PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/farmersuida6f55051-35b8-4c72-890e-ffbdf30f0ea8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/farmersuida6f55051-35b8-4c72-890e-ffbdf30f0ea8-415x250-IndiaHerald.jpgకేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాల సవరణ ఇప్పటికే రద్దు చేయబడింది. దీనితో ఆ లోటు తీర్చడానికి కొత్త విధాన ప్రక్రియ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి ఆయా సందర్భాలలో ఇవ్వదలచిన సౌకర్యాలు ఇంకా సులభతరం చేయడానికి సిద్ధం అవుతుంది. అందుకోసం ఇప్పటికే దేశీయంగా ఉన్న రైతుల సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ప్రస్తుతానికి 5.5కోట్ల రైతుల సమాచారం సేకరించారు, వీరందరికి 12 అంకెల యూనిక్యూ ఐడెంటిటీ కార్డు ప్రత్యేక గుర్తింపుగా అందజేయనున్నారు. దీని ద్వారా కేంద్రfarmersuid{#}Narendra;nidhi;Prime Minister;News;Government;central governmentకేంద్రం : రైతులకు.. ప్రత్యేక గుర్తింపు..!కేంద్రం : రైతులకు.. ప్రత్యేక గుర్తింపు..!farmersuid{#}Narendra;nidhi;Prime Minister;News;Government;central governmentWed, 15 Dec 2021 10:41:13 GMTకేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాల సవరణ ఇప్పటికే రద్దు చేయబడింది. దీనితో ఆ లోటు తీర్చడానికి కొత్త విధాన ప్రక్రియ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వడం ద్వారా వారికి ఆయా సందర్భాలలో ఇవ్వదలచిన సౌకర్యాలు ఇంకా సులభతరం చేయడానికి సిద్ధం అవుతుంది. అందుకోసం ఇప్పటికే దేశీయంగా ఉన్న రైతుల సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ప్రస్తుతానికి 5.5కోట్ల రైతుల సమాచారం సేకరించారు, వీరందరికి 12 అంకెల యూనిక్యూ ఐడెంటిటీ కార్డు ప్రత్యేక గుర్తింపుగా అందజేయనున్నారు. దీని ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి రావాల్సిన అనేక పధకాలు పొందటం సులభతరం అవుతుంది.

ఈ గుర్తింపు కార్డు ద్వారా నేరుగా రైతుల వద్దకు ఆయా పధకాలు చేరిపోనున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ వ్యవస్థ ద్వారా రైతులందరికీ ఈ గుర్తింపు కార్డు ఆడించడం జరుగుతుంది. అందుకోసం దేశంలో ఉన్న రైతుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. దీనిని అంతటితో డేటాబేస్ సిద్ధం చేసి, అనంతరం ఆయా రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయనున్నారు. ఇందులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఆయా పధకాలు లభ్యమయ్యేట్టుగా ముందు ముందు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇటీవల లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సమానంగా వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర తోమర్ లిఖితపూర్వకంగా ఈ వ్యవస్థ గురించి ప్రస్తావిచారు.

దీనిద్వారా ఆయా రైతుల గుర్తింపు ఆన్ లైన్ చేయబడుతుంది కాబట్టి ప్రతిసారి ఆయా ధ్రువీకరణ పత్రాలు పట్టుకుని కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఇక ఉండబోదు. ఒక్కసారి ఈ కార్డులో వాళ్ళ ధ్రువీకరణ పత్రాల సమాచారం పొందుపరచడంతో ప్రతిసారి ఆయా పధకాలు నేరుగా ఆయా రైతులకు చేరిపోతాయి. దేశం లో 11.5 కోట్ల రైతులు ఉండగా అందులో 5.5 కోట్ల మంది సమాచారం ఇప్పటికే సేకరించడం జరిగింది. మిగిలిన రైతుల వివరాలను సేకరించడం జరుగుతుంది. ఇప్పటికే ప్రధాన మంత్రి కళ్యాణ్ నిధి పొందుతున్న రైతుల అందరికి ఈ కార్డులు జారీచేస్తారు. వారికి గతంలో మాదిరిగానే లబ్ది చేకూరుతుంది. అయితే ప్రతిసారి ఆయా ధ్రువీకరణ పత్రాలు పట్టుకొని ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఇకమీదట ఉండదు. ఈ విధానం ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పధకాలలో పారదర్శకత తేవడానికి అవకాశం ఇస్తుంది.



అదిరిందహే : జనసేన టార్గెట్ ఆ మంత్రే ఎందుకంటే ?

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>