CrimeN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/-doctors-negligencead548aee-f164-46b7-98eb-b4f09ee40358-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/-doctors-negligencead548aee-f164-46b7-98eb-b4f09ee40358-415x250-IndiaHerald.jpgహైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న వ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వ ఏరియా ఆసుప‌త్రిలో ఆదివారం దారుణం చోటు చేసుకున్న‌ది. డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం మూలంగా ఓ శిశువు మృతి చెంద‌డం వివాద‌స్ప‌దంగా మారిన‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌లం నాద‌ర్‌గుల్ కు చెందిన అందెల ర‌మేష్ యాద‌వ్ (35), స్వ‌ప్న (30) దంప‌తులు. డిసెంబ‌ర్ 10న స్వ‌ప్న రెండ‌వ ప్ర‌స‌వం కోసం వ‌న‌స్థ‌లిపురం ఏరియా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయింది. డిసెంబ‌ర్ 11న వ‌న‌స్థ‌లిపురం ఆసుప‌త్రి డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ప్ర‌స‌వం చేసారు. పండ#doctors negligence{#}sunday;Ranga Reddyవ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం..!వ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో దారుణం..!#doctors negligence{#}sunday;Ranga ReddyMon, 13 Dec 2021 19:55:01 GMTహైద‌రాబాద్ న‌గ‌ర శివారులో ఉన్న వ‌న‌స్థ‌లిపురం ప్ర‌భుత్వ ఏరియా ఆసుప‌త్రిలో ఆదివారం దారుణం చోటు చేసుకున్న‌ది. డాక్ట‌ర్ల నిర్ల‌క్ష్యం మూలంగా ఓ శిశువు మృతి చెంద‌డం వివాద‌స్ప‌దంగా మారిన‌ది. వివ‌రాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండ‌లం నాద‌ర్‌గుల్ కు చెందిన  అందెల ర‌మేష్ యాద‌వ్ (35), స్వ‌ప్న (30) దంప‌తులు. డిసెంబ‌ర్ 10న స్వ‌ప్న రెండ‌వ ప్ర‌స‌వం కోసం వ‌న‌స్థ‌లిపురం ఏరియా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయింది.

డిసెంబ‌ర్ 11న వ‌న‌స్థ‌లిపురం ఆసుప‌త్రి డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ నిర్వ‌హించి ప్ర‌స‌వం చేసారు. పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మిచ్చింది స్వ‌ప్న‌. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి ఆరోగ్యం బాగానే ఉన్న‌ది. ఉన్న‌ట్టుండి ఇవాళ మ‌ధ్యాహ్నం 11 గంట‌ల స‌మ‌యంలో ప‌సిపాప విప‌రీతంగా ఏడిచింది. పాప సాధార‌ణంగానే ఏడ్చుతున్న‌దని అక్క‌డ ఉన్న న‌ర్సులు, డాక్ట‌ర్లు ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. అదేవిధంగా పాప కుటుంబ స‌భ్యుల‌ను లోప‌లికి వెళ్లేందుకు ఎవ్వ‌రినీ కూడా సెక్యూరిటీ అనుమ‌తించ‌లేదు.  

ఆ త‌రువాత కొద్ది సేప‌టికి పాప ఏడ్చుతుంద‌ని సిబ్బందికి చెప్ప‌గా సిబ్బంది వ‌చ్చి చూసే స‌రికి పాప ఏడుపు ఆపింది. ఒక్క‌సారిగా క‌ళ్లు మూయ‌డంతో అప్పుడు డాక్ట‌ర్లు వ‌చ్చి ప‌రీక్షించ‌గా అప్ప‌టికే శిశువు మృతి చెందిన‌ట్టు నిర్థారించారు.  ఏడిచి ఏడిచి పాప గొంతు ఎండిపోయి ఊపిరి వ‌దిలిందని డాక్ట‌ర్లు చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఈ విష‌యం ముందే చెబితే మేము మరొక ఆసుప‌త్రికి వెళ్లే వాళ్ల‌ము క‌దా అని నిల‌దీసారు బంధువులు. క‌నీసం అక్క‌డ విధులు నిర్వ‌హిస్తున్న న‌ర్సులు డాక్ట‌ర్ల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌లేద‌ని.. డాక్ట‌ర్లు కూడా సంద‌ర్శించ‌లేద‌ని మండిప‌డ్డారు. డాక్ట‌ర్లు, ఆసుప‌త్రి సిబ్బంది నిర్ల‌క్ష్యం మూలంగా పండంటి ప‌సిపాప మృతి చెందింద‌ని బంధువులు ఆరోపించారు.  ముఖ్యంగా ప్ర‌యివేటు ఆసుప‌త్రిలో డ‌బ్బులు ఎక్కువ‌గా ఖ‌ర్చు అవుతాయి అని.. పేద‌ల‌కు డ‌బ్బులు లేక ప్ర‌భుత్వ ఆసుప‌త్రిని ఆశ్ర‌యిస్తే.. ఆసుప‌త్రి డాక్ట‌ర్లు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఇలా ప‌సిపాప‌ల ప్రాణాలు కోల్పోతున్నార‌ని స్థానికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కొద్ది సేపు వ‌న‌స్థ‌లిపురం ఏరియా ఆసుప‌త్రి ముందు బంధువులు ధ‌ర్నా నిర్వ‌హించారు.





యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>