MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna65b6ddd5-3d4b-420a-aff8-e378b86de5dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna65b6ddd5-3d4b-420a-aff8-e378b86de5dc-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ..యంగ్ హీరోలకి కూడా అందనంత ఎత్తులో ఉన్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో మొదటి సారి తన కెరీర్ లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈయన ..యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. డైలాగ్స్ చెప్పడంలో మన తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య తరువాతే ఎవరైనా అని మరో సారి ప్రూవ్ చేసాడు బాలయ్య. అఖండ సినిమాలో ఆయన చెప్పే ప్రతి డైలాగ్ ఎంత అధ్బుతంగా ఉందో మనం ఇప్పటికే చూసాం. ముఖ్యంగా ఈ సినిమాలో అఘోరగా ఆయన నోటి నుండి వచBalakrishna{#}anil ravipudi;boyapati srinu;Blockbuster hit;tamannaah bhatia;Josh;Director;Heroine;Telugu;Balakrishna;Manam;News;Mass;Cinemaబాలయ్య పక్కన ఆ హాట్ బ్యూటీ..ఇది మామూలు షాక్ కాదుగా..?బాలయ్య పక్కన ఆ హాట్ బ్యూటీ..ఇది మామూలు షాక్ కాదుగా..?Balakrishna{#}anil ravipudi;boyapati srinu;Blockbuster hit;tamannaah bhatia;Josh;Director;Heroine;Telugu;Balakrishna;Manam;News;Mass;CinemaSun, 19 Dec 2021 19:34:46 GMTనందమూరి బాలకృష్ణ ..యంగ్ హీరోలకి కూడా అందనంత ఎత్తులో ఉన్నాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన అఖండ సినిమాతో మొదటి సారి తన కెరీర్ లోనే 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈయన ..యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ అభిమానులను ఉత్సాహ పరుస్తున్నారు. డైలాగ్స్ చెప్పడంలో మన తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య తరువాతే ఎవరైనా అని మరో సారి ప్రూవ్ చేసాడు బాలయ్య. అఖండ సినిమాలో ఆయన చెప్పే ప్రతి డైలాగ్ ఎంత అధ్బుతంగా ఉందో మనం ఇప్పటికే చూసాం.

ముఖ్యంగా ఈ సినిమాలో అఘోరగా ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి డైలాగ్ అభిమానులకు బాగా రీచ్ అయ్యిందనే చెప్పాలి. ఇక అఖండతో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ..ఆ సినిమా చేస్తూనే మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. డైనమిక్ డైరెక్టర్ గోపీచంద్ మల్లినేని డైరెక్షన్ లో ఓ యాక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా స్టార్ డాటర్..టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తుంది. ఇక ఈ సినిమా కోసం అమ్మడు బరువు పెరగడానికి కూడా రెడి అయ్యిందట. ఇక ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో హాట్ బ్యూటి తమన్నా ఓ స్పెషల్ సాంగ్ ను చేయబోతుందట. ఫుల్ మాస్ బీట్ తో సాగిపోయేలా ఈ పాటను సెట్ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న తమన్నా ..బాలయ్యతో సినిమాలో ఐటెం సాంగ్ చేస్తారా అని అడిగినప్పుడు ..అసలు మిగతా డీటైల్స్ అడకుండానే..ఓకే చెప్పిందట. తమన్నాకు బాలయ్య అంటే అంత ఇష్టమట.  అందుకే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా బాలయ్య సినిమా అనగానే డేట్స్ అడ్జెస్ట్ చేసిందట. హాట్ బ్యూటి పక్కన బాలయ్య మాస్  స్టెప్పులు వేయనుండడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ సినిమా తరువాత అనీల్ రావిపూడి తో బాలయ్య ఇంకో సినిమా చేస్తున్నాడు. ఇలా వరుస సినిమాలకు కమిట్ అవుతూ యంగ్ హీరోలకు దడ పుట్టిస్తున్నాడు బాలయ్య.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

సైకిల్ పంచాయితీ: ఆ చౌదరీ గారికి రెడ్డి వర్గం దెబ్బవేసేలా ఉందిగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>