PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-ccd1375e-e62d-4279-916d-de05fb64dcab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-ccd1375e-e62d-4279-916d-de05fb64dcab-415x250-IndiaHerald.jpgనరేంద్ర మోడీ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత తీసుకురావడమే టార్గెట్ గా టూర్లు సాగుతున్నాయి. తన జిల్లాల టూర్ ను కేసీఆర్ వనపర్తితో మొదలు పెడుతున్నారు. తర్వాత జనగామ, నాగర్ కర్నూల్, జగిత్యాల, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా పర్యటిస్తారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన, డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభోత్సవం అని చెబుతున్నా తన ఉద్దేశ్యం అయితే కేంద్రాన్ని టార్గెట్ చేయడమే. పైగా ప్రతి చోట రైతులకు కేంద్రం చేసిన ద్రోహం గురించి వివరిస్తారని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణలో ముందPolitical {#}Dookudu;Huzurabad;central government;history;CM;Congress;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Elections;Bharatiya Janata Party;District;Party;Decemberకేసీఆర్ నయా ప్లాన్.. అంతా ముందస్తు కోసమేనా..!కేసీఆర్ నయా ప్లాన్.. అంతా ముందస్తు కోసమేనా..!Political {#}Dookudu;Huzurabad;central government;history;CM;Congress;KCR;Telangana Rashtra Samithi TRS;Telangana;Elections;Bharatiya Janata Party;District;Party;DecemberSat, 18 Dec 2021 14:05:00 GMTతెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు పెంచారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత విపక్షాలపై దూకుడు పెంచారు. కెసిఆర్ ముఖ్యంగా బిజెపి ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. దాన్యం కొనుగోలు విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టేందుకు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధి,విధానాలను తెలంగాణ కు నష్టం చేస్తున్నాయని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లేందుకు పార్టీ వర్గాలతో చర్చించారు. మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,డిసిసిబి, డీసీఎంఎస్, రైతుబంధు జిల్లా కమిటీలు, కార్పొరేషన్ల చైర్మన్ లతో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సమావేశానికి హాజరవ్వగా వారికి కీలక సూచనలు చేశారు.

కెసిఆర్ దూకుడు చూస్తుంటే ముందస్తు ఎన్నికలకు వెళతారా అన్న చర్చ సాగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన చరిత్ర కూడా కేసీఆర్ కు ఉంది. 2019లో జరగాల్సిన షెడ్యూల్ ఎన్నికలను ఆరు నెలల ముందు జరిపితే 2018 డిసెంబర్ లో నిర్వహించారు. ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత వస్తే కష్టమన్న ఆలోచనతోనే కేసీఆర్ అప్పట్లో మధ్యంతరం జపం చేశారు. అప్పటికే పోల్చుకుంటే ఇప్పుడే  ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుందని విపక్షాలు నమ్ముతున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాల అయినా బిజెపి, కాంగ్రెస్ కేసీఆర్ తో పాటు ఆయన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అన్ని అస్త్రాలు వాడిన టిఆర్ఎస్ కు ఓటమి తప్పలేదు. అప్పటి నుంచే మధ్యంతర ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుత విషయానికి వస్తే కేంద్రంపై కేసీఆర్ యుద్ధం అనే ప్రకటించారు. కేంద్రాన్ని ఎంతగా డీఫేమ్ చేయాలో అంతా చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈనెల 19వ తేదీ నుంచి జిల్లాల టూర్ లు మొదలు పెడుతున్నారు.

నరేంద్ర మోడీ సర్కార్ పై జనాల్లో వ్యతిరేకత తీసుకురావడమే టార్గెట్ గా టూర్లు సాగుతున్నాయి. తన జిల్లాల టూర్ ను కేసీఆర్ వనపర్తితో మొదలు పెడుతున్నారు. తర్వాత జనగామ, నాగర్ కర్నూల్, జగిత్యాల, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలో కూడా పర్యటిస్తారు. కలెక్టరేట్ల ప్రారంభోత్సవాలు, ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన, డబుల్ బెడ్ రూమ్ ల ప్రారంభోత్సవం అని చెబుతున్నా తన ఉద్దేశ్యం అయితే కేంద్రాన్ని టార్గెట్ చేయడమే. పైగా ప్రతి చోట రైతులకు కేంద్రం చేసిన ద్రోహం గురించి వివరిస్తారని సమాచారం. దీన్ని బట్టి చూస్తుంటే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పదనే అనిపిస్తోంది.



తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పుష్ప : ఏంది సోమీ బొమ్మ క‌త! ఎట్టా ఉండాదేటి?

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!

అదొరోగం : అప్పు చేసి పప్పు కూడు.. తప్పదిది..!

పుష్ప : టికెట్ల ధ‌ర పెంపున‌కు అనుమ‌తి.. ఎక్క‌డంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>