MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/mb-ssr91164340-2b3c-43ed-af06-cac4f437daeb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/mb-ssr91164340-2b3c-43ed-af06-cac4f437daeb-415x250-IndiaHerald.jpg ఫిల్మ్ ఇండ‌స్ట్రీకి సంబంధించి కొన్ని అరుదైన కాంబోల కోసం అభిమానులకు ఏళ్ల త‌ర‌బ‌డి ఎదురు చూపులు తప్ప‌వు. ఇలాంటి అరుదైన కాంబినేష‌నే సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌- దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిది. ఈ ఇద్ద‌రూ ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు ద‌శాబ్దాలు దాటిపోయింది. రాజ‌కుమారుడుగా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన మ‌హేష్ ప‌లు ఇండ‌స్ట్రీ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఎదిగాడు. MB-SSR{#}James Bond;Bahubali;Hollywood;RRR Movie;Tollywood;Chitram;Cinemaరాజ‌మౌళి మౌనంతోనే మ‌హేష్‌ సినిమాకు ప‌బ్లిసిటీ..?రాజ‌మౌళి మౌనంతోనే మ‌హేష్‌ సినిమాకు ప‌బ్లిసిటీ..?MB-SSR{#}James Bond;Bahubali;Hollywood;RRR Movie;Tollywood;Chitram;CinemaSun, 19 Dec 2021 22:15:00 GMTటాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌గా ఎదిగాడు. ఇక రాజ‌మౌళి ఇప్ప‌టిదాకా ప‌రాజ‌యం ఏంటో తెలియ‌ని ప్ర‌స్థానాన్ని సాగిస్తూ బాహుబ‌లి చిత్రంతో ఏకంగా దేశంలోనే నెంబ‌ర్‌వ‌న్ ద‌ర్శ‌కుడిగా మారిపోయాడు. అయితే వీరిద్ద‌రి కాంబోలో ఓ సినిమా రాబోతోందని ప‌దేళ్లుగా వార్త‌లు రావ‌డ‌మేగానీ ఇప్ప‌టిదాకా అది సాకారం కాలేదు. ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉన్న వీరిద్ద‌రి కాంబోలో సినిమా రాక‌పోవ‌డం విచిత్ర‌మేన‌ని చెప్పాలి.
       
          నిజానికి బాహుబలి సీక్వెల్ త‌ర్వాత మ‌హేష్- రాజ‌మౌళి సినిమా ఖాయ‌మేన‌న్న వార్త‌లు వ‌చ్చినా, కార‌ణాలేమిటో తెలియ‌దుగానీ జ‌క్క‌న్న ఆర్ఆర్ఆర్ మూవీ తెర‌కెక్కించ‌డంపైనే దృష్టిసారించాడు. అయితే మ‌హేష్ కు త‌గిన క‌థ‌కోసమే ఆగార‌ని ఈలోగా ఆర్ఆర్ఆర్ స్క్రిప్టు సిద్ధం కావ‌డంతో దానినే ప‌ట్టాలెక్కించాడ‌న్న అభిప్రాయాలు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో వినిపించ‌డ‌మే కానీ జ‌క్క‌న్న ఈ విష‌యంపై ఇప్ప‌టికీ నోరు విప్పి చెప్పింది లేదు.
అయితే మ‌హేష్‌తో చిత్రం ఖాయ‌మేన‌ని, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత దాని గురించి మాట్లాడ‌తాన‌ని మాత్ర‌మే చెప్పాడు. ఇక ఈ చిత్ర క‌థ గురించి ప‌లు వాద‌న‌లు వినిపిస్తున్నా.. అవి ఊహాగానాలే త‌ప్ప ఇతమిద్దంగా ఎవ‌రికీ ఏమీ తెలియ‌దు. ఆర్ఆర్ఆర్ చిత్రం త‌రువాత వ‌చ్చే సినిమా కాబ‌ట్టి ఇది మ‌రింత భారీగా ఉండ‌బోతోంద‌ని, జేమ్స్ బాండ్ త‌ర‌హాలో హాలీవుడ్ స్థాయిలో తెర‌కెక్క‌బోతోంద‌ని మ‌హేష్ అభిమానులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ప్ర‌మోష‌న్ల‌తో బిజీగా ఉన్న రాజ‌మౌళి ఈ విష‌యంపై మాత్రం అస్స‌లు పెద‌వి విప్ప‌డం లేదు. ఒక‌ర‌కంగా క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అంటూ తీవ్ర ఉత్కంఠ‌లో ప్రేక్ష‌కుల‌ను ఉంచిన‌ట్టే మ‌హేష్ మూవీ విష‌యంలో రాజ‌మౌళి వ్యూహాత్మ‌క మౌనం పాటిస్తున్నాడు. త‌ద్వారా ఆ చిత్రం ఇంకా ప్రారంభం కాకుండానే దానికి ఊహించ‌ని స్థాయి ప‌బ్లిసిటీ వ‌చ్చేలా చూసుకుంటున్నాడ‌ని చెప్పాలి.





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

సైకిల్ పంచాయితీ: ఆ చౌదరీ గారికి రెడ్డి వర్గం దెబ్బవేసేలా ఉందిగా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>