PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-4fc57b7a-7130-4d95-bbdb-92f07607e3ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-4fc57b7a-7130-4d95-bbdb-92f07607e3ca-415x250-IndiaHerald.jpgఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలను ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉంది. అలాగే అధికార పార్టీ కన్నా ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ను బలహీనం చేయడంపై ఎక్కువ దృష్టి సారించవచ్చు. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ లాంటి సీనియర్లకు ఆపరేషన్ అప్పగించాలని అనుకుంటున్నారు. తరుణ్ చుగ్ చెప్పే అంటున్నట్టుగా గెలిచే 70 మంది అభ్యర్థుల జాబితా నిజంగా రెడీ అయితే బీజేపీ ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఇక నుంచి ఆ దిశగా అమిత్ షా పర్యవేక్షణ ఉంటుందనడంలో సందేహం లేదు.Political {#}lakshman;GEUM;Tarun Kumar;Amit Shah;Amith Shah;Parliment;Assembly;Elections;KCR;CM;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Telangana;Congress;central government;Success;Partyఅమిత్ షా వ్యూహం: ఆ నేతలు బిజెపిలోకి రానున్నారా..!అమిత్ షా వ్యూహం: ఆ నేతలు బిజెపిలోకి రానున్నారా..!Political {#}lakshman;GEUM;Tarun Kumar;Amit Shah;Amith Shah;Parliment;Assembly;Elections;KCR;CM;Telangana Rashtra Samithi TRS;Bharatiya Janata Party;Telangana;Congress;central government;Success;PartyWed, 22 Dec 2021 11:17:07 GMTతెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ తో  బీజేపీ అమితుమీకి రంగం సిద్ధమైంది. పార్టీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందుకోసం   పటిష్టమైన వ్యూహరచన చేశారు. తెలంగాణ బిజెపి నేతలకు ఆయన ఈ దిశగా మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలతో రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అవినీతి పై పోరాటం చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. హుజరాబాద్ ఉప ఎన్నికల తర్వాత ఈటెల రాజేందర్ మొదటిసారిగా అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఈటెల కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని భావిస్తున్నారు. షా త్వరలో రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. హుజరాబాద్లో ఈటెల రాజేందర్ విజయంతో బిజెపి కొత్త ఉత్సాహంతో ఉంది. అయితే హుజరాబాద్ ఉప ఎన్నిక తర్వాత వలసలు పెరుగుతాయని బీజేపీ ఆశించింది. ముఖ్యంగా ఉద్యమకారులు వస్తారని అనుకున్నారు. టిఆర్ఎస్లో అసంతృప్త నేతలకు గాలం వేయాలని భావించింది కానీ అనుకున్న స్థాయిలో చేరికలు లేకపోవడంతో కొంత నిరాశలో ఉంది. అదే సమయంలో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అగ్రనేత అమిత్షా దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ బిజెపి నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు పోవాలో వారికి దిశానిర్దేశం చేశారు. వివిధ రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి షా వ్యూహాలు కీలక పాత్ర పోషించాలని భావిస్తున్నారు. టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా తామే అని చెప్పుకుంటున్న బిజెపి మైండ్ గేమ్ కూడా ఆడుతుంది. అందుకే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ టిఆర్ఎస్,కాంగ్రెస్ కు చెందిన 24 మంది అగ్రనేతలు తమతో టచ్లో ఉన్నారని కొద్దిరోజుల కిందట ప్రకటించారు. వారెవరో చెప్పకున్నా వారికోసం బిజెపి ప్రయత్నిస్తోందన్న విషయం తెలుస్తోంది. 119 మంది అభ్యర్థుల్లో గెలిచే 70 మంది జాబితాను కూడా సిద్ధం చేద్దామని కూడా తరుణ్ చుగ్ అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కేవలం 7 శాతం ఓట్లే సాధించింది. ఒక సీటు లోనే గెలిచింది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వంటి సీనియర్లు కూడా ఓడిపోయారు. ఒకప్పుడు పార్లమెంట్లో రెండు సీట్ల నుంచి అధికారం ఏర్పాటు చేసే స్థితికి వచ్చినట్టే, తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల నాటికి అధికారంలోకి వస్తామన్నదే బిజెపి నేతల ధీమాగా కనిపిస్తుంది. ఇది కనబడంగానే అమిత్ షా వ్యూహరచన కనిపిస్తోంది.

ఈశాన్య రాష్ట్రాల్లో అనుసరించిన వ్యూహాలను ఇక్కడ కూడా అమలు చేసే అవకాశం ఉంది. అలాగే అధికార పార్టీ కన్నా ముందు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్  ను బలహీనం చేయడంపై ఎక్కువ దృష్టి సారించవచ్చు. ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి వచ్చిన డీకే అరుణ లాంటి సీనియర్లకు ఆపరేషన్  అప్పగించాలని అనుకుంటున్నారు. తరుణ్ చుగ్ చెప్పే అంటున్నట్టుగా గెలిచే  70 మంది అభ్యర్థుల జాబితా నిజంగా రెడీ అయితే బీజేపీ ప్లాన్ సక్సెస్ అయినట్టే. ఇక నుంచి ఆ దిశగా అమిత్ షా పర్యవేక్షణ ఉంటుందనడంలో సందేహం లేదు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వైసీపీలో ‘ఫ్యాన్స్’ పోరు..ఫ్యాన్‌కు డ్యామేజే..!

"బిగ్ బాస్ సీజన్ 6" ఇంత త్వరగానా కారణం ఏమిటి?

48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు

తెలంగాణ బాట‌లో ఏపీ : కాంగ్రెస్‌కు కొత్త ర‌థ‌సార‌థి..?

జ‌గ‌న్ అడ్డా : రాజీ రాజ‌కీయంలో గెలుపు ఎవ‌రిది?

షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !

టీఆర్ఎస్ vs బీజేపీ : `కారు` స్పీడుకు కార‌ణ‌మ‌దేనా..?

యావత్ప్రపంచానికే గణిత మేధావి రామానుజన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>