MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/otta3cc4cd1-eb31-422e-b361-bbf09bae7ea2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/otta3cc4cd1-eb31-422e-b361-bbf09bae7ea2-415x250-IndiaHerald.jpgఏపీలో ప్ర‌భుత్వానికి, సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు మ‌ధ్య విభేదాలు పెరిగి వైరంగా మారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వం వైఖ‌రి త‌మ నాయ‌కుడి సినిమాల‌కు న‌ష్టం చేసేందుకేన‌ని అటు జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఆరోపిస్తుండ‌గా ఇటు ఇత‌ర హీరోల సినిమాల‌కూ ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌డంతో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న చిత్రాల నిర్మాత‌లు ఏం చేయాలో తెలియ‌క‌ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. OTT{#}Kick;court;Chitram;CM;Cinema;Andhra Pradesh;Party;YCPచిన్న సినిమాల‌న్నీ ఇక ఓటీటీ బాట ప‌డ‌తాయా..?చిన్న సినిమాల‌న్నీ ఇక ఓటీటీ బాట ప‌డ‌తాయా..?OTT{#}Kick;court;Chitram;CM;Cinema;Andhra Pradesh;Party;YCPSat, 18 Dec 2021 23:06:15 GMT           ఏపీలో ప్ర‌భుత్వానికి, సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల‌కు మ‌ధ్య విభేదాలు పెరిగి వైరంగా మారుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. వైసీపీ ప్ర‌భుత్వం వైఖ‌రి త‌మ నాయ‌కుడి సినిమాల‌కు న‌ష్టం చేసేందుకేన‌ని అటు జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఆరోపిస్తుండ‌గా ఇటు ఇత‌ర హీరోల సినిమాల‌కూ ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌డంతో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతున్న చిత్రాల నిర్మాత‌లు ఏం చేయాలో తెలియ‌క‌ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గ‌తంలో సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్‌క‌ల్యాణ్ విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించిన త‌రువాత‌నే వైసీపీ ప్ర‌భుత్వం క‌ఠిన వైఖ‌రి తీసుకుంద‌న్న‌ది మాత్రం వాస్త‌వ‌మే. ఈ ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ అఖండ సినిమా మొద‌ట‌గా ప్ర‌భావిత‌మైంది. ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లలో టికెట్ల ధరలపై నియంత్రణ తీసుకురావడం, వాటిని ఆన్‌లైన్‌లోనే అమ్మేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం చిత్ర ప‌రిశ్ర‌మ‌ను షాక్‌కి గురి చేసింద‌నే చెప్పాలి. దీనిపై ప‌లువురు ఎగ్జిబిట‌ర్లు హైకోర్టుకు వెళ్ల‌డంతో కోర్టు ప్ర‌భుత్వ జీవోను కొట్టివేసింది. అయితే వైసీపీ ప్ర‌భుత్వం మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా కోర్టును ఆశ్ర‌యించినవారికి మాత్ర‌మే ఆ ఆదేశాలు వ‌ర్తిస్తాయ‌ని మిగ‌తా థియేట‌ర్ల వారంతా ప్ర‌భుత్వ నిర్ణ‌యం ప్ర‌కారం న‌డుచుకోవాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దీంతో ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు ఖంగు తిన్నాయి. ఇప్పుడు మిగిలిన‌వారు కూడా కోర్టును ఆశ్ర‌యించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం బ‌న్నీ పుష్ప చిత్రం కూడా ఏపీలో ఈ ఆంక్ష‌ల ప్ర‌భావాన్ని ఎదుర్కొంటోంది. ఏదేమైనా ఏపీ ప్ర‌భుత్వ వైఖ‌రిపై ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ‌లు సాగుతున్నాయి. ఏపీలో చిత్ర ప‌రిశ్ర‌మ వేళ్లూనుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిపోయి ప‌రిశ్ర‌మ‌కు నష్టం క‌లిగించే నిర్ణ‌యాలేమిటంటూ ప‌లువురు వాపోతున్నారు.

         నిజానికి చిన్న సినిమాల‌కు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో పెద్ద‌గా స‌మ‌స్య‌లు లేక‌పోవ‌చ్చు. గ‌తంలో పెద్ద సినిమాలు వ‌చ్చిన‌పుడు థియేట‌ర్లు దొర‌క‌క చిన్న చిత్రాల నిర్మాత‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డేవారు. దొరికినా వారి సినిమాల‌కు వ‌చ్చే క‌లెక్ష‌న్లు థియేట‌ర్ రెంట్ల‌కే స‌రిపోవ‌డంతో తీవ్రంగా న‌ష్ట‌పోయేవారు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ రావ‌డం ఒక‌ర‌కంగా చిన్న సినిమాల‌కు మంచి ప‌రిణామ‌మే. సినిమాలో విష‌యం ఉంటే ఆద‌ర‌ణ ద‌క్కే అవ‌కాశం ఉంది. అయితే పెద్ద సినిమాల‌కు మాత్రం థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తేనే మ‌నుగ‌డ సాధ్యం. అదికూడా టికెట్ ధ‌ర‌లు పెంచుకునే విష‌యంలో త‌గిన వెసులుబాటు ఉంటేనే అవి గ‌ట్టెక్క‌గ‌ల‌వు. అంతేకాదు.. భారీ స్థాయిలో తెర‌కెక్కే సినిమాల‌ను బిగ్‌స్క్రీన్‌పై చూస్తే  ప్రేక్ష‌కుల‌కు వ‌చ్చే కిక్ బుల్లి తెర‌పై రాదు. దీంతో పెద్ద సినిమాల‌పైనే ప్ర‌భుత్వ ఆంక్ష‌లు ఎక్కువ ప్ర‌భావం చూపుతాయ‌ని, భారీ పెట్టుబ‌డుల‌తో చిత్రాలు తీసేందుకు ఎవ‌రూ ముందుకురార‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిన‌ ఆర్ఆర్ఆర్‌తో పాటు మ‌రికొన్నిభారీ చిత్రాలు విడుద‌లకు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో ప్ర‌భుత్వం త‌న నిర్ణ‌యం మార్చుకుంటుందో లేక  ఇదే వైఖ‌రిని కొన‌సాగిస్తుందో తెలియ‌క ఆ చిత్రాల నిర్మాత‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.





తిప్పండ్రా మీసం : మోడీ మెచ్చాడ్రా మా ఎంపీని చూసి!

పుష్ప : ఆడు నా శిష్యుడు అందుకే ఇర‌గ‌దీశాడు?

పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

హోదాపై ఏపీ ఆశలు పెంచుతున్న బీహార్

టీ కాంగ్రెస్‌లో ర‌చ్చ ర‌చ్చ‌.. ఆ ఎమ్మెల్యేయే టార్గెట్ ?

జగన్‌... సెంటర్ ఆఫ్ పాలిటిక్స్...!

చైతన్యం : రెండు ముఖాలు.. వద్దు..!

ఓటుకు అర్హులే కానీ.. పెళ్లికి కాదా... ఓవైసీ ప్రశ్న...!

క‌న్నాపై బాబుకు ఇంత ప్రేమ ఎందుకు.. ఇంత క‌థ ఉందా..?

వారెవ్వా : ఒకే వేదిక‌పై ప్ర‌త్య‌ర్థులు ?

ఢిల్లీ ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం..!

పుష్ప: పుష్ప బొమ్మ అక్కడ హిట్.. మరి ఇక్కడ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>