PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/crpfd3720696-1bd4-42c2-a9e9-a3f64071ef8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/crpfd3720696-1bd4-42c2-a9e9-a3f64071ef8e-415x250-IndiaHerald.jpgసరిలేరు మీకెవ్వరు.. మహేశ్ బాబు నటించిన బ్లాక్‌ బస్టర్ సినిమా.. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి దేశభక్తిని సెంటిమెంట్‌ను కలగలిపి బంపర్ హిట్ కొట్టేశాడు. సీనియర్ నటీమణి విజయ శాంతి, మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు ఓ కమాండర్. విజయశాంతి కుమారుడు కూడా ఓ కమాండర్. కానీ యుద్ధంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోతాడు. ఆ సైనికుడు చెల్లి పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఆ సైనికుడు కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ బాబును సైన్యం పంపుతుంది. మహేశ్ బాబు స్వయంగా అనcrpf{#}Vijayashanti;Army;Father;marriage;Darsakudu;Director;jyothi;Cinema;CBNసరిలేరు మీకెవ్వరు: ఆ చెల్లి పెళ్లికి సైనికులే అన్నయ్యలు?సరిలేరు మీకెవ్వరు: ఆ చెల్లి పెళ్లికి సైనికులే అన్నయ్యలు?crpf{#}Vijayashanti;Army;Father;marriage;Darsakudu;Director;jyothi;Cinema;CBNThu, 16 Dec 2021 00:00:00 GMTసరిలేరు మీకెవ్వరు.. మహేశ్ బాబు నటించిన బ్లాక్‌ బస్టర్ సినిమా.. ఈ సినిమాలో దర్శకుడు అనిల్ రావిపూడి దేశభక్తిని సెంటిమెంట్‌ను కలగలిపి బంపర్ హిట్ కొట్టేశాడు. సీనియర్ నటీమణి విజయ శాంతి, మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.


ఈ సినిమాలో మహేశ్ బాబు ఓ కమాండర్. విజయశాంతి కుమారుడు కూడా ఓ కమాండర్. కానీ యుద్ధంలో గాయపడి కోమాలోకి వెళ్లిపోతాడు. ఆ సైనికుడు చెల్లి పెళ్లి చేయాల్సి ఉంటుంది. ఆ సైనికుడు కుటుంబాన్ని ఆదుకునేందుకు మహేశ్ బాబును సైన్యం పంపుతుంది. మహేశ్ బాబు స్వయంగా అన్నయ్యగా మారి ఆ చెల్లి పెళ్లి చేస్తాడు. ఇదీ సరిలేరు మీకెవ్వరు సినిమా సీన్.


ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లో సేమ్ ఇలాంటి సీన్ చోటు చేసుకుంది. సీఆర్‌పీఎఫ్‌ 110వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన టెర్రరిస్టుల దాడిలో చనిపోయాడు. గతేడాది ఈ దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వీర సైనికుడి చెల్లెలు జ్యోతి వివాహం కుదిరింది. కానీ ఆ చెల్లి పెళ్లి పనులు చేసేందుకు అన్న లేడు. అందుకే సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు భారీగా చెల్లి పెళ్లికి హాజరయ్యారు. ప్రతాప్‌సింగ్ తోటి సైనికులే అన్నయ్యలుగా మారి ఘనంగా జ్యోతి వివాహం జరిపించారు.


ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలిలో జరిగిన జ్యోతి వివాహానికి  సైనికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పెళ్లి కూతురికి అన్నలేని లోటును తీర్చారు. వివాహ తంతు మొత్తం దగ్గరుండి జరిపించారు. సొంత అన్నల్లా ఆశీర్వదించి బహుమతులు అందించారు. ఇప్పుడు ఈ పెళ్లి వేడుక ఫొటోలను సీఆర్‌పీఎఫ్‌ సోషల్ మీడియాలో ఉంచంది. సైనికుడు ప్రతాప్ సింగ్ సోదరి వివాహ వేడుకకు అన్నయ్యలుగా హాజరయ్యారమని పోస్టులో సైనికులు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోస్టు బాగా వైరల్ అవుతోంది. తన కొడుకు లేకపోయినా సీఆర్పీఎఫ్‌ జవాన్ల రూపంలో తనకు ఎంతో మంది కుమారులు ఉన్నారని ప్రతాప్ సింగ్ తండ్రి గర్వంగా చెబుతున్నారు.



కృష్ణాలో ‘సైకిల్’ సీట్లు మార్చేలా ఉన్నారుగా!

బ‌స్సు ప్ర‌మాదంపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏమ‌న్నారంటే..?

ఛీ ఛీ! జూబ్లీహిల్స్ పబ్బుల్లో పిల్లల హంగామా..

అంత సీన్ ఉందా.. దేవిశ్రీ ఓవరయ్యిందా!!

బాలయ్యతో సినిమా అనగానే.. మీసం తిప్పిన రాజమౌళి?

'ఆర్ ఆర్ ఆర్' ట్రైలర్ @100 మిలియన్స్..!!

బెల్లంకొండ లో టెన్షన్ మొదలైందట!!

కేసీఆర్ స్కెచ్ ఇదేనా.. యూపీఏ గూటికి చేరనున్నారా..!

శ్యామ్ సింగ రాయ్.. అదే కథ.. అదే రోత!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>