PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp362aac5a-2a10-433f-83aa-2dfa69d57989-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp362aac5a-2a10-433f-83aa-2dfa69d57989-415x250-IndiaHerald.jpgనెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు....ఇప్పటినుంచే గెలుపు గుర్రాలని వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంచార్జ్‌లు ఉన్నారు. ఏదో కొన్ని తప్ప..మిగతా అన్నిచోట్ల టీడీపీకి నాయకులు ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఇంచార్జ్‌లుకే సీట్లు ఇస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లోపు ఏ నాయకుడు సరిగ్గా పనిచేయకపోయిన తీసి పక్కన పెట్టేస్తానని చంద్రబాబు చెప్పేశారు. అంటే నెక్స్ట్ కొన్ని చోట్ల మారTDP{#}bharathi old;Srikakulam;Lakshmi Devi;CBN;Minister;TDPసిక్కోలులో సేమ్ సైకిల్ బ్యాచ్..చేంజ్ ఉండదా..?సిక్కోలులో సేమ్ సైకిల్ బ్యాచ్..చేంజ్ ఉండదా..?TDP{#}bharathi old;Srikakulam;Lakshmi Devi;CBN;Minister;TDPFri, 17 Dec 2021 12:00:00 GMTనెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడానికి టీడీపీ అధినేత చంద్రబాబు....ఇప్పటినుంచే గెలుపు గుర్రాలని వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో దాదాపు అన్నీ నియోజకవర్గాల్లో టీడీపీకి ఇంచార్జ్‌లు ఉన్నారు. ఏదో కొన్ని తప్ప..మిగతా అన్నిచోట్ల టీడీపీకి నాయకులు ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న ఇంచార్జ్‌లుకే సీట్లు ఇస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి. ఎందుకంటే నెక్స్ట్ ఎన్నికల్లోపు ఏ నాయకుడు సరిగ్గా పనిచేయకపోయిన తీసి పక్కన పెట్టేస్తానని చంద్రబాబు చెప్పేశారు. అంటే నెక్స్ట్ కొన్ని చోట్ల మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ఇదే క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఒకసారి గమనిస్తే...ఇక్కడ పెద్దగా సీట్లు మార్చే అవకాశం ఉండదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో...అదే బ్యాచ్ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ సిట్టింగ్ సీట్లుగా ఉన్న ఇచ్చాపురంలో అశోక్, టెక్కలిలో అచ్చెన్నాయుడుల సీట్లు ఏ మాత్రం మారవు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

ఇటు ఆమదాలవలసలో కూన రవికుమార్, పలాసలో గౌతు శిరీషలు మళ్ళీ చేయడం ఖాయం. వీరి సీట్లకు కూడా ఎలాంటి డౌట్ లేదు. అదేవిధంగా పాతపట్నంలో కలమట వెంకటరమణ, పాలకొండలో నిమ్మక జయకృష్ణ సీట్లకు కూడా ఎలాంటి ఢోకా లేదనే చెప్పాలి. అలాగే ఎచ్చెర్లలో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుకు బెర్త్ కన్ఫామ్.

ఇక శ్రీకాకుళంలో గుండా లక్ష్మీ ఉన్నారు. ఈమెకు కాస్త వయసు మీద పడింది...అలా అని ఆమె యాక్టివ్ గా లేకుండా లేరు. నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. కాబట్టి నెక్స్ట్ టర్మ్‌లో లక్ష్మీ సీటుకు కూడా డౌట్ లేదనే చెప్పాలి. ఇక డౌట్ ఉన్నది ఒక్క రాజాం సీటు విషయంలోనే ఇక్కడ కొండ్రు మురళీమోహన్‌కు సీటు వస్తుందా లేక మాజీ స్పీకర్ ప్రతిభా భారతి కుమార్తె గ్రీష్మకు సీటు వస్తుందా అనే విషయం క్లారిటీ లేదు. దీనిపై చంద్రబాబే క్లారిటీ ఇవ్వాలి.



పుష్ప తెలుగు సినిమా రివ్యూ ,రేటింగ్

పుష్ప లో ఈ ఎలిమెంట్స్ హైలైట్!!

అమ్మ: గర్భిణులకు డయాబెటిస్ వస్తే ఏం జరుగుతుంది..??

' పుష్ప ' రివ్యూ: ఒక్క స్టెప్‌తో ముంబైను షేక్ చేసిన ర‌ష్మిక

పుష్ప తేడా వస్తే.. షర్ట్ విప్పుకొని తిరుగుతా..!

పుష్ప : క్రియెటివ్ ఇమేజరీ ఎంత?

పుష్ప 3వదే.. బన్నీ తో 7 సినిమాలు పక్కా..!

' పుష్ప ' రివ్యూ: సుక్కు చేసిన పెద్ద త‌ప్పు ఇదే..!

పుష్ప : ఆ సౌండేట్రా..ఆ స్టామినా ఏట్రా...అడ్డ‌డ్డే త‌గ్గేదేలే!

పుష్ప ది రైజ్ : రివ్యూ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>