PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpf4f1f541-4c89-466a-b076-b583b5f6e8d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjpf4f1f541-4c89-466a-b076-b583b5f6e8d2-415x250-IndiaHerald.jpgనీతి ఆయోగ్ మరోసారి ప్రత్యేక హోదా చిచ్చును రాజేసింది. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా అత్యవసరం ఉన్న రాష్ట్రాలుగా బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లను నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఆయా రాష్ట్రాలలో పేదరికం 50శాతం ఉందని, వాటిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. అయితే వీటిపై శ్రద్ద తీసుకోవద్దని ఎవరూ కూడా అనరు కానీ, గతంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి కూడా ఇచ్చేది లేదు అని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నీతి ఆయోగ్ ను specialstatus{#}NITI Aayog;Parliment;Vishakapatnam;Yevaru;Andhra Pradesh;Nijam;Bharatiya Janata Party;Congress;Partyహోదా : చిక్కుల్లో.. బీజేపీ పడినట్టేనా..!హోదా : చిక్కుల్లో.. బీజేపీ పడినట్టేనా..!specialstatus{#}NITI Aayog;Parliment;Vishakapatnam;Yevaru;Andhra Pradesh;Nijam;Bharatiya Janata Party;Congress;PartyFri, 17 Dec 2021 14:15:54 GMTనీతి ఆయోగ్ మరోసారి ప్రత్యేక హోదా చిచ్చును రాజేసింది. ప్రస్తుతం దేశంలో ప్రత్యేక హోదా అత్యవసరం ఉన్న రాష్ట్రాలుగా బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లను నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. ఆయా రాష్ట్రాలలో పేదరికం 50శాతం ఉందని, వాటిపై కేంద్రం ప్రత్యేక శ్రద్ద చూపాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేసింది. అయితే వీటిపై శ్రద్ద తీసుకోవద్దని ఎవరూ కూడా అనరు కానీ, గతంలో పార్లమెంట్ సాక్షిగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి కూడా ఇచ్చేది లేదు అని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంగా నీతి ఆయోగ్ ను అడ్డుపెట్టుకొని ఆయా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని సిఫారసు చేపించిందని విపక్షాలు దీనిపై గగ్గోలు పెడుతున్నాయి.

అందులో నిజం ఉన్నది లేనిది అందరికి తెలుసు. బీజేపీ కూడా ఎన్నికల సందర్భంలో కొత్త ఎత్తులు వేస్తూ ముందుకు పోతుండటం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఎత్తులు బాగానే ఉండొచ్చుగాక, కానీ ఒకవైపు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం ఉన్నప్పటికీ దానిని పట్టించుకోవడం లేదనేది మరోసారి ఈ నీతి ఆయోగ్ సిఫారసుతో వెలుగులోకి వచ్చింది. ఈ సమస్య లేవనెత్తుతారు అనే ఉద్దేశ్యంతోనే నీతి ఆయోగ్ కూడా ఏపీని కలిపి నివేదిక ఇచ్చింది, అదేమంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో 12 శాతం మాత్రమే పేదరికం ఉన్నదని, అందుకే దానికి ప్రత్యేక హోదా అవసరం ఉండబోదని పేర్కొంది. ఇవన్నీ చూస్తుంటే బీజేపీ ఖచ్చితంగా ఎన్నికల సమయంలో కొత్త సమస్యలతో ముందుకు పోవాల్సి వచ్చేట్టుగానే ఉంది.

పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారు సరే, దానికి ఎవరు అడ్డురారు. మరి విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీ ఏమైంది అనేదానికి కూడా సరైన సమాధానం చెప్పాల్సి ఉంది. అలా చెప్పకుండా గనక ఆయా రాష్ట్రాలకు హోదా ఇచ్చేస్తే, బీజేపీ కూడా ఏపీలో భూస్థాపితం అయిపోవడం ఖాయం. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయినట్టే. దానికి హోదా విషయం కూడా తోడైతే దేశంలో కాంగ్రెస్ మాదిరే ఏపీలో బీజేపీ పరిస్థితి. ఈ విషయం పట్ల బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ కొట్టుకుంటున్నందు వలన విసిగిపోయిన ప్రజలు బీజేపీ ని ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్న సమయంలో హోదా నిర్ణయంతో పార్టీని బీజేపీ చంపేసుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

ఇదేందయ్యా ఇది.. దేంతో పకోడీ చేసాడో తెలుసా?

అమ్మ: గర్భిణులకు డయాబెటిస్ వస్తే ఏం జరుగుతుంది..??

' పుష్ప ' రివ్యూ: ఒక్క స్టెప్‌తో ముంబైను షేక్ చేసిన ర‌ష్మిక

పుష్ప తేడా వస్తే.. షర్ట్ విప్పుకొని తిరుగుతా..!

పుష్ప : క్రియెటివ్ ఇమేజరీ ఎంత?

పుష్ప 3వదే.. బన్నీ తో 7 సినిమాలు పక్కా..!

' పుష్ప ' రివ్యూ: సుక్కు చేసిన పెద్ద త‌ప్పు ఇదే..!

పుష్ప : ఆ సౌండేట్రా..ఆ స్టామినా ఏట్రా...అడ్డ‌డ్డే త‌గ్గేదేలే!

పుష్ప ది రైజ్ : రివ్యూ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>