PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp0e8cd28d-ff2a-44c3-8110-b4f1167f8c78-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp0e8cd28d-ff2a-44c3-8110-b4f1167f8c78-415x250-IndiaHerald.jpgనాయకులు ఎప్పుడు రాజకీయ అవసరాలకు తగ్గట్టుగానే ముందుకెళ్తారని చెప్పొచ్చు. అవసరం, అవకాశం బట్టే రాజకీయం చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు...అందుకు తగ్గట్టుగానే పార్టీలు కూడా మారుస్తూ ఉంటారు. అలా ఏపీలో ఎప్పుడు నేతలు పార్టీలు మారుస్తూనే ఉంటారు. అంటే అవకాశాన్ని బట్టి ముందుకెళుతుంటారు. అలా రాష్ట్ర విభజన జరిగాక చాలామంది కాంగ్రెస్ నేతలు..తమ అవసరం, అవకాశాన్ని బట్టి వైసీపీ, టీడీపీల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. tdp{#}Araku Valley;Parliment;Yevaru;Minister;central government;YCP;Jagan;TDP;Assembly;Congressఆ కేంద్ర మాజీ మంత్రి మళ్ళీ టీడీపీలోకి వస్తారా?ఆ కేంద్ర మాజీ మంత్రి మళ్ళీ టీడీపీలోకి వస్తారా?tdp{#}Araku Valley;Parliment;Yevaru;Minister;central government;YCP;Jagan;TDP;Assembly;CongressSat, 18 Dec 2021 01:00:00 GMTనాయకులు ఎప్పుడు రాజకీయ అవసరాలకు తగ్గట్టుగానే ముందుకెళ్తారని చెప్పొచ్చు. అవసరం, అవకాశం బట్టే రాజకీయం చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు...అందుకు తగ్గట్టుగానే పార్టీలు కూడా మారుస్తూ ఉంటారు. అలా ఏపీలో ఎప్పుడు నేతలు పార్టీలు మారుస్తూనే ఉంటారు. అంటే అవకాశాన్ని బట్టి ముందుకెళుతుంటారు. అలా రాష్ట్ర విభజన జరిగాక చాలామంది కాంగ్రెస్ నేతలు..తమ అవసరం, అవకాశాన్ని బట్టి వైసీపీ, టీడీపీల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.

అయితే టీడీపీ అధికారంలో ఉండగా టీడీపీలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు బాగానే యాక్టివ్ గానే ఉన్నారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి....వైసీపీలో ఉన్న హస్తం నేతలు ఫుల్ హ్యాపీ. కాకపోతే టీడీపీ అధికారం కోల్పోవడంతో...చాలామంది టీడీపీ నేతలే అడ్రెస్ లేకుండా పోయారు. అలాగే హస్తం నేతలు కూడా సైడ్ అయిపోయారు. ఎన్నికల తర్వాత ఎవరికి వారు సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏపీలో రాజకీయ పరిస్తితులు మారుతున్నాయి. దీంతో మళ్ళీ కొందరు నేతలు యాక్టివ్ అవ్వడానికి చూస్తున్నారని తెలిసింది.

అలా కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ కూడా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అనేక ఏళ్ళు కాంగ్రెస్‌లో పనిచేసిన కిషోర్..అరకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్ పని క్లోజ్ అవ్వడంతో...గత ఎన్నికల ముందు కిషోర్...టీడీపీలోకి వచ్చారు.

అరకు పార్లమెంట్ సీటు దక్కించుకుని పోటీ చేశారు. ఇక జగన్ వేవ్‌లో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇలా ఓడిపోవడమే ఆలస్యం...మళ్ళీ ఆయన పార్టీలో కనిపించలేదు. ఇంతవరకు అడ్రెస్ లేరు. ఆయన వెళ్లిపోయాక అరకు స్థానానికి మరొక ఇంచార్జ్‌ని కూడా పెట్టలేదు. పైగా అక్కడ నెక్స్ట్ ఎవరు పోటీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదు. అరకు పార్లమెంట్ అధ్యక్షురాలుగా ఉన్న సంధ్యారాణి..సాలూరు అసెంబ్లీ బాధ్యతలు అప్పగించారు. కాబట్టి అరకు పార్లమెంట్‌ ఖాళీగా ఉంది. మరి నెక్స్ట్ ఎన్నికల ముందు కిషోర్ మళ్ళీ టీడీపీలోకి రీఎంట్రీ ఇచ్చి అరకు బరిలో పోటీ చేస్తారేమో చూడాలి.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఆ కేంద్ర మాజీ మంత్రి మళ్ళీ టీడీపీలోకి వస్తారా?

బ్రేకింగ్ : రేపు ఢిల్లికీ.. తెలంగాణ మంత్రులు..?

మరో విధ్వంసానికి రంగం సిద్ధం చేసిన బాలయ్య!!

సమంతకు జలక్ ఇచ్చిన అక్కినేని ఫ్యాన్స్..!

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఫినాలేకి ముందే సిరి ఎలిమినేషన్?

సినిమా టికెట్ల పై బాలకృష్ణ ఎక్కడా తప్పుగా మాట్లాడలేదు ?

పుష్ప:సుక్కు లెక్క అక్కడ ఎలా తగ్గిందబ్బా?

అన్ని భాషల్లో అదే దూకుడు.. పుష్ప రైసెస్!!

ఆది సినిమాలో ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా..??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>