PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpef35eb69-3a5f-4df1-8ca9-8c5928eef01a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpef35eb69-3a5f-4df1-8ca9-8c5928eef01a-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ కలిసొచ్చే అవకాశం ఉందా? టీడీపీ వల్ల కాంగ్రెస్‌కు ఏమన్నా ప్లస్ అవుతుందా? అంటే అసలు తెలంగాణలో టీడీపీనే లేదు కదా...అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఎలా ప్లస్ అవుతుందని అనుకోవచ్చు...అయితే ఇక్కడే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి..దాదాపు టీడీపీ నేతలు, క్యాడర్ టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కొంత కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లింది. దీంతో తెలంగాణలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది. tdp{#}Revanth Reddy;Khammam;Telangana Rashtra Samithi TRS;MLA;TDP;Party;Congressఖమ్మంలో టీడీపీతోనే కాంగ్రెస్‌కు ఎడ్జ్...కలిసొస్తుందా?ఖమ్మంలో టీడీపీతోనే కాంగ్రెస్‌కు ఎడ్జ్...కలిసొస్తుందా?tdp{#}Revanth Reddy;Khammam;Telangana Rashtra Samithi TRS;MLA;TDP;Party;CongressMon, 20 Dec 2021 06:00:00 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి టీడీపీ కలిసొచ్చే అవకాశం ఉందా? టీడీపీ వల్ల కాంగ్రెస్‌కు ఏమన్నా ప్లస్ అవుతుందా? అంటే అసలు తెలంగాణలో టీడీపీనే లేదు కదా...అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఎలా ప్లస్ అవుతుందని అనుకోవచ్చు...అయితే ఇక్కడే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి..దాదాపు టీడీపీ నేతలు, క్యాడర్ టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. కొంత కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్లింది. దీంతో తెలంగాణలో టీడీపీ తుడుచుకుపెట్టుకుపోయింది.

మరి అలాంటప్పుడు టీడీపీ ఎలా కలిసొస్తుందని అనుకోవచ్చు. తెలంగాణలో మిగతా జిల్లాల్లో పరిస్తితి ఎలా ఉందో చెప్పలేం గానీ ఖమ్మం జిల్లాలో మాత్రం కాస్త టీడీపీ క్యాడర్ ఉందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ కూడా మెజారిటీ క్యాడర్ టీఆర్ఎస్ వైపుకు వెళ్లింది. అలా వెళ్ళిన క్యాడర్ ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు మొదట నుంచి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు పెద్దగా పట్టు లేదనే చెప్పాలి...గత ఎన్నికల్లో కూడా జిల్లాలో 10 సీట్లు ఉంటే టీఆర్ఎస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది.

6 సీట్లు కాంగ్రెస్, రెండు సీట్లు టీడీపీ, ఒక సీటు ఇండిపెండెంట్ గెలుచుకున్నారు. అయితే నలుగురు కాంగ్రెస్, ఇద్దరు టీడీపీ, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే టీఆర్ఎస్‌లోకి వచ్చారు. దీంతో జిల్లాలో టీఆర్ఎస్ హవా ఉన్నట్లు పరిస్తితి వచ్చింది. కానీ పార్టీ జంపింగ్‌లతో బలం పెంచుకుంది గానీ..సంస్థాగతంగా మాత్రం బలపడలేదు. టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన కాంగ్రెస్ క్యాడర్...మళ్ళీ కాంగ్రెస్ వైపే చూస్తుంది. అదే సమయంలో టీడీపీ క్యాడర్ సైతం కాంగ్రెస్ వైపే చూస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఎలాగో టీడీపీకి ఉనికి లేదు. అలాంటప్పుడు మళ్ళీ వారు టీడీపీ వైపుకు వెళ్లలేరు.

కానీ టీడీపీలో పనిచేసి, చంద్రబాబుని అభిమానించే రేవంత్ రెడ్డి ఇప్పుడు టి‌పి‌సి‌సి అధ్యక్షుడుగా ఉన్నారు. ఇక ఆయన బట్టి టీడీపీ క్యాడర్ కాంగ్రెస్ వైపుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు మరింతగా జిల్లాలో కాంగ్రెస్ బలం పెంచుకుంటే...ఇంకా ఖమ్మంలో కాంగ్రెస్‌కు తిరుగుండదనే చెప్పొచ్చు.  



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

"గుడ్ గవర్నెన్స్ వీక్" ప్రారంభించిన కేంద్రం... ఎందుకో తెలుసా..?

స్నేహితుడి భార్యపై కన్ను.. చివరికి ప్రాణం పోయింది?

పుష్పలో ఆ సీన్లు ఉండవంటున్న నిర్మాతలు...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>