PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajyasabha828d6bb1-4d1f-477e-9236-6765f62f7020-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rajyasabha828d6bb1-4d1f-477e-9236-6765f62f7020-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సమయంలో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఈ హామీలను రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటించారు. అయితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో... భారతీయ జనతా పార్టీ కూడా విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడేళ్లు దాటినా కూడా ఇప్పటికి అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో... పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా విభజన హామీలు rajyasabha{#}Telugu Desam Party;Kanakamedala Ravindra Kumar;Congress;polavaram;Prime Minister;Parliment;Polavaram Project;central government;Andhra Pradesh;Bharatiya Janata Party;Governmentహామీల అమలు కోసం డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం...!హామీల అమలు కోసం డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం...!rajyasabha{#}Telugu Desam Party;Kanakamedala Ravindra Kumar;Congress;polavaram;Prime Minister;Parliment;Polavaram Project;central government;Andhra Pradesh;Bharatiya Janata Party;GovernmentWed, 22 Dec 2021 20:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన సమయంలో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్నో హామీలు ఇచ్చింది. ఈ హామీలను రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా ప్రకటించారు. అయితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో... భారతీయ జనతా పార్టీ కూడా విభజన హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఏడేళ్లు దాటినా కూడా ఇప్పటికి అవి పూర్తిస్థాయిలో అమలు కాలేదు. దీంతో... పార్లమెంట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి కూడా విభజన హామీలు చేయాలంటూ ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూనే ఉన్నారు. కానీ... అవన్నీ కూడా ఏ మాత్రం అమలుకు నోచుకోలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కూడా. దీంతో వీటిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఏపీకి ఇచ్చిన విభజన్ హామీలు అమలు కోసం... పదేళ్ల డెడ్ లైన్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం.

నాడు కేంద్రం ఇచ్చిన గడువులో ఇప్పటికే ఏడున్నర ఏళ్ల సమయం గడిచిపోయింది. విభజన్ హామీల్లో భాగంగా పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా మరికొన్ని హామీలు ఇప్పటికీ నెరవేరాల్సి ఉంది. కానీ ఇందులో ప్రత్యేక హోదా విషయం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. హామీల అమలుపై ఇప్పటికే 25 సార్లు సమీక్షలు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది. కొన్ని హామీలను అమలు చేశామన్నారు కేంద్ర మంత్రి. మిగిలిన హామీలు కూడా రాబోయే సార్వత్రిక ఎన్నికలలోపు పూర్తి చేస్తామన్నారు. హామీల అమలుకు 2024 వరకు గడువు ఉందని... ఈ లోగా కేంద్రం అన్ని హామీలు అమలు చేస్తుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో గతంలో ఇచ్చిన హామీకి... ఇప్పుడు కేంద్రం పెడుతున్న కొర్రీలకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది. దీంతో కేంద్రం చెప్పిన మాట నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి మరి.





పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ప్రత్యేక హొదా కేంద్రం మెడలు వంచుతాం ?

ఆ టాప్ బ్యానర్లో బోయపాటి సినిమా.. హీరో ఎవరంటే..?

తమన్ లో మరీ అంత ఫ్రస్టేషన్ ఏంటో!!

విగ్ర‌హాలే వివాదాల‌కు ముగింపు క‌దూ!

'బిగ్ బాస్ 6' కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే షాక్ తప్పదు?

మోడీ : మన తగువులతో ఆయనకేం పని?

మళ్లీ బయటపడిన పాకిస్తాన్ దుర్బుద్ధి...!

నాగ్ కాన్ఫిడెన్స్ గెలిచింది.. సీజన్ తనదే!!

టీడీపీలో కొత్త తమ్ముడు... రాజ‌కీయం రంజుగా మారిందే...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>