PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఏపీ లో 2019 ఎన్నికలకు ముందు వైసిపి గాలి బలంగా కనిపించింది. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్ నేతలు సైతం ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి ... ఆ పార్టీలో చేరిపోయారు. ఈ లిస్టులో చాలా మంది నేతలు ఉన్నారు. అలా వచ్చిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరు. ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తన కుమారుడు రత్నాకర్ కు విశాఖ ఉత్తరం టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో రత్నాకర్ ఓడిపోయారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఆయన టిడిపి కంJagan ysrcp{#}Amarnath Cave Temple;Anakapalle;Dadi Veerabhadra Rao;Jagan;Janasena;Vishakapatnam;Hanu Raghavapudi;CBN;TDP;YCP;Minister;Partyజ‌గ‌న్‌కు మాజీ మంత్రి షాక్‌... పార్టీ జంప్ ?జ‌గ‌న్‌కు మాజీ మంత్రి షాక్‌... పార్టీ జంప్ ?Jagan ysrcp{#}Amarnath Cave Temple;Anakapalle;Dadi Veerabhadra Rao;Jagan;Janasena;Vishakapatnam;Hanu Raghavapudi;CBN;TDP;YCP;Minister;PartyTue, 14 Dec 2021 22:00:00 GMTఏపీ లో 2019 ఎన్నికలకు ముందు వైసిపి గాలి బలంగా కనిపించింది. ఈ క్రమంలోనే చాలా మంది సీనియర్ నేతలు సైతం ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని భావించి ... ఆ పార్టీలో చేరిపోయారు. ఈ లిస్టులో చాలా మంది నేతలు ఉన్నారు. అలా వచ్చిన వారిలో విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఒకరు. ఆయన 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి తన కుమారుడు రత్నాకర్ కు విశాఖ ఉత్తరం టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో రత్నాకర్ ఓడిపోయారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే ఆయన టిడిపి కండువా కప్పుకున్నారు.

అయితే చంద్రబాబు దాడిని పట్టించుకోలేదు. గత ఎన్నికలకు ముందు రత్నాకర్ - వీరభద్రరావు ఇద్దరు కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఎన్నికల ముందు పార్టీలో చేరడంతో జగన్ వారికి ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. పార్టీ అధికారంలోకి రావడంతో దాడి కచ్చితంగా తనకు నామినేటెడ్ పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. అయితే జగన్ దాడిని పట్టించుకోవడం లేదు. ఇప్పటికే ఏడు పదుల వయసులో ఉన్న దాడి త‌న‌ను ఎమ్మెల్సీగా చేయాలని కోరుతున్నారు.

అయితే జగన్ మాత్రం దాడిని వచ్చే ఎన్నికల వరకు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ విషయం ఆయనకు కూడా అర్థమైంది. దీంతో దాడి మరోసారి తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లి టికెట్ వచ్చే ఎన్నికల్లోనూ దాడి కుమారుడికి రాదు. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నా గుడివాడ అమర్నాథ్ కు జగన్ తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

ఈ లెక్కన చూస్తే దాడి ఫ్యామిలీకి వచ్చే ఎన్నికల్లోనూ ఎలాంటి అవకాశాలు వైసీపీ నుంచి లేవని తెలిసిపోయింది. దీంతో ఇప్పుడు ఆయన జనసేన లేదా బిజెపిలో చేరాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దాడి లాంటి వాళ్ళు పార్టీ మారినా జగన్ ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు.



వార్నీ.. కోవిషీల్డ్ టీకాతో పెద్దగా ఉపయోగం లేదా..?

పుష్ప కొడితే.. బాలీవుడ్ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

భారత్ : చైనా బలంపై.. గట్టిదెబ్బ..!

అస్సాం : బంగ్లా వాళ్ళు.. వెళ్లిపోవాల్సిందే..!

అయ్యో.. ఇప్పుడు నీకు ఇది అవసరమా?

'ధన్ రేఖ ప్లాన్' ఎల్ఐసి నుంచి కొత్త పాలసీ?

లీడర్ కాకుంటే రానా ఏ సినిమా తో వచ్చేవాడంటే?

Bigg Boss 5: చరిత్రలోనే మొదటిసారి ఇలా.. వావ్ అనాల్సిందే..!!

తాలిబ‌న్ల‌కు బీజేపీకి పెద్ద తేడాలేదు : వినోద్‌కుమార్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>