PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-cm-kcr90e21e8a-52f0-436c-8041-7574bd8b919a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-cm-kcr90e21e8a-52f0-436c-8041-7574bd8b919a-415x250-IndiaHerald.jpgరెండేళ్లు ముందుగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. సాధారణంగా ఎన్నికలప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచించే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... సరిగ్గా రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. వీటి కోసం టీఆర్ఎస్ అధినేత పెద్దగా కష్టపడినట్లు లేరు. ఇక ఆ తర్వాత పరిపాలనా పరంగా మార్పులు చేర్పులు తీసుకువచ్చిన టీఆర్ఎస్ సర్కార్... తమ పరిపాలనకు కొలమానంగా భావిస్తkcr{#}MIM Party;Thota Chandrasekhar;Elections;Huzurabad;Congress;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Party;Party;Telangana;Hyderabadకేసీఆర్ మిషన్ మోడ్ స్టార్ట్...!కేసీఆర్ మిషన్ మోడ్ స్టార్ట్...!kcr{#}MIM Party;Thota Chandrasekhar;Elections;Huzurabad;Congress;Telangana Rashtra Samithi TRS;KCR;Bharatiya Janata Party;Party;Telangana;HyderabadThu, 16 Dec 2021 15:51:00 GMTరెండేళ్లు ముందుగానే తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల మూడ్ లోకి వెళ్లారు. సాధారణంగా ఎన్నికలప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచించే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... సరిగ్గా రెండేళ్ల ముందు నుంచే ఎన్నికలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. వీటి కోసం టీఆర్ఎస్ అధినేత పెద్దగా కష్టపడినట్లు లేరు. ఇక ఆ తర్వాత పరిపాలనా పరంగా మార్పులు చేర్పులు తీసుకువచ్చిన టీఆర్ఎస్ సర్కార్... తమ పరిపాలనకు కొలమానంగా భావిస్తూ... అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా అనూహ్యంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దాదాపు పది నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్ సారు ప్రచారం తక్కువగానే నిర్వహించినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం బంపర్ మెజారిటీ సాధించారు. బీజేపీకి కేవలం ఒకే ఒక్క స్థానం లభించింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరడంతో... తిరుగులేని నేతగా ఎదిగారు.

అయితే అధికార పార్టీకి అనూహ్యంగా ఓటములు ఎదురయ్యాయి. దుబ్బాక నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ దాదాపు గెలిచినంత పని చేసింది. దీంతో చివరికి ఎంఐఎం మద్దతుతో గ్రేటర్‌ను చేజిక్కుకుంది గులాబీ పార్టీ. అయితే ఆ తర్వాత జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీకి చేదు అనుభవమే ఎదురైంది. దీంతో అధిక స్థానాలున్న కాంగ్రెస్ పార్టీ కంటే కూడా... భారతీయ జనతా పార్టీ బలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీజేపీ ధర్నాలు చేస్తోంది. దీంతో... గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగారు. రెండేళ్ల ముందు నుంచే రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ఇప్పటికే పార్టీకి సంబంధించిన రిపోర్టులు తెప్పించారు. కొన్ని రోజుల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న గులాబీ బాస్... ఇప్పుడు కొన్ని రోజులుగా పార్టీ కోసం ప్లానింగ్ వేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పార్టీ నేతలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే... వరుస వేడుకలకు హాజరవుతున్నారు.





భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!

త‌మిళ హీరో విక్రమ్ కి క‌రోనా పాజిటివ్

గోవా బీజేపీలో కలకలం...!

అబ్బో.. సమంతకు అక్కడ మాములుగా లేదుగా..!

ఇక కోహ్లీ కెరీర్ ముగిసినట్లేనా......!

కేసీఆర్ సార్‌కు బీజేపీ భయం పట్టుకుందా...!

షాకింగ్ : 5 గురు క్రికెటర్లకు కరోనా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>