Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder3bcb4e2c-be23-4a27-a463-790f9fa67736-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder3bcb4e2c-be23-4a27-a463-790f9fa67736-415x250-IndiaHerald.jpgభార్య భర్తలు అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు జరగడం కామన్. ఇక ఇలా గొడవలు జరిగినప్పుడే భార్య భర్తల బంధం మరింత బలపడుతుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతవరకు వెళుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఏకంగా రెండు కుటుంబాల మధ్య గొడవ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు దూషించు కోవడంతో సరిపెట్టుకోలేదు ఇక రెండు కుటుంబాలు కూడా కత్తులకు పనిచెప్పాయ్. Murder{#}Nalgonda;job;Syamala;marriage;mandalam;Shiva;lord siva;police;Wife;Coronavirus;Smart phoneభార్యాభర్తల మధ్య గొడవ.. ఫ్యాక్షన్ సినిమా చూపించారు?భార్యాభర్తల మధ్య గొడవ.. ఫ్యాక్షన్ సినిమా చూపించారు?Murder{#}Nalgonda;job;Syamala;marriage;mandalam;Shiva;lord siva;police;Wife;Coronavirus;Smart phoneWed, 22 Dec 2021 09:32:12 GMTభార్య భర్తలు అన్న తర్వాత చిన్నచిన్న గొడవలు జరగడం కామన్. ఇక ఇలా గొడవలు జరిగినప్పుడే భార్య భర్తల బంధం మరింత బలపడుతుంది అని చెబుతూ ఉంటారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఎన్నో దారుణాలకు దారితీస్తున్నాయి. ఏకంగా ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేంతవరకు వెళుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఏకంగా రెండు కుటుంబాల మధ్య గొడవ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒకరిని ఒకరు దూషించు కోవడంతో సరిపెట్టుకోలేదు ఇక రెండు కుటుంబాలు కూడా కత్తులకు పనిచెప్పాయ్.



 ఇక ఈ రెండు కుటుంబాల మధ్య తలెత్తిన గొడవ అచ్చం ఒక పెద్ద ఫ్యాక్షన్ సినిమాను గుర్తు చేసింది అని చెప్పాలి. సాధారణంగా ఫ్యాక్షన్ సినిమాలో పగ ప్రతీకారాల తో ఒక కుటుంబం మరో కుటుంబంపై కత్తులతో దాడి చేయడం అడ్డు వచ్చిన వారిని దారుణంగా నరికి వేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ మానవత్వాన్ని మరిచి పోయిన మనుషులు ఇలాంటిదే చేశారు. ఇక ఈ దాడిలో ఒక మహిళా దారుణ హత్యకు గురికాగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. కమతం బిక్షమయ్య అచ్చమ్మ దంపతులకు కుమారుడు శివ నారాయణ ఉన్నాడు. ఇతనికి అదే  గ్రామానికి చెందిన శ్యామలతో  ఐదేళ్ల కిందట వివాహం జరిగింది.


 ఇక వీరికి నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే పెళ్లి అయిన నాటి నుంచి భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ వస్తోన్నాయి.  ఇక ఇటీవలే కరోనా వైరస్  కారణంగా హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం పోవడంతో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు శివనారాయణ. కాగా భార్యాభర్తల మధ్య జరుగుతున్న గొడవలు విషయంలో గ్రామ పెద్దలు సర్ది చెప్పినప్పటికీ ఇక వీరి మధ్య గొడవలు మాత్రం ఆగ లేదు. ఇటీవల మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగటంతో.. భార్య శ్యామల పుట్టింటికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో తరచు గొడవలతో శ్యామల తండ్రి సూర్యనారాయణ తల్లి యశోద అన్న శివా తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఇక ఉదయం సమయంలో శివ నారాయణ  ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న కారాన్ని ఇక కళ్ళల్లో చల్లి కత్తులతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఘటనలో తీవ్రంగా గాయపడిన అచ్చమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

వైసీపీలో ‘ఫ్యాన్స్’ పోరు..ఫ్యాన్‌కు డ్యామేజే..!

"బిగ్ బాస్ సీజన్ 6" ఇంత త్వరగానా కారణం ఏమిటి?

48 గంటల్లో ఓమిక్రాన్ నయం : ఆనందయ్య

బిగ్ బ్రేకింగ్ : ఉద్రిక్తత... మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు బైఠాయింపు

తెలంగాణ బాట‌లో ఏపీ : కాంగ్రెస్‌కు కొత్త ర‌థ‌సార‌థి..?

జ‌గ‌న్ అడ్డా : రాజీ రాజ‌కీయంలో గెలుపు ఎవ‌రిది?

షాకింగ్ సమంతకు ఎందుకుని ఇలా !

టీఆర్ఎస్ vs బీజేపీ : `కారు` స్పీడుకు కార‌ణ‌మ‌దేనా..?

యావత్ప్రపంచానికే గణిత మేధావి రామానుజన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>