PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlica451e72-1e5e-4524-adf2-9d51247d1614-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohlica451e72-1e5e-4524-adf2-9d51247d1614-415x250-IndiaHerald.jpgక్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. రన్ మెషిన్ అనే పేరున్న విరాట్ కోహ్లీ... భారతీయ క్రికెట్ జట్టు సారధిగా మెరుగైన రికార్డు సొంతం చేసుకున్నాడు కూడా. టెస్టు, వన్డే, టీ 20 ఫార్మెట్లలో భారత జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించారు కూడా. ఇక కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే చాలు... మ్యాచ్‌పై ప్రత్యర్థులు ఆశలు వదులు కోవాల్సిందే. కానీ కొద్ది రోజులుగా కోహ్లీ ట్రాక్ గాడి తప్పినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ సిరీస్‌లో భాగంగా న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. kohli{#}VIRAT KOHLI;Cricket;South Africa;BCCI;Championఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!kohli{#}VIRAT KOHLI;Cricket;South Africa;BCCI;ChampionThu, 16 Dec 2021 16:53:00 GMTక్రికెట్‌లో విరాట్ కోహ్లీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. రన్ మెషిన్ అనే పేరున్న విరాట్ కోహ్లీ... భారతీయ క్రికెట్ జట్టు సారధిగా మెరుగైన రికార్డు సొంతం చేసుకున్నాడు కూడా. టెస్టు, వన్డే, టీ 20 ఫార్మెట్లలో భారత జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించారు కూడా. ఇక కోహ్లీ క్రీజ్‌లో ఉన్నాడంటే చాలు... మ్యాచ్‌పై ప్రత్యర్థులు ఆశలు వదులు కోవాల్సిందే. కానీ కొద్ది రోజులుగా కోహ్లీ ట్రాక్ గాడి తప్పినట్లుగా కనిపిస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిఫ్ సిరీస్‌లో భాగంగా న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడింది. దీంతో టెస్టు ఛాంపియన్‌గా కివీస్ జట్టు నిలిచింది. ఆ తర్వాత ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో అయితే భారత జట్టు ఘోరంగా ఓడింది. చివరికి చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో కూడా పది వికెట్ల తేడాతో ఘోర పరాజయం మూట గట్టుకుంది. ఆ తర్వాత ఏకంగా సీరిస్‌లో సెమీ ఫైనల్ స్థాయి కూడా చేరకుండానే టీమిండియా ఇంటి బాట పట్టింది. దీంతో టీ 20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్నాడు.

అయితే బీసీసీఐ అనూహ్య నిర్ణయంతో కోహ్లీకి షాక్ ఇచ్చింది. సౌతాఫ్రికా సిరీస్ ముందు వన్డే కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా కోహ్లీని తప్పించింది. దీంతో బీసీసీఐ నిర్ణయంపై కోహ్లీ కాస్త అసహనం వ్యక్తం చేశారు. తనకు కేవలం గంట ముందు మాత్రమే కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారని... ఇది ఎంత వరకు సమంజసం అని కోహ్లీ వ్యాఖ్యానించారు. అలాగే గంగూలీ తనకు ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వలేదని కూడా వ్యాఖ్యానించారు. దీంతో కోహ్లీ వ్యాఖ్యాలపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విరాట్‌పై తీవ్ర విమర్శలు చేసేసింది. అసలు బోర్డుతో సరైన కమ్యూనికేషన్ కూడా కోహ్లీ మెయిన్‌టైన్ చేయరని ఆరోపించారు. ఇక జట్టు సభ్యులకు అయితే సరిగ్గా అందుబాటులో కూడా ఉండరన్నారు బీసీసీఐ అధికారి. సెలక్షన్ కమిటీకి సహకరించడని... కనీసం వారితే చర్చలకు కూడా జరపరన్నారు. కెప్టెన్సీ మార్పుపై పది రోజుల ముందే ఏమైనా చెప్పాలని ఎక్కడా రూల్ లేదని కూడా అన్నారు. ఇందుకు అనుగుణంగా... విరాట్‌కు షోకాజ్ నోటీసులు పంపాలని... వాటిపై వివరణ వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయని కూడా బీసీసీఐ అధికారి వెల్లడించారు.





వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?

గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>