PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/beware-of-omicron-deaths-are-on-the-rise-7d6bf247-c44a-4419-a58c-ccbff6a74796-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/beware-of-omicron-deaths-are-on-the-rise-7d6bf247-c44a-4419-a58c-ccbff6a74796-415x250-IndiaHerald.jpgఒమిక్రాన్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన కలిగించే వార్త చెప్పింది. రాబోయే రోజుల్లో వైరస్ మరింత విజృంభిస్తుందని వెల్లడించింది. అంతేకాదు ఆ మహమ్మారి ప్రభావంతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు.. మరణాలు భారీ సంభవిస్తాయని అభిప్రాయపడుతోంది. Beware of Omicron Deaths are on the rise {#}Application;Delhi;Shaktiహెచ్చరిక : ఒమిక్రాన్ తో జాగ్రత్త.. మరణాలు పెరుగుతాయట..!హెచ్చరిక : ఒమిక్రాన్ తో జాగ్రత్త.. మరణాలు పెరుగుతాయట..!Beware of Omicron Deaths are on the rise {#}Application;Delhi;ShaktiTue, 14 Dec 2021 20:30:00 GMTఒమిక్రాన్ వేరియంట్ తో ప్రపంచ వ్యాప్తంగా మరణాల సంఖ్య పెరిగే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కేసులు పెరిగే కొద్దీ ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, చనిపోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నామని పేర్కొంది. అందువల్ల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల వివరాలను అందించాలని ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ విజ్ఞప్తి చేసింది. ఒక్క బ్రిటన్ లోనే వచ్చే ఏప్రిల్ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

మరోవైపు ఒమిక్రాన్ ను గంటన్నరలోనే గుర్తించే పరీక్షా విధానాన్ని ఐఐటీ ఢిల్లీ పరిశోధక బృందం రూపొందించింది. ఆర్టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణతో దీన్ని వేగంగా గుర్తించవచ్చని తెలిపింది. ఈ టెస్ట్ కిట్ ఉత్పత్తి కోసం కంపెనీలతో చర్చలు ప్రారంభించిన రీసెర్చ్ బృందం.. పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. గతంలో కరోనాను వేగంగా గుర్తించే పీసీఆర్ పరీక్షను కూడా ఐఐటీ ఢిల్లీనే రూపొందించింది. ప్రస్తుతం ఒమిక్రాన్ గుర్తింపు కోసం మూడు రోజులు పడుతోంది.

ఇక బూస్టర్ డోస్ పంపిణీపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం పడుతుందని ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. డోసుకు సంబంధించి మరిన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్టు పేర్కొంది. మరోవైపు టీకా డోసుల షెడ్యూలు పైనా  చర్చలు జరుపుతున్నామనీ.. టీకా వేసుకుంటే శరీరంలో ఏర్పడే రోగ నిరోధక శక్తి ఎంతకాలం ఉంటుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదని కేంద్రం వెల్లడించింది.  

పెద్దలు కోవిడ్ ను ఎదుర్కొనేలా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్న పుణెకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ .. ఇప్పుడు మరో ఆరు నెలల్లో పిల్లల వ్యాక్సిన్ కు అనుమతులు వస్తాయంది. కోవోవ్యాక్స్ పేరిట తీసుకొచ్చే ఈ వ్యాక్సిన్ పై ప్రస్తుతం పరిశోధకులు జరుగుతున్నాయని ఎస్ఐఐ సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు. అటు ఈ వ్యాక్సిన్ కు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటా ఇవ్వాలని డ్రగ్ రెగ్యులేటరీ కోరింది.








వార్నీ.. కోవిషీల్డ్ టీకాతో పెద్దగా ఉపయోగం లేదా..?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>