ViralG.Saikrishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/unique-christmas-cake5daf7b3c-1c59-4de9-aeaa-6dffffbfc24e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/unique-christmas-cake5daf7b3c-1c59-4de9-aeaa-6dffffbfc24e-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది క్రైస్తవులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. భూమిపై మానవజాతి పాపాలను పోగొట్టడానికి సాక్షాత్తు దేవుడే మానవుడిగా అవతరించాడని నమ్ముతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు డిసెంబర్ 25న ఎంతో ఆనందంగా.. బంధువులు, స్నేహితులందరితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అయితే.. హైదరాబాద్ లోనూ ఈ క్రిస్మస్ వేడుకలు అంబరానంటుతాయి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెడుతుంటారు. అంతేకాకుండా ఏ వేడుకల్లో ప్లమ్ కేక్ లు ప్రత్యేకతను సUnique Christmas Cake{#}Dry Fruits;Christmas;festival;history;January;December;Hyderabadహైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలంటే.. ఆ బేకరీలకు వెళ్లాల్సిందే..!హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలంటే.. ఆ బేకరీలకు వెళ్లాల్సిందే..!Unique Christmas Cake{#}Dry Fruits;Christmas;festival;history;January;December;HyderabadThu, 16 Dec 2021 15:57:17 GMTప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది క్రైస్తవులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. భూమిపై మానవజాతి పాపాలను పోగొట్టడానికి సాక్షాత్తు దేవుడే మానవుడిగా అవతరించాడని నమ్ముతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు డిసెంబర్ 25న ఎంతో ఆనందంగా.. బంధువులు, స్నేహితులందరితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అయితే.. హైదరాబాద్ లోనూ ఈ క్రిస్మస్ వేడుకలు అంబరానంటుతాయి. క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెడుతుంటారు. అంతేకాకుండా ఏ వేడుకల్లో ప్లమ్ కేక్ లు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. క్రిస్మస్ వేడుకలు హైదరాబాద్ లో జరుపుకునే వారు ఖచ్చితంగా ఈ ఐదు బేకరీల గురించి తెలుసుకోవాల్సిందే.



కరాచీ బేకరీ:
ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ బేకరీ ఇప్పటికీ కొనసాగుతోంది.కేక్ బేకింగ్ లలో కరాచీ బేకరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేక్ ప్రియులకు కేంద్రంగా ఉంది. మీరు బడ్జెట్‌లో మృదువైన ప్లం కేక్ పొందాలని ప్లాన్ చేస్తే, కరాచీ బేకరీ మీ లిస్టులో మొదటి స్థానంలో ఉంటుంది. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 15పైగా బ్రాంచులు ఉన్నాయి.


గోల్డెన్ బేకరీ:

గోల్డెన్ బేకరీ 75 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్‌లో స్థాపించబడింది. కేకులు, పేస్ట్రీలు, కుకీలు, స్నాక్స్, పుడ్డింగ్‌లు, చీజ్‌కేక్‌లు మరియు మఫిన్‌లు వంటి విందులను అందిస్తోంది. అయితే క్రిస్మస్  సీజన్ ప్రారంభమైనప్పుడు ఈ బేకరీ బయట  పొడవైన క్యూ లైన్ లు కనిపిస్తుంటాయి. గోల్డెన్ బేకరీతో మాకు ఎంతో అనుబంధం ఉందని గత కొన్ని సంవత్సరాలుగా ఈ బేకరీలో కేక్ లు తీసుకుంటున్న కేక్ ప్రియులు చెబుతున్నారు.

సుభాన్ బేకరీ:

నాంపల్లిలో ఉన్న సుభాన్ బేకరీ నోరూరించే  అనేక రకాలైన  బేక్డ్ ఉత్పత్తులను తయారు చేస్తూ..  వ్యాపారంలో ఆరు దశాబ్దాలకు పైగా పూర్తి చేసుకుంది. క్రిస్మస్ సందర్భంగా, ఈ స్టోర్ ప్రత్యేక బ్రెడ్, కుక్కీలు మరియు సాంప్రదాయ ప్లం కేక్‌లతో నిండి ఉంటుంది. ఈ బేకరీలో డ్రై ఫ్రూట్ ప్లం కేక్చే స్పెషల్.


ట్రియో-లా పాటిస్సెరీ:

ఫ్రూట్ కేక్స్ నుండి రమ్ కేక్స్ వరకు సికింద్రాబాద్‌లోని ట్రియో-లా పాటిస్సేరీలో అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ, వారు క్రిస్మస్ సీజన్‌లో (నవంబర్ నుండి జనవరి వరకు) మాత్రమే అందుబాటులో ఉండే ప్రత్యేకమైన ప్లం కేక్‌లను తయారు చేస్తుంటారు. ఈ బేకరీ వారు తమ కేక్‌లను కాల్చడానికి ఇంట్లో తయారుచేసిన వెన్న, ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తారు.  పండుగల సీజన్‌లో అత్యంత రుచికరమైన ప్లం కేక్‌లను పొందేందుకు ప్రజలు ఈ దుకాణానికి పోటెత్తారు.

కేఫ్ ఎక్లాట్:

క్రిస్మస్ సందర్భంగా గచ్చిబౌలిలోని కేఫ్ ఎక్లాట్ సందడిగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకల కోసం ఇక్కడ ప్రత్యేకమైన, ఆర్షణీయమైన కేకులు అందుబాటులో ఉంటాయి.  ఈ బేకరీ వారు  వైన్, పండ్లు, గుడ్లు మరియు వెన్నతో చేసిన ప్లం కేక్ లు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బేకరీ వారు వివిధ వైవిధ్య డిజైన్లలో కేకులు చేస్తూ అందరిని ఆకర్షిస్తున్నారు.





వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?

గుంటూరులో ఈ టీడీపీ నేత‌ల‌కు నో టిక్కెట్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - G.Saikrishna]]>