PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp08c0f396-c47d-404a-89d5-ada69f5b5fea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp08c0f396-c47d-404a-89d5-ada69f5b5fea-415x250-IndiaHerald.jpgతాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ముఖ్య‌మంత్రి ప్రోద్బ‌లంతో కొన్ని వ్యాఖ్య‌లు సీమ నుంచి వినిపించినా, మంత్రులు వినిపించినా అవేవీ నెగ్గేలా లేవు అని తేలిపోయింది. తిరుప‌తి చేరుకున్న యాత్ర‌కు శుభం కార్డు ప‌డ‌డంతో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ నేత‌లు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు, ముఖ్యంగా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.ycp{#}deva;BOTCHA SATYANARAYANA;Amaravathi;Rayalaseema;court;Bharatiya Janata Party;YCP;policeవావ్ : రాజ‌ధాని రైతు అనుకున్న‌ది సాధించాడ్రా!వావ్ : రాజ‌ధాని రైతు అనుకున్న‌ది సాధించాడ్రా!ycp{#}deva;BOTCHA SATYANARAYANA;Amaravathi;Rayalaseema;court;Bharatiya Janata Party;YCP;policeTue, 14 Dec 2021 19:12:20 GMTవైసీపీ కూడా మాట్లాడ‌లేదు. నిర్వాసిత రైతుల‌కు న్యాయం చేయండ‌ని చెప్ప‌డం తప్ప వ్య‌తిరేకించ‌లేదు. కానీ అప్పుడు వ్య‌తిరేకించ‌ని వైసీపీ  అధికారంలోకి రాగానే ప‌సుపు పార్టీపై కోపం మరియు ద్వేషంతో ర‌గిలిపోతూ అమ‌రావ‌తి ఉద్య‌మాన్నే అణిచివేసేందుకు ప్ర‌య‌త్నిస్తే రైతులు మాత్రం ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను ప్ర‌తిఘ‌టించారు. తిండి నిద్ర మాని త‌మ హక్కుల కోసం పోరాడారు. ఒక‌వేళ ఇది ఫేక్ ఉద్య‌మం అని బొత్స లాంటి వారు నిరూపిస్తే నిరూపించ‌ని, అంత‌కుమించిన త‌ప్పిదాలు ఎన్నో వైసీపీ చేస్తే చేయ‌ని కానీ ప్ర‌జా మ‌ద్ద‌తు రేపు ఎవ‌రి వైపు ఉంటుందో అని తేలిపోనుండ‌డం ఖాయం. జ‌గ‌న్ ఇప్పుడు ఏం అంటారో.. దేవ‌స్థానం గెలిచింది.. న్యాయ స్థానం గెలిపించింది అన్న‌ది ఇవాళ్టి అమ‌రావ‌తి రైతుల ఆనందాల‌కు సంకేతంగా వినిపిస్తున్న మాట‌లు.
రాజ‌ధాని రైతు అనుకున్న‌ది సాధించాడు. సాధించి గెలిచాడు. ఉన్న పళాన వైసీపీ ప్ర‌భుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఆంక్ష‌లుపెట్టినా అవేవీ త‌న సంక‌ల్పం ముందు ప‌నిచేయ‌లేదు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీరుకు నిర‌స‌న‌గా న్యాయ‌స్థానం నుంచి దేవ స్థానం వ‌ర‌కూ చేప‌ట్టిన పాద‌యాత్ర 44 రోజులుగా అప్ర‌తిహ‌తంగా సాగి ఇవాళ ముగిసింది. ఈ యాత్ర‌కు తొలి రోజుల్లో అస్స‌లు అనుమ‌తే లేద‌ని ప్ర‌భుత్వ ప్ర‌తినిధులు న్యాయ‌ప‌రంగా అడ్డుకున్నారు. మీడియానూ రావొద్ద‌ని అన్నారు. కొన్ని సార్లు కోర్టు జోక్యంతో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యాయి. దీంతో కొంత ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్నా కూడా రాజ‌ధాని రైతు స్వామి స‌న్నిధికి చేరుకున్నాడు. 


యాత్ర‌లో అడుగ‌డుగునా పోలీసు నిర్బంధం ఉన్నా అవేవీ లెక్క చేయ‌క కొన్ని చోట్ల అవ‌మానాలు సైతం భ‌రించిన రైత‌న్న స్వామి ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాడు. ఓ విధంగా అమ‌రావ‌తి రైతు త‌న మొక్క‌వోని సంక‌ల్పం ఇదే అని రాష్ట్రానికి, కేంద్రానికి చాటాడు. అమ‌రావ‌తి రైతుకు బీజేపీ కూడా మ‌ద్ద‌తు ఇచ్చింది. జ‌న‌సేన కూడా త‌న‌వంతు మ‌ద్ద‌తు అందించి బాస‌ట‌గా నిలిచింది. 

తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టికిప్పుడు ముఖ్య‌మంత్రి ప్రోద్బ‌లంతో కొన్ని వ్యాఖ్య‌లు సీమ నుంచి వినిపించినా, మంత్రులు వినిపించినా అవేవీ నెగ్గేలా లేవు అని తేలిపోయింది. తిరుప‌తి చేరుకున్న యాత్ర‌కు శుభం కార్డు ప‌డ‌డంతో అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ నేత‌లు, వివిధ సంఘాల ప్ర‌తినిధులు, ముఖ్యంగా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.





గుంటూరులో ఆ ‘ఫ్యాన్స్’ సీట్లు డౌటేనా?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>