PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpe269fa08-94be-4d9c-9bb1-fc4ea6b1f339-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycpe269fa08-94be-4d9c-9bb1-fc4ea6b1f339-415x250-IndiaHerald.jpgరాష్ట్ర విభ‌జ‌న అయ్యాక కేంద్రం ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఆ దిశగా కొన్ని ప‌నులు చేయాల‌ని కేంద్రం అనుకుంది. అందుకు నిధులు కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం కూడా ఇస్తుంది. కానీ నాటి ప్ర‌భుత్వం చేపట్టిన ఏ ప‌నినీ తాము చేప‌ట్టేదే లేద‌ని అంటోంది వైసీపీ. దీంతో రాజకీయ వైరం కార‌ణంగా పెద్ద‌గా అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. కానీ పార్ల‌మెంట్ లో మాత్రం అదేదో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు తామే కాపాడుతున్నామ‌న్న భ్ర‌మ‌లో వైసీపీ ఉంటోంది అన్న‌ది విప‌క్షం విమ‌ర్శ.ycp{#}Bharatiya Janata Party;YCP;TDPవారెవ్వా : పార్ల‌మెంట్ లో ఏం న‌టిస్తాండారు?వారెవ్వా : పార్ల‌మెంట్ లో ఏం న‌టిస్తాండారు?ycp{#}Bharatiya Janata Party;YCP;TDPMon, 20 Dec 2021 08:35:00 GMTఏం కావాలో తెలియ‌దు
ఎందుకు నాట‌కం ఆడుతున్నారో అర్థం కాదు

పార్ల‌మెంట్ లో చెప్పేదొక‌టి..గ‌ల్లీలో చేసేదొక‌టి.. పార్ల‌మెంట్ లో ఓఆర్ఆర్ కావాల‌ని అంటారు గ‌ల్లీలో ఓఆర్ఆర్ ఎందుకు అని అంటా రు. అస్స‌లు స్ప‌ష్ట‌త లేని తీరు కార‌ణంగా వైసీపీ ఎప్ప‌టిక‌ప్పుడు న‌వ్వుల పాల‌వుతోంది. సెష‌న్లో అడిగేది, అడిగించేది వైసీపీ అయినా త‌రువాత విధి విధానాలు అనూహ్యంగా మారిపోతాయి. దీంతో  నిన్న మాట ఈ రోజు ఉండ‌దు. అందుకే ఏం చేయాల‌న్నా కేంద్రంకు ఇక్క‌డ ఓ స్ప‌ష్ట‌త అన్న‌ది అంద‌దు.

2014 నుంచి ఇప్ప‌టిదాకా అనేక సార్లు రాజ‌ధాని ప‌రిధిలో ఇతర ప్రాంతాల‌ను క‌లుపుకుని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు తాము క‌ట్టుబ‌డి ఉ న్నామ‌నే కేంద్రం చెబుతోంది. వ‌రుస‌గా రెండు సార్లు బీజేపీ ప్ర‌భుత్వాలు ఏర్పాట‌యినా, ఎస్టిమేట్ వేల్యూ మారిపోయినా కూడా కేంద్రం రింగ్ రోడ్డుకు సిద్ధంగానే ఉంద ని నిర్థార‌ణ అయింది. అప్ప‌ట్లో 17 వేల కోట్ల పైగా నిధులు వెచ్చించి రింగ్ రోడ్డు వేసేందుకు తాము సిద్ధ‌మేనని కేంద్రం చెప్పింది. కానీ పేర్నినాని లాంటి వారు మ‌రో విధంగా అంటున్నారు అని ఆరోపిస్తుంది టీడీపీ. అయితే ఓఆర్ఆర్ కు బ‌దులు ఒక బైపాస్ రోడ్డుకు మాత్రం కేంద్రం ప‌నులు చేస్తోంది. ఇది కూడా గ‌తంలో అంటే 2011లో వ‌చ్చిందేన‌ని కొత్త ప‌నేం కాద‌ని టీడీపీ నేత ప‌ట్టాభి అంటున్నారు. ఓఆర్ఆర్ వ‌స్తే నాలుగు ల‌క్ష‌ల ఎక‌రాల భూమికి ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంద‌ని, అభివృద్ధికి నోచుకుంటుంద‌ని కూడా ప‌ట్టాభి అంటున్నారు. ఇవేవీ ప‌ట్టించుకోకుండా ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల్లో భాగంగానే 78 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఓఆర్ఆర్ కు సై అంటోంద‌ని ప‌ట్టాభి ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న అయ్యాక కేంద్రం ఈ ప్రాంతాన్ని ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది. ఆ దిశగా కొన్ని ప‌నులు చేయాల‌ని కేంద్రం అనుకుంది. అందుకు నిధులు కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం కూడా ఇస్తుంది. కానీ నాటి ప్ర‌భుత్వం చేపట్టిన ఏ ప‌నినీ తాము చేప‌ట్టేదే లేద‌ని అంటోంది వైసీపీ. దీంతో రాజకీయ వైరం కార‌ణంగా పెద్ద‌గా అభివృద్ధి ప‌నులు ముందుకు సాగ‌డం లేదు. కానీ పార్ల‌మెంట్ లో మాత్రం అదేదో రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు తామే కాపాడుతున్నామ‌న్న భ్ర‌మ‌లో వైసీపీ ఉంటోంది అన్న‌ది విప‌క్షం విమ‌ర్శ.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

"గుడ్ గవర్నెన్స్ వీక్" ప్రారంభించిన కేంద్రం... ఎందుకో తెలుసా..?

వావ్ : ఆర్టీసీ ఆస్తుల‌పై వైసీపీ క‌న్ను ఎందుకంటే?

స్నేహితుడి భార్యపై కన్ను.. చివరికి ప్రాణం పోయింది?

పుష్పలో ఆ సీన్లు ఉండవంటున్న నిర్మాతలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>