MoviesMaddipati Lakshmi Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/bollywood952278b3-6fe8-447f-9d8a-4fe73a2f3b34-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/71/bollywood952278b3-6fe8-447f-9d8a-4fe73a2f3b34-415x250-IndiaHerald.jpgప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చూసినా హీరోల‌కు, హీరోయిన్ల‌కు మ‌ధ్య పారితోషికంలో భారీ వ్య‌త్యాసం ఉండ‌ట‌మ‌నేది కామ‌న్‌. పురుషాధిక్య ప్ర‌పంచంలో ఇది సినీ ప‌రిశ్ర‌మ‌కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని, ఇత‌ర రంగాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌నే వాద‌న‌ను ప‌క్క‌న‌బెడితే సినీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం ఇది చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తుంది.Bollywood{#}deepika;Hollywood;Heroine;March;bollywood;vegetable marketఈ బాలీవుడ్ భామ‌ల రెమ్యూన‌రేష‌న్ చూస్తే షాకే..?ఈ బాలీవుడ్ భామ‌ల రెమ్యూన‌రేష‌న్ చూస్తే షాకే..?Bollywood{#}deepika;Hollywood;Heroine;March;bollywood;vegetable marketThu, 16 Dec 2021 23:05:49 GMT        ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చూసినా హీరోల‌కు, హీరోయిన్ల‌కు మ‌ధ్య పారితోషికంలో భారీ వ్య‌త్యాసం ఉండ‌ట‌మ‌నేది కామ‌న్‌. పురుషాధిక్య ప్ర‌పంచంలో ఇది సినీ ప‌రిశ్ర‌మ‌కు మాత్ర‌మే ప‌రిమితం కాద‌ని, ఇత‌ర రంగాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌నే వాద‌న‌ను ప‌క్క‌న‌బెడితే  సినీ ప‌రిశ్ర‌మ‌లో మాత్రం ఇది చాలా స్ప‌ష్టంగానే క‌నిపిస్తుంది. ద‌శాబ్దాల‌పాటు ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతూ వ‌చ్చింద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. ఇది కేవ‌లం రెమ్యూన‌రేష‌న్ విష‌యంలోనే కాదు. పాత్ర‌ల ప్రాధాన్యం నుంచి ప్ర‌తి అంశంలోనూ ఇది వ‌ర్తిస్తుంది. గ‌త త‌రంలోనైనా ఈ త‌రంలోనైనా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్ర‌లు చేసే అవ‌కాశం వ‌చ్చిన‌ చాలా త‌క్కువ‌మంది క‌థానాయిక‌లకు మాత్ర‌మే ఈ విష‌యంలో మిన‌హాయింపు ఉంటుందని చెప్పాలి. హీరోయిన్ల‌కు ఈ విష‌యంలో అన్యాయం జ‌రుగుతోంద‌ని కొంతకాలంగా చర్చ కూడా జ‌రుగుతోంది. అయితే అత్య‌ధిక శాతం క‌థానాయిక‌ల కెరీర్ స్పాన్ త‌క్కువ కావ‌డం, ఉన్న కొద్దికాలంలోనే త‌గిన‌న్ని అవ‌కాశాలు అందిపుచ్చుకోవాల‌నే ఆలోచ‌న‌తో చాలామంది హీరోయిన్లు నిర్మాత‌ల ముందు పెద్ద‌గా డిమాండ్లు పెట్ట‌రు.
     
        అయితే న‌వ‌త‌రం క‌థానాయిక‌లు ఈ ప‌రిస్థితిని పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే విష‌యంలో అయితే పాత లెక్క‌లు పూర్తిగా మార్చి రాసుకోవాల్సిందే. బాజీరావు మ‌స్తానీ సినిమాలో మ‌స్తానీ పాత్ర‌లో జ‌నాన్ని మెప్పించిన దీపిక మ‌రోప‌క్క‌ హాలీవుడ్ సినిమాల్లోను త‌ళుక్కున‌ మెరిసిన సంగ‌తి తెలిసిందే..! కొన్నేళ్ల క్రితం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో వ‌చ్చిన‌ ‘పద్మావతి’ చిత్రంతో ఆమె స్టార్‌డ‌మ్ మ‌రింత పెరిగింది. ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిందేమిటంటే టైటిల్‌ రోల్‌కు త‌గిన‌ట్టుగానే దీపిక ఆ చిత్రంలో న‌టించిన హీరోల‌కంటే అప్ప‌ట్లో ఎక్కువ పారితోషికం పొందింది. ఇక ఆ త‌రువాత ఆమె వెన‌క్కు తిరిగి చూసిందే లేదు. ఇప్పుడు ఆమె ఒక సినిమాకు తీసుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ రూ. 30 కోట్ల‌కు పైమాటేన‌ట‌. ఇది చాలామంది బాలీవుడ్ హీరోల‌కంటే ఎక్కువ‌. ఈమె మాత్ర‌మే కాదు.. రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో ఆమె త‌ర్వాతి స్థానాల్లో ఉన్న‌ ప్రియాంకా చోప్రా, క‌త్రినాకైఫ్‌, కంగ‌నార‌నౌత్‌, అలియాభ‌ట్ సైతం సినిమాను బ‌ట్టి రూ. 20 కోట్ల నుంచి 25 కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్నార‌ట‌. ద‌క్షిణాదిన న‌య‌న‌తారకు మాత్ర‌మే ఈవిధంగా డిమాండ్ చేయ‌గ‌లిగే మార్కెట్ ఉన్నాఆమె పారితోషికం వీరితో పోలిస్తే నాలుగోవంతు మాత్ర‌మే.



ఛీ..ఛీ.. ఇలా కూడా బెదిరిస్తారా.. బాబోయ్‌..?

రాజమౌళి కి ఉన్న క్లారిటీ ఏ దర్శకుడికి లేదా!!

దేవుడా.. అదే జరిగితే బొమ్మా బ్లాక్ బాస్టరే..

మహేష్ ఈ టైం లో ఇలా చేస్తే ఎలా!!

లైఫ్ స్టైల్: వీటితో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే షాక్..!

పుష్ప : ఆ దేవుడే జగనన్నను చల్లగా చూస్తాండు?

భేష్.. భేష్.. ఆ రికార్డు నిమ్స్ సొంతం..!

వామ్మో.. త్రిషకు అంత ఉందా..నిజమేనా?

పుష్పకు ఎందుకు అంత క్రేజ్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Maddipati Lakshmi Sailaja]]>