PoliticsMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr0fce5069-dbf1-4105-9ace-c3bed9a13656-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr0fce5069-dbf1-4105-9ace-c3bed9a13656-415x250-IndiaHerald.jpgవ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా దూకుడుగా పావులు క‌దుపుతున్న బీజేపీ అందుకు ఈటెల రాజేంద‌ర్‌ను త‌న తురుపుముక్క‌గా ముందు పెట్టుకుని యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మవుతోందా..? జ‌రుగుతున్న ప‌రిణామాలు దానినే సూచిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేసి ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా త‌న ప‌ని తీరుతో ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూగా చాలాకాలం గుర్తింపు పొందిన నేత ఈటెల రాజేంద‌ర్. KCR{#}MLA;Dookudu;రాజీనామా;Telangana Rashtra Samithi TRS;KCR;Telangana;Bharatiya Janata Party;Party;Backward Classes;thursdayకేసీఆర్‌తో ఢీ అన‌డం వెనుక ఈటెల ల‌క్ష్య‌మేంటి..?కేసీఆర్‌తో ఢీ అన‌డం వెనుక ఈటెల ల‌క్ష్య‌మేంటి..?KCR{#}MLA;Dookudu;రాజీనామా;Telangana Rashtra Samithi TRS;KCR;Telangana;Bharatiya Janata Party;Party;Backward Classes;thursdayThu, 16 Dec 2021 20:00:00 GMT           వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో అధికార‌మే ల‌క్ష్యంగా దూకుడుగా పావులు క‌దుపుతున్న బీజేపీ అందుకు ఈటెల రాజేంద‌ర్‌ను త‌న తురుపుముక్క‌గా ముందు పెట్టుకుని యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మవుతోందా..? జ‌రుగుతున్న ప‌రిణామాలు దానినే సూచిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్‌తో క‌లిసి ప‌నిచేసి ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చాక కూడా త‌న ప‌ని తీరుతో ప్ర‌భుత్వంలో నెంబ‌ర్ టూగా చాలాకాలం గుర్తింపు పొందిన నేత ఈటెల రాజేంద‌ర్. ఆయ‌న‌ చివ‌ర‌కు ఆ పార్టీని వ‌దిలిపెట్టాల్సి వ‌చ్చిన ప‌రిస్థితులు అంద‌రూ చూసిన‌వే. అంతేకాదు.. ఈటెల‌ ఎమ్మెల్యే ప‌ద‌వికి సైతం రాజీనామా చేసి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను స‌వాల్ చేసి మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ ఉప ఎన్నిక‌ను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్.. ఈటెల‌ను ఎలాగైనా ఓడించేందుకు స‌ర్వ శ‌క్తుల‌నూ వినియోగించారు. కేవ‌లం రాజేంద‌ర్ ఓట‌మి ల‌క్ష్యంగా అత్యంత భారీవ్య‌యంతో కూడిన ద‌ళిత బంధు ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. ఇక డ‌బ్బు, మ‌ద్యం విచ్చ‌ల‌విడిగా పారిన ఈ ఉప ఎన్నిక దేశంలోనే అత్యంత ఖ‌రీదైన‌దిగా వ‌చ్చిన వార్త‌లు జాతీయ మీడియాలోనూ హోరెత్తాయి. అయినా కేసీఆర్ ఈటెల గెలుపును అడ్డుకోలేక‌పోయారు. కేసీఆర్‌- ఈటెల మ‌ధ్య ప‌రోక్ష యుద్ధంలా జ‌రిగిన ఈ ఎన్నిక‌లో గెల‌వ‌డం ద్వారా కేసీఆర్‌ను ఢీకొట్టి నిల‌వ‌గ‌ల నేత‌గా ఈటెల రాజేంద‌ర్ తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఇది జ‌ర‌గ‌కూడ‌ద‌నే కేసీఆర్ గ‌ట్టిగా కోరుకున్న‌ది.
 
          ఈ ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్ భ‌య‌ప‌డిన‌ట్టుగానే బీజేపీ త‌న దూకుడు మ‌రింత పెంచింది. తాజాగా గురువారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన‌ ఈటెల త‌న‌ను బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్‌పై పోటీకి దిగేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా త‌న రాజ‌కీయ ప్ర‌ణాళిక‌, కార్యాచ‌ర‌ణ ఎలా ఉండ‌బోతున్న‌దో స్ప‌ష్టంగానే ప్ర‌క‌టించారు. కేసీఆర్‌తో యుద్ధానికి సిద్ధ‌మంటూ ఈటెల‌ గ‌ట్టి స‌వాల్ విసిరారు. టీఆర్ఎస్ అధిష్ఠానం త‌న‌ను రాజ‌కీయంగా స‌మాధి చేసేందుకు కుట్రలు ప‌న్నిందంటూ రాజేంద‌ర్ చేసిన ప్ర‌చారం ప్ర‌జ‌లు విశ్వ‌సించినందునే ఉప ఎన్నిక‌లో ఆయ‌న‌కు అంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అక్క‌డి ప్ర‌జ‌లు క‌ట్ట‌పెట్టార‌న్న‌ది కాద‌నలేని వాస్తవం. బీసీలతో పాటు ఇత‌ర వ‌ర్గాల్లోనూ ఆయ‌న ప‌ట్ల నెల‌కొన్న సానుభూతి కార‌ణంగా కేసీఆర్ తంత్రం అక్క‌డ ప‌ని చేయ‌లేదు. నిజానికి ఇప్ప‌టిదాకా తెలంగాణలో బీజేపీకున్న బ‌లంతో అక్క‌డ నాయ‌కులు గెలుస్తూ వ‌చ్చారు. కానీ ఆ పార్టీ నుంచి సొంత బ‌లంతో గెలిచిన నేత‌గా ఈటెల‌ను ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ సానుభూతినే వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న‌కు సానుకూలంగా మార్చుకునే వ్యూహంలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఈటెల‌నే ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదే జ‌రిగితే బీసీ వ‌ర్గాలు ఈటెల వెనుక నిలిస్తే తెలంగాణ‌లో ప్ర‌బ‌ల రాజ‌కీయ శ‌క్తిగా ఎదగాల‌న్న బీజేపీ వ్యూహం ఫ‌లించిన‌ట్టేన‌ని చెప్పాలి.

 





ఛీ..ఛీ.. ఇలా కూడా బెదిరిస్తారా.. బాబోయ్‌..?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>