PoliticsN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ap-employees9a7e74cb-8ede-402b-a803-1ab44a86e334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-ap-employees9a7e74cb-8ede-402b-a803-1ab44a86e334-415x250-IndiaHerald.jpgముఖ్యంగా ఏపీ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి గురువారం రాత్రి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇరు జేఏసీ నేత‌ల‌తో మాట్లాడి.. చాలా రోజుల నుంచి వారు ఇచ్చిన విజ్ఞ‌ప్తుల‌ను తీసుకున్నామ‌ని.. క‌రోనాతో పాటు వివిధ అంశాల వ‌ల్ల జాప్యం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం అనేది ఒక కుటుంబం అని, ఉద్యోగులు కూడా అందులో భాగ‌మ‌ని.. ఉద్యోగుల‌కు సంబంధించిన అంశాలు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అవుతాయ‌ని మంత్రి బుగ్గ‌న హామీ ఇవ్వ‌డంతో ఉద్యోగ సంఘాలు స‌మ్మెను తాత్కాలి#AP employees{#}JAC;Amaravathi;thursday;Amaravati;Andhra Pradesh;Assembly;Ministerఏపీ : ఉద్యోగుల స‌మ్మె వాయిదాకు కార‌ణం అదేనా..?ఏపీ : ఉద్యోగుల స‌మ్మె వాయిదాకు కార‌ణం అదేనా..?#AP employees{#}JAC;Amaravathi;thursday;Amaravati;Andhra Pradesh;Assembly;MinisterFri, 17 Dec 2021 05:38:15 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజుల నుంచి పీఆర్సీ తో పాటు మ‌రొక 71 అంశాల‌పై వివాదం త‌లెత్తుతుంది. ఉద్యోగ సంఘాల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవ్వ‌డం లేద‌ని.. ప‌లుమార్లు సీఎం, సీఎస్‌, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, మంత్రి ఇలా ద‌ఫాలుగా ఒక్కొక్క‌రినీ భేటీ అవుతున్నారు. అయినా త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవ్వ‌డం లేద‌ని ఉద్యోగ సంఘాలు ఉద్య‌మం చేప‌ట్ట‌డం మొద‌లు పెట్టాయి. నిన్న ఆర్థిక మంత్రి బుగ్గ‌న భేటీ త‌రువాత.. డిసెంబ‌ర్ 07 నుంచి కాస్త ఆందోళ‌న‌గా ఉన్నామ‌ని, తాత్కాలికంగా ఉద్య‌మ‌కార్య‌చ‌ర‌ణ‌ను వాయిదా వేసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.  

ముఖ్యంగా ఏపీ ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి గురువారం రాత్రి చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇరు జేఏసీ నేత‌ల‌తో మాట్లాడి.. చాలా రోజుల నుంచి వారు ఇచ్చిన విజ్ఞ‌ప్తుల‌ను తీసుకున్నామ‌ని.. క‌రోనాతో పాటు వివిధ అంశాల వ‌ల్ల జాప్యం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేసారు. ముఖ్యంగా ప్ర‌భుత్వం అనేది ఒక కుటుంబం అని, ఉద్యోగులు కూడా అందులో భాగ‌మ‌ని.. ఉద్యోగుల‌కు సంబంధించిన అంశాలు త్వ‌ర‌లోనే ప‌రిష్కారం అవుతాయ‌ని మంత్రి బుగ్గ‌న హామీ ఇవ్వ‌డంతో ఉద్యోగ సంఘాలు స‌మ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించాయి.

ఉద్యోగుల డిమాండ్ల‌పై 9 సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ‌ని.. వారిని విర‌మించాల‌ని ప్ర‌భుత్వం త‌రుపున వారి డిమాండ్ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని మంత్రి వెల్ల‌డించారు. మ‌రోవైపు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమ‌రావ‌తి ఉద్యోగ సంఘాల నేత‌లతో రాష్ట్ర ప్ర‌భుత్వం వేర్వేరుగా భేటీ అయ్యారు.  ముఖ్యంగా పీఆర్‌సీ, ఉద్యోగ సంఘాలు ప్ర‌తిపాదించిన ప్ర‌ధాన అంశాల‌పై భేటీలో చ‌ర్చించారు. ఉద్యోగ సంఘం నేత వెంక‌ట్రామిరెడ్డి స్పందిస్తూ..ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు సంబంధించి 85 అశాలు నివేదించామ‌ని, స‌చివాల‌యంలో అద‌న‌పు పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని, అద‌న‌పు ప‌ని భారం పెరిగింద‌ని.. అసెంబ్లీ ఉద్యోగుల‌కు అమ‌రావ‌తిలో ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్టు గుర్తు చేసారు. మ‌రోవైపు మా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించిన‌ద‌ని.. ప్ర‌భుత్వం రాత‌పూర్వ‌కంగా హామీ ఇస్తామ‌ని చెప్పింద‌ని అందుకే తాత్కాలికంగా ఉద్య‌మ‌కార్య‌చ‌ర‌ణ‌ను వాయిదా వేస్తున్న‌ట్టు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్ప‌రాజు తెలిపారు.

 



వామ్మో.. చెడ్డి గ్యాంగ్ అక్కడికి జంప్?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>