CrimeN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime5c11b8ad-69d2-4a1f-a7f9-045e9c0edade-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crime5c11b8ad-69d2-4a1f-a7f9-045e9c0edade-415x250-IndiaHerald.jpgచిన్న పిల్లలు కొంచెం పెద్దవారు అయ్యేంతవరకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో తెలీదు.. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి వేడి నీళ్లల్లో పడి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో చోటు చేసుకుంది. crime{#}ramu;Parents;Wifeఅయ్యో చిన్నారి: ఎంత పని అయిపోయిందమ్మా..??అయ్యో చిన్నారి: ఎంత పని అయిపోయిందమ్మా..??crime{#}ramu;Parents;WifeThu, 16 Dec 2021 11:00:00 GMTచిన్న పిల్లలు కొంచెం పెద్దవారు అయ్యేంతవరకు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలకి ఏది మంచో ఏది చెడో తెలీదు.. కాబట్టి వారి విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఉంటుంది. తాజాగా ఓ చిన్నారి వేడి నీళ్లల్లో పడి మృతి చెందిన ఘటన కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మైసూరు జిల్లాలోని దాసనకొప్పలు అనే గ్రామంలో రాము అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి రెండేళ్ల కూతురు ఉంది. ఆ దంపతులు కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.

అయితే రోజూలానే రెండేళ్ల కూతురు ఆద్యకు స్నానం చేయించేందుకు రెడీ అయ్యింది ఆ తల్లి. కాగా.. చలికాలం కావడంతో చన్నీళ్లతో స్నానం చేయిస్తే పాప చలికి తట్టుకోలేదని భావించి వేడినీళ్లు తీసుకొచ్చి బాత్రూమ్‌లో పెట్టి వెళ్ళింది. కొన్ని చల్లటి నీళ్లు తీసుకోవడానికి వెళ్లిన తల్లి వచ్చే లోపే  ఇంట్లోనే ఆడుకుంటున్న పాప అవి వేడి నీళ్లని, ముట్టుకుంటే కాలుతుందని తెలియక బకెట్‌లో చేయి పెట్టేసింది. ఆ చిన్నారి చేతి కాలడంతో బాధ తట్టుకోలేక చేయి తీసే నేపథ్యంలోనే బకెట్ ప్రమాదవశాత్తూ పాపపై పడిపోయింది. ఇక బకెట్‌లో నీళ్లు వేడివేడిగా ఉండటంతో పాప శరీరం కాలిపోయింది.

ఇక ఆ బాధను తట్టుకోలేక పాప పెద్దగా ఏడుస్తూ ఉండటంతో ఏమైందా అని తల్లి చన్నీళ్లు తీసుకుని వచ్చిసరికి కాలిన గాయాలతో పాప విలపించడాన్ని చూసి కన్న తల్లి గట్టిగా కేకలేసింది. తల్లి కేకలు విన్న చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ చిన్నారి ఆ బాధ తట్టుకోలేక గుక్క పట్టి ఏడుస్తూనే ఉండటంతో మైసూరులోని కేఆర్ హాస్పిటల్‌కు పాపను చికిత్స నిమిత్తం హుటాహుటిన తరలించినప్పటికీ  పాప శరీరం బాగా కాలిపోవడంతో చికిత్స పొందుతూ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇక చిన్నారి మరణంతో రాము, అతని భార్య జయలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.



ఏపీపై కాంగ్రెస్ పార్టీ శాశ్వ‌తంగా ఆశ‌లు వ‌దులుకుందా..?

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>