PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp37e16def-fcbf-434f-8232-6c3121972a31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp37e16def-fcbf-434f-8232-6c3121972a31-415x250-IndiaHerald.jpgరాజకీయాల్లో ఎప్పుడు ఎవరి తలరాత ఎలా మారుతుందో ? ఎవ్వరు ఊహించలేరు. కొంతమంది నేతలు పార్టీ కోసం సంవత్సరాలు ... దశాబ్దాలుగా కష్టపడుతూ ఉంటారు. వారికి ఎప్పుడు గెలుపు దక్కదు. మరి కొందరు ఖచ్చితంగా ఎన్నికలకు ముందే పార్టీలో చేరి రాత్రికిరాత్రే హీరోలు అయిపోతారు. తమకు తామే ఊహించనివిధంగా ఎమ్మెల్యేలు అయిపోతారు. ఇక్కడ అంతిమంగా గెలుపు అనేది ముఖ్యం.. గెలుపు కోసం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకుంటుంది. ఎంత గొప్ప నాయకులను అయినా పక్కన పెట్టేసి ఉంటుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కొందTdp{#}sravan;Kamma;Prathipadu;Thadikonda;Macherla;Scheduled caste;Nani;Telugu Desam Party;Guntur;Yevaru;Minister;TDP;MLA;Partyగుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?Tdp{#}sravan;Kamma;Prathipadu;Thadikonda;Macherla;Scheduled caste;Nani;Telugu Desam Party;Guntur;Yevaru;Minister;TDP;MLA;PartyThu, 16 Dec 2021 15:30:00 GMTరాజకీయాల్లో ఎప్పుడు ఎవరి తలరాత ఎలా మారుతుందో ? ఎవ్వరు ఊహించలేరు. కొంతమంది నేతలు పార్టీ కోసం సంవత్సరాలు ... దశాబ్దాలుగా కష్టపడుతూ ఉంటారు. వారికి ఎప్పుడు గెలుపు దక్కదు. మరి కొందరు ఖచ్చితంగా ఎన్నికలకు ముందే పార్టీలో చేరి రాత్రికిరాత్రే హీరోలు అయిపోతారు. తమకు తామే ఊహించనివిధంగా ఎమ్మెల్యేలు అయిపోతారు. ఇక్కడ అంతిమంగా గెలుపు అనేది ముఖ్యం.. గెలుపు కోసం పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకుంటుంది. ఎంత గొప్ప నాయకులను అయినా పక్కన పెట్టేసి ఉంటుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లాలో వచ్చే ఎన్నికల్లో కొంద‌రు తెలుగుదేశం పార్టీ నేతలకు టికెట్లు ఉండవని రాష్ట్ర పార్టీలో ప్రచారం జరుగుతోంది.

ఈ లిస్టులో జిల్లాలో ముగ్గురు... నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారు ఆయా నియోజకవర్గాలకు బాధ్యులుగా ఉన్నా... అక్కడ పార్టీ బలోపేతం కాక‌పోవడం తో పాటు వారి నాయకత్వంపై నియోజకవర్గ టిడిపి క్యాడర్ కు సరైన నమ్మకం లేకపోవడమే అని తెలుస్తోంది. గుంటూరు వెస్ట్ విషయంలో పార్టీ అధిష్టానానికి ఇప్పటికీ క్లారిటీ లేదని అంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ కోవెల‌మూడి ర‌వీంద్ర ( నాని  ఇన్ చార్జ్ గా ఉన్నారు.

ఆయన గత కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ తరఫున మేయ‌ర్ అభ్య‌ర్థి గా బ‌రిలో దిగారు. ఆయన కార్పొరేటర్ గా గెలిచిన నగరంలో టిడిపి విజయం సాధించలేదు. జిల్లాలోనే హాట్ సీటుగా చెప్పుకునే గుంటూరు వెస్ట్‌ సీటు కోసం పార్టీలో చాలామంది కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఎస్సీ రిజర్వుడ్ స్థానం అయిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య ఉన్నారు.

ఆయన కమ్మ సామాజిక వర్గం నేత. ఆయనకు వచ్చే ఎన్నికల్లో సీటు రాదు. అయితే ప్రత్తిపాడు నుంచి ఎవరు రంగంలో ఉంటారు అన్న దానిపై క్లారిటీ లేదు. జేఏసీలో కీలకంగా ఉన్నా కొలికపూడి శ్రీనివాసరావు ... ప్రస్తుతం తాడికొండ ఇన్చార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ లో ఎవరో ఒకరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు.

ఇక పల్నాడు లో ఉన్న మాచర్ల నియోజకవర్గ బాధ్యతలను ప్రస్తుతం కొమ్మారెడ్డి చలమారెడ్డి చూసుకుంటున్నారు. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన ఇన్చార్జిగా ఉన్నా ఎన్నికల్లో మాత్రం మరో నేతకు సీటు వచ్చింది. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న ఇన్ చార్జ్ గా ఉన్నా కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు రాద‌ని అంటున్నారు.



వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?

గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>