PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-24566257-b07a-4991-bac9-8321266456fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-24566257-b07a-4991-bac9-8321266456fb-415x250-IndiaHerald.jpgఇకనైనా ప్రజల దృష్టి మళ్లించే ఎన్నికలు, ఫలితాలు, పార్టీ కార్యక్రమాలు వంటి అసందర్భ సమస్యలను పక్కనపెట్టి ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలి. అదే నిజమైన పరిపాలన అవుతుంది. ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ తామే గెలిచిన మని, ప్రజలు మా వైపే ఉన్నారని ప్రగల్భాలు పలకడం లో అర్థం లేదు. మెజారిటీ సభ్యులు అధికార పార్టీ వాళ్లే ఉండటం వలన శాసనమండలి స్థానాలను కూడా తెరాస చేజిక్కించుకోవడం లో ప్రత్యేకత ఏమీ లేదు.బదులుగా అధికార పార్టీకి చెందిన ఓట్లు ప్రతిపక్షాలకు చీలిపోయిన విషయం పైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంPolitical {#}Bhuma Akhila Priya;Sasanamandali;Aqua;Government;Telangana Rashtra Samithi TRS;central government;Partyవరి వార్ :రైతులు బేజార్.. ప్రత్యామ్నాయ మార్గాలేవి..!వరి వార్ :రైతులు బేజార్.. ప్రత్యామ్నాయ మార్గాలేవి..!Political {#}Bhuma Akhila Priya;Sasanamandali;Aqua;Government;Telangana Rashtra Samithi TRS;central government;PartyWed, 22 Dec 2021 08:05:00 GMT ఇంత కాలంగా రాష్ట్రంలో పంటలు పడుతూనే ఉన్నాయి. చెరువులు వర్షాధారంగా పండించే పంటల వలన ఉత్పత్తి గణనీయంగా పెరుగుతూ వచ్చింది. ఇటీవల తెరాస ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ప్రాజెక్టులను  నిర్మించడం వలన ప్రాజెక్టు క్రింది భూములన్నీ జాలి పట్టి నీటితో నిరంతరం ఉండటం వలన వరి పంటకు తప్ప ఏ పంట కూడా వేయడానికి యోగ్యంగా ఉండవు. నీటి సౌకర్యం పెరిగితే పెరిగే దిగుబడిని కొనుగోలు చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందనే ఆలోచన ముందుగా ఈ ప్రభుత్వానికి లేదా..? ప్రాజెక్టులు కట్టినప్పుడు నీటి సౌకర్యాన్ని కల్పించినప్పుడు ప్రజలకు కోటి ఎకరాల మాగాణి అని హామీ ఇచ్చినప్పుడు కేంద్రంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందా..?

 అత్యవసరమైనటువంటి ఆహార ధాన్యాలు,  సంబంధ ధాన్యాలు, వాణిజ్యపంటలు మొదలగు వాటి విషయంలో రాష్ట్రంలో నిర్లక్ష్యం జరుగుతూ కేవలం వరి పంట పైనే దృష్టి పెట్టడం జరిగింది. అనాదిగా జరుగుతున్న ఈ పద్ధతి కారణంగా కొన్ని రకాల గింజలు, ధాన్యాలు పంటలు అందుబాటులో లేక అసమతుల్యత ఏర్పడుతుంది. అలాంటప్పుడు అత్యవసరమైన పంటలను ఎంపిక చేసి పండించడానికి రైతులను ప్రోత్సహించడం ద్వారా కొరత ఉన్నటువంటి ఆ రకాలను అవసరానికి సరిపోయే స్థాయిలో పండించుకోవచ్చు కదా..! ఈ ఆలోచన వ్యవసాయరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాష్ట్రంలోని ప్రతిపక్షాలతో ప్రభుత్వం ఏనాడైనా  చర్చించినదా..? అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసినదా..? అందుకే రాష్ట్రంలో నీతిమంతమైన సుపరిపాలన ప్రజలకు అందించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన మేరకు అఖిల పక్షాలు ప్రజా సంఘాలతో తక్షణమే సమావేశం ఏర్పాటు చేసి పెద్దరికాన్ని చాటుకోవాలి . సమస్యలపైన ఏకాభిప్రాయానికి రావాలి .అప్పుడు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించే ప్రభుత్వాలుగా మనగలుగుతాయి.


ఇకనైనా ప్రజల దృష్టి మళ్లించే ఎన్నికలు, ఫలితాలు, పార్టీ కార్యక్రమాలు వంటి అసందర్భ సమస్యలను పక్కనపెట్టి ప్రజల సమస్యల పైన దృష్టి పెట్టాలి. అదే నిజమైన పరిపాలన అవుతుంది. ఎమ్మెల్సీ స్థానాలు అన్నీ తామే గెలిచిన మని, ప్రజలు మా వైపే ఉన్నారని ప్రగల్భాలు పలకడం లో అర్థం లేదు. మెజారిటీ సభ్యులు అధికార పార్టీ వాళ్లే ఉండటం వలన శాసనమండలి స్థానాలను కూడా తెరాస  చేజిక్కించుకోవడం లో ప్రత్యేకత ఏమీ లేదు.బదులుగా అధికార పార్టీకి చెందిన ఓట్లు ప్రతిపక్షాలకు చీలిపోయిన విషయం పైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎన్నికల ఫలితాలతో నే ప్రజలు తమ వెంట ఉన్నారని చెప్పుకోవడంలో అర్థం లేదు .ఆ విషయాన్ని ప్రభుత్వం మరిచి ప్రజల గురించి పట్టించుకోవడం ఇకనైనా కొనసాగించాలి.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వైసీపీలో ‘ఫ్యాన్స్’ పోరు..ఫ్యాన్‌కు డ్యామేజే..!

"బిగ్ బాస్ సీజన్ 6" ఇంత త్వరగానా కారణం ఏమిటి?

48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు

తెలంగాణ బాట‌లో ఏపీ : కాంగ్రెస్‌కు కొత్త ర‌థ‌సార‌థి..?

జ‌గ‌న్ అడ్డా : రాజీ రాజ‌కీయంలో గెలుపు ఎవ‌రిది?

షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !

టీఆర్ఎస్ vs బీజేపీ : `కారు` స్పీడుకు కార‌ణ‌మ‌దేనా..?

యావత్ప్రపంచానికే గణిత మేధావి రామానుజన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>