PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp371b1f09-96d2-4d4e-b7f7-9824bf8942ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp371b1f09-96d2-4d4e-b7f7-9824bf8942ea-415x250-IndiaHerald.jpgమంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం... కొద్ది పాటి టిడిపి నేతలంతా ఒక్కోక్కరుగా అక్కడికి చేరు కుంటున్నారు. ఎవరిలోనూ మునుపటి ఉత్సాహం లేదు.అందరూ వచ్చిన కాసేపటికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అక్కడికి చేరుకున్నారు.... ఆ తరువాత ఆయన ఏం చేశారు. ? అసలక్కడ ఏం జరిగింది ?tdp{#}కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;Nellore;kuppam;CBN;AdiNarayanaReddy;K S Ravikumar;Telangana Chief Minister;Telugu Desam Party;Manam;TDP;Party;Teluguసారీ తో సరిపెట్టేసిందెవరు?సారీ తో సరిపెట్టేసిందెవరు?tdp{#}కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;Nellore;kuppam;CBN;AdiNarayanaReddy;K S Ravikumar;Telangana Chief Minister;Telugu Desam Party;Manam;TDP;Party;TeluguWed, 15 Dec 2021 11:26:30 GMT
దాసుని తప్పులు దండంతో సరి అన్న నానుడి తెలుగు నాట విశేషంగా ప్రచారంలో ఉంది. ఇటీవల ముగిసిన పుర పోరులోనూ ఘోర పరాజయాన్ని  తన ఖాతాలో వేసుకున్న తెలుగుదేశం పార్టీ  చేతులు కాలాక అకులు పట్టుకున్న చందంలా దిద్దు బాటు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీశ్రేణులతో సమావేశమవుతున్నారు.  తొలుత కుప్పం మున్సిపాలిటీ నుంచి  చర్చలు  ఆరంభించిన ఆయన ప్రస్తుతం నెల్లూరు నగర పాలక సంస్థ మీద దృష్టి సారించారు. నెల్లూరు నగర పాలక సంస్థ  పరిధిలో రెండు శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి.  ఇటీవల రూరల్ నియోజక వర్గానికి సబంధించిన నేతలతో రివ్యూ చేసిన చంద్ర బాబు నాయుడు, తాజాగా నగర నియోజక వర్గ నేతలతో రివ్యూ నిర్వహించారు.
నగర పాలక సంస్థలో ఘోర పరాజయం ఎదురవడానికి దారితీసిన కారణాలనను సమీక్షించారు. నగర పాలక సంస్థలో గెలుపు గుఱ్ఱాలను అన్వేషించడంలో అందరూ విఫలమయ్యారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేర్కోన్నారు. చాలా చోట్లు నామినేషన్లు వేయడంలో విఫలం ఆయ్యారని ఆవేదన వ్యక్తం చేశారాయన. అంతే కాకుండా దాదాపు పన్నెండు చోట్ల సరైన అభ్యర్థులే దొరకలేదంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తోందని అన్నారు. తాను ప్రస్తుతం చేస్తున్న సమీక్షలు తప్పును సరిదిద్దుకోవాడనికే నని అందరూ గుర్తించాలని కోరారు. మన తప్పుల్ని మనమే సరిచేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కార్యకర్తలకు మాట్లాడ అవకాశం రావడంతో సమావేశానికి హాజరైన అందరూ కూడా ఒకరి పై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు.  ఈ పరంపర నిరాటంకంగా కొనసాగడంతో పార్టీ అధినేత కొంత సేపు అసహనానికి గురయ్యారు. ఇక చాడీలు చెప్పుకోవడం మానండి... మనం అందరం  పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకూ ఫెయిల్  అయ్యామని తెలిపారు.  నగర సమావేశానికి ముందు జరిగిన రూరల్ నియోజక వర్గ సమావేశానంతరం పార్టీ లో ఆది నుంచి ఉన్న నాయుకులు రవికుమార్ చౌదరి, వెంకట స్వాని నాయడులపై పార్టీ సస్పెన్షన్ వేైటు వేసింది.  ఆ విషయం పార్టీ అంతర్గత వేదికపై  సంచలనం సృష్టించింది. ఇది పార్టీకి ఎంతో నష్టాన్ని చేకూరుస్తుందనే విమర్శలు వెల్లువెత్తాయి. నగర నియోజక వర్గం లో కొందరు నేతలపై బహిష్కరణ వేటు పడుతుందని అందరూ భావించారు.  పార్టీ నేతలు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మేయర్ అజీజ్ లు నగర పాలక సంస్థ ఎన్నికలలో జరిగిన పొరపాట్లపై క్షమాపణ చెప్పారు. దీంతో ఎవరి పైనా బహిష్కరణ వేటు పడలేదు. అయితే సమావేశం అనంతరం సారితో సరిపెట్టేశారే వీళ్లు... అన్న గుసగుసలు వినిపించాయి.





వారెవ్వా.... ఏం టైమింగ్ క్రిస్మస్ కోవిడ్ నిబంధనలు అమలవుతాయా ?

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>