Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli98b3ff70-9ea3-4301-8751-bbf124463a1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rajamouli98b3ff70-9ea3-4301-8751-bbf124463a1e-415x250-IndiaHerald.jpgసినిమా తీసేటప్పుడు తాను హీరో కష్ట సుఖాల గురించి ఆలోచించనని అగ్ర దర్శకుడు రాజమౌళి అన్నారట.. ఒకవేళ బాలకృష్ణతో సినిమా చేస్తుంటే తన వ్యవహారశైలి వల్ల ఆయనకు ఏమైనా కోపం వస్తుందేమోనన్న భయంతోనే సినిమా చేయడానికి ముందుకు రాలేదని చెప్పుకొచ్చారట.. బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే తాజాగా షోకు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మరియు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విచ్చేసి సందడి చేశారట.. ఈ సందర్భంగా ''ఇప్పటివరకూ మన కాంబినేషన్‌ పడలేదు నా అభిమానులు మిమ్మల్ని Rajamouli{#}Sangeetha;Balakrishna;Darsakudu;Director;Rajamouli;Hero;Cinemaఅయ్యో..బాలయ్యతో సినిమా చేయాలంటే భయం అంటున్న రాజమౌళి...!అయ్యో..బాలయ్యతో సినిమా చేయాలంటే భయం అంటున్న రాజమౌళి...!Rajamouli{#}Sangeetha;Balakrishna;Darsakudu;Director;Rajamouli;Hero;CinemaSat, 18 Dec 2021 22:48:00 GMTసినిమా తీసేటప్పుడు తాను హీరో కష్ట సుఖాల గురించి ఆలోచించనని అగ్ర దర్శకుడు రాజమౌళి అన్నారట.. ఒకవేళ బాలకృష్ణతో సినిమా చేస్తుంటే తన వ్యవహారశైలి వల్ల ఆయనకు ఏమైనా కోపం వస్తుందేమోనన్న భయంతోనే సినిమా చేయడానికి ముందుకు రాలేదని చెప్పుకొచ్చారట..

బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్‌ షో 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే తాజాగా షోకు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మరియు సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విచ్చేసి సందడి చేశారట..

ఈ సందర్భంగా ''ఇప్పటివరకూ మన కాంబినేషన్‌ పడలేదు నా అభిమానులు మిమ్మల్ని 'బాలయ్యతో సినిమా ఎప్పుడు చేస్తారు' అని అడిగితే 'బాలకృష్ణను నేను హ్యాండిల్‌ చేయలేను' అన్నారట ఎందుకు'' అని ప్రశ్నించాదట  బాలయ్య.''భయంతోనే అలా అన్నాను. చిన్న వాళ్ల దగ్గరి నుంచి పెద్ద వాళ్ల వరకూ మీరు అందరికీ గౌరవం ఇస్తారని చాలా పద్ధతిగా ఉంటారని నేను సినిమా షూటింగ్‌ చేసేటప్పుడు ఎలా ఉంటానో నాకు తెలియదని నాకు ఎవరైనా 'గుడ్‌ మార్నింగ్‌' చెబితే చిరాకు షాట్‌ పెట్టుకుని పక్కన హీరో ఎండలో నిలబడ్డాడా? వానలో నిలబడ్డాడా? అన్నది చూడనని నా ఫ్రేమ్‌ రెడీ అయ్యే వరకూ హీరో కష్ట సుఖాలు ఆలోచించలేనని చెప్పాడట. ఒక వేళ మిమ్మల్ని డైరెక్ట్‌ చేయాల్సి వస్తే, మీకేమైనా కోపం వస్తుందేమోనని భయం అని చెప్పాడట. నాకు అదే టెన్షన్'' అని సమాధానం ఇచ్చారట. వెంటనే అందుకున్న బాలకృష్ణ ''నేను ఒకసారి క్యారావ్యాన్‌లోని నుంచి బయటకు వస్తే  ఆ రోజు షూటింగ్‌ అయ్యే వరకూ లోపలకి వెళ్లను గొడుగు పట్టనివ్వను'' అని చెప్పుకొచ్చారట.

ఇక మీరు సినిమా చేయడానికి రెండు మూడేళ్లు ఎందుకు పడుతోంది? అని ప్రశ్నించగా, ''నేను మైండ్‌లో అనుకున్న విధంగా వస్తుందా? లేదా? అని రోజూ భయపడుతూ ఉంటానని అందుకే ఒకటికి, రెండుసార్లు ప్రతిదీ చెక్‌ చేసుకుంటానని ఎందుకంటే సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుడికి పూర్తి వినోదం అందించాలి'' అని జక్కన్న సమాధానం ఇచ్చారట.

'స్టూడెంట్‌ నెం.1' కంటే ముందు నన్ను కలిశారా?నాకు ఒక కథ చెప్పారనుకుంటా కదా అన్నారట బాలయ్య.  ఆ తర్వాత రామ్‌చరణ్‌తో తీశారా? అని అడగ్గా, 'నాన్నగారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు రెండుమూడుసార్లు కలిశానని ఆ తర్వాత 'ఛత్రపతి' సమయంలో 'మగధీర' కథ చెప్పాను'' అని రాజమౌళి తెలిపారట.ఇక 'మీతో సినిమా చేస్తే, హీరోకు మరియు ఇండస్ట్రీకి హిట్‌ ఇస్తారు కానీ  ఆ హీరో తర్వాతి రెండు మూడు సినిమాలు ఫసక్‌ అట కదా' అని అనగా  'నాకు ఎటువంటి సంబంధం లేదని నా సినిమా వరకూ నేను బాధ్యతతో ఉంటా' అంటూ రాజమౌళి నవ్వేశారట.. తనకు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద సినిమాలు తీయాలని ఉండేదని ఎప్పటికైనా 'బెన్‌హర్‌'లాంటి చేయాలన్న ఆలోచనతో ఉండేవాడినని రాజమౌళి చెప్పుకొచ్చారట.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

హోదాపై ఏపీ ఆశలు పెంచుతున్న బీహార్

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>