PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/omicron8933cddb-301a-4a8e-bf98-f7f3e590c617-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/omicron8933cddb-301a-4a8e-bf98-f7f3e590c617-415x250-IndiaHerald.jpgప్ర‌పంచాన్ని మ‌రోసారి భ‌యం గుప్పిట్లోకి తీసుకువెళ్తోంది క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగు చూసిన వేరియంట్ల‌తో పోల్చితే ఒమిక్రాన్ అసాధార‌ణ రీతిలో వ్యాప్తి చెందుతుంది అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( డ‌బ్ల్యూహెచ్ఓ ) వెల్ల‌డించింది. ఇప్ప‌టికే 77 దేశాల‌కు విస్త‌రించిన ఒమిక్రాన్ త్వ‌ర‌లోనే మ‌రిన్ని దేశాల‌కు వ్యాపించ‌నుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు వేరియంట్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. ఒమిక్రాన్ త్వ‌ర‌లోనే మ‌రిన్ని దేశాల‌కు విస్త‌రించ‌నుంద‌ని ప్రomicronడ‌బ్ల్యూహెచ్ఓ : ఒమిక్రాన్ ఇంత ప్ర‌మాద‌మా..?డ‌బ్ల్యూహెచ్ఓ : ఒమిక్రాన్ ఇంత ప్ర‌మాద‌మా..?omicronThu, 16 Dec 2021 10:25:24 GMTప్ర‌పంచాన్ని మ‌రోసారి భ‌యం గుప్పిట్లోకి తీసుకువెళ్తోంది క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌..  అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు వెలుగు చూసిన వేరియంట్ల‌తో పోల్చితే ఒమిక్రాన్ అసాధార‌ణ రీతిలో వ్యాప్తి చెందుతుంది అని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ( డ‌బ్ల్యూహెచ్ఓ ) వెల్ల‌డించింది. ఇప్ప‌టికే 77 దేశాల‌కు విస్త‌రించిన ఒమిక్రాన్ త్వ‌ర‌లోనే మ‌రిన్ని దేశాల‌కు వ్యాపించ‌నుంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ దేశాలు వేరియంట్ క‌ట్ట‌డికి చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించింది. ఒమిక్రాన్ త్వ‌ర‌లోనే మ‌రిన్ని దేశాల‌కు విస్త‌రించ‌నుంద‌ని  ప్ర‌పంచ ఆరోగ్యం సంస్థ చీఫ్ టెడ్రోస్ అథ‌న‌మ్ పేర్కొన్నారు.


 ఇక అందుకే ప్ర‌పంచ దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మ‌రోసారి పున‌రుద్ఘాటించింది. అయితే, స్వ‌ల్ప వ్యాధి అంటూ నిర్ధార‌ణ‌కు రావ‌ద్ద‌ని డబ్ల్యూహెచ్ఓ హెచ్చ‌రించింది. ఒమిక్రాన్‌ను లైట్‌గా తీసుకుంటే తీవ్ర ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లోకి వెళ్లే అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. డెత్‌రేట్ అవ‌కాశాలు  ఎక్కువ ఉన్న వారికి బుస్ట‌ర్ డోసులు ఏమైనా ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక డెల్టా వేరియంట్‌తో పోలిస్తే కొత్త‌గా వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపించ‌బోతున్నట్టు ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు వెల్ల‌డిస్తున్నాయి. వేరియంట్ వెలుగు చూసిన ద‌క్షిణాఫ్రికాలో ఇప్ప‌టికే సామాజిక వ్యాప్తి నెల‌కొన్న‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌క‌టించింది.



అలాగే, అమెరికాలో భ‌య‌ట‌ప‌డుతున్న క‌రోనా కేసుల్లో మూడు శాతం ఈ ర‌క‌మైన కేసులే ఉండ‌డం గ‌మ‌నార్హం.  ఇక యూర‌ప్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండ‌గా తొలి మ‌ర‌ణం న‌మోద‌యింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి క‌ఠిన ఆంక్ష‌లు విధించే ఆలోచ‌న‌లో బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇక భార‌త్‌లోనూ రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 50 చేరువ‌వుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయితే, ఒమిక్రాన్ సోకిన వారికి తీవ్ర ల‌క్ష‌ణాలు లేక‌పోవ‌డం హ‌ర్షించాల్సిన విష‌యం. అయినా వారిప‌ట్ల త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది ప్ర‌భుత్వ ఆరోగ్య శాఖ‌.





పుష్ప అయ్యిందో లేదో రాధే శ్యామ్ షురూ!!

బ్రేకింగ్ : ఇక నుంచి అమ్మాయి వివాహ వ‌యస్సు ఎంతంటే..?

పుష్ప : బాహుబలిని బీట్ చేసిన బన్నీ?

పుష్ప : ఆకుప‌చ్చ‌ని ప్రేమ గీత ఎలా ఉంటుందంటే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌ళ్లీ తార‌క్ మంత్రం...!

సూర్యుడిని ముద్దాడిన నాసా రోదసీ నౌక

పుష్ప : అయ్య‌య్యో త‌గ్గ‌మ్మా ! అంత కాన్ఫిడెన్స్ వ‌ద్ద‌మ్మా!

టార్గెట్ 100: వైసీపీ ధీమా అదే...?

దారుణం: అనుమానంతో కిరాతకం, బలవన్మరణం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>