌లు చాలా నష్ట‌పోయారు. ఇదే విష‌యాన్ని ప్ర‌భుత్వం వివ‌రించి.. వారికి ఓటీఎస్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది. అయితే.. ప్ర‌తిప‌క్షం మాత్రం ఇదేదో డ‌బ్బులు గుంజుకునే ప‌థ‌కంగా ప్ర‌చారం చేసింది. అయితే.. ఇక్క‌డ మేధావులు ఒక ప్ర‌శ్నసంధిస్తున్నారు. జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న అనేక నిర్ణ‌యాల‌పై కోర్టుకు వెళ్లిన ప్ర‌తిప‌క్షాలు .. ఓటీఎస్‌పై ఎందుకు వెళ్ల‌లేద‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఎందుకంటే. ఇది కోర్టుకు వెళ్లినా.. ప్ర‌భుత్వానికి అనుకూలంగానే తీర్పు వ‌చ్చే అవ‌కాశం ఉంది కాబ‌ట్టి.

ఏ కోర్టు అయినా.. ఇంటిపై ఇచ్చిన రుణాల‌ను ఎగ్గొట్టాల‌ని కానీ.. పేద‌ల‌కు అన్యాయం చేయాల‌ని కానీ తీర్పు చెప్ప‌దు. పైగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆయా రుణాల విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రించింది. భారీ మొత్తంలో తీసుకున్న అప్పుల‌ను కూడా అత్యంత త‌క్కువ‌కే నిర్ణ‌యించింది. దీంతో ఈ ప‌థ‌కంపై కోర్టుకు వెళ్లినా.. త‌మ‌కు ఎదురు దెబ్బ‌త‌గ‌ల‌డంతోపాటు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం లేకుండా పోతుంది. అందుకే విప‌క్షాలు కోర్టుకు వెళ్ల‌లేద‌ని అంటున్నారు. ఓటీఎ స్ మంచిదేనని చంద్ర‌బాబుకు కూడా తెలుసున‌ని అయితే.. ఆయ‌న రాజ‌కీయంగానే చూస్తున్నార‌ని అంటున్నారు.

 



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఉత్తరాంధ్ర: రామతీర్ధంలో ఇద్దరిదీ ఓవరాక్షనేనా ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>