MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun6f0fd607-bb75-468a-b9b6-88a44c848e7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun6f0fd607-bb75-468a-b9b6-88a44c848e7c-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పుష్ప విడుదల కావడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో మంచి అంచనాలే ఈ చిత్రంపై ఉన్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు తెలుగులో దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడు ఇతర భాషలలో ప్రమోషన్ కార్యక్రమాలను చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అన్ని భాషలలో తగ్గేదేలే అన్నట్లుగా ఈ చిత్allu arjun{#}mahesh babu;Chitram;Rajamouli;Ram Charan Teja;RRR Movie;India;Allu Arjun;Arjun;December;Cinema;bollywoodరామ్ చరణ్, మహేష్ ల పొరపాటే బన్నీ చేస్తున్నాడా!!రామ్ చరణ్, మహేష్ ల పొరపాటే బన్నీ చేస్తున్నాడా!!allu arjun{#}mahesh babu;Chitram;Rajamouli;Ram Charan Teja;RRR Movie;India;Allu Arjun;Arjun;December;Cinema;bollywoodWed, 15 Dec 2021 11:15:00 GMTఅల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం పుష్ప విడుదల కావడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 17 న భారీ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులలో మంచి అంచనాలే ఈ చిత్రంపై ఉన్నాయని చెప్పవచ్చు. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు తెలుగులో దాదాపు పూర్తి చేశారు. ఇప్పుడు ఇతర భాషలలో ప్రమోషన్ కార్యక్రమాలను చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తుంది. తెలుగుతో పాటు నాలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అన్ని భాషలలో తగ్గేదేలే అన్నట్లుగా ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

అయితే సినిమా విడుదలకు వారం రోజుల ముందు నుంచే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అంటున్నారు. ఈ సినిమా ఎలా ప్రతి ఒక్క ప్రేక్షకుడికు కనెక్ట్ అవుతుంది అన్న అనుమానాన్ని కొంతమంది సినిమా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. రాజమౌళి ప్లానింగ్ గా ఆర్ఆర్ఆర్ సినిమాను సమర్థవంతంగా ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాడు. నెల రోజుల ముందుగానే ఆ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టి దేశ నలుమూలల ఈ చిత్రాన్ని ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేస్తున్నాడు.

ఆ విధమైన ప్రమోషన్ కార్యక్రమాలను పుష్ప చిత్రం ఎందుకు చేయలేకపోతుంది అనే వాదన ఇప్పుడు బయటకు రాగా గతంలో రామ్ చరణ్ జంజీర్ సినిమా విషయంలో తనను తాను బాలీవుడ్ లో ఎక్కువగా ప్రమోట్ చేసుకోలేకపోయాడు. అంతేకాదు మహేష్ బాబు స్పైడర్ సినిమా సమయంలో ఇతర. భాషలలో తనను తాను ప్రమోట్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఈ సినిమా విషయంలో అల్లు అర్జున్ కూడా అలాంటి తప్పు చేస్తున్నాడని సినిమా విశ్లేషకులు అంటున్నారు. పాన్ ఇండియా సినిమా చేసేటప్పుడు కనీసం పదిహేను రోజుల ముందుగానే ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి కానీ ఇలా వారం రోజుల ముందు నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే అది సినిమా పై ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. 



ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఇంత ఘోర‌మా.. కేంద్ర మంత్రి సంచ‌ల‌నం

కేసీఆర్, స్టాలిన్ కూటమిలో జగన్ ఎంట్రీ ఎప్పుడు..?

కొత్త దోస్తీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బ‌ల‌ప‌డుతుందా..?

అబ్బో.. ఆ విషయంలో శిల్పాచౌదరి మహా ముదురు!

రాజ్ తరుణ్ పరిస్థితి ఎందుకిలా అయిపోయింది..?

పాట కోసం 5 కోట్లు.. పిచ్చెక్కిపోవాల్సిందే..!

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>