PoliticsVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modic27fbd48-2b13-430c-8f8a-ae5ebd5573f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/modic27fbd48-2b13-430c-8f8a-ae5ebd5573f3-415x250-IndiaHerald.jpgభారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గోంటున్నారు. ప్రధాని పర్యటన ఏర్పా\ట్లను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షించారు.modi{#}Mathri;Narendra Modi;Maha;Uttar Pradesh;advertisement;Government;Kasi;Bharatiya Janata Party;Prime Ministerమోడీ... దాచేస్తే దాగని సత్యాలివేమోడీ... దాచేస్తే దాగని సత్యాలివేmodi{#}Mathri;Narendra Modi;Maha;Uttar Pradesh;advertisement;Government;Kasi;Bharatiya Janata Party;Prime MinisterMon, 13 Dec 2021 12:05:53 GMT

నైలునది నాగరికతలో
సామాన్యుని జీవన మెట్టిది ?
తాజ్ మహల్ నిర్మాణానికి
రాల్లెత్తిన కూలీలెవ్వరు ?

అంటూ సాగుతుంది శ్రీశ్రీ - మహా ప్రస్థానం. దశాబ్దాలు గడుస్తున్నా ఆ మహాకవి రాసిన వాక్యాలు నేటికీ చిరస్మరణీయమే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజక వర్గంలో  నేడు పర్యటిస్తున్నారు. ఏ ప్రజా ప్రతినిధి అయినా తన  నియోజక వర్గంలో పర్యటించాల్సిందే. వారి కష్ణనష్టాలను తెలుసుకోవాల్సిందే. అది వారి ధర్మం కూడా.  గతంలో మోడీ చాలా సార్లు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గంలో పర్యటించారు. నేడు ఆయన తన నియోజక వర్గంలో  మరో మారు పర్యటిస్తున్నారు. నాటి పర్యటనలకు, నేటి పర్యటనలకు చాలా తేడా ఉంది. నేటి  పర్యటనపై  ప్రసార మాథ్యమాలలో విపరీతమైన ప్రచార పటాటోపం సృష్టించారు.  ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతావని వరకూ పత్రికలు, ఛానళ్లలో విపరీతమైన ప్రచారం కల్పించారు.  ప్రింట్ మీడియాకు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. గతంలో ఎన్నడూ ఇంత ప్రచార ఉదృతి లేదు. రానున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ప్రధాన మంత్రీ దామోదర్ దాస్ నరేెంద్రమోడీ  ఇటీవలి పర్యటనలు జరుగుతున్నాయనేది జగమెరిగిన సత్యం.
 తన పర్యటనలో భాగంగా వారణాసి నగరంలో ప్రధాన మంత్రి  కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ప్రారంభించ నున్నారు. దాదాపు 330 కోట్లు రూపాయలతో అత్యంత సుందరంగా నిర్మించిన  కాశీ విశ్వనాథ్ థామ్ ప్రథమ భాగాన్ని నేడు ఆయన ప్రారంభించనున్నారు. కాశీ విశ్వనాథ్ ఆలయానికి నూతన శోఖను చేకూరుస్తామని భారతీయ జనతా పార్టీ శ్రేణులు పేర్కోంటున్నాయి. ఇప్పటికే జ్యౌతిర్లింగాలలో ఒకటిగా ఉన్న కాశీ క్షేత్రం మరింత ప్రకాశ వంతమవుతుందని అధికార బిజేపి నేతలు పేర్కోంటున్నారు.
 కాశీ విశ్వనాథ్ థామ్ లో భాగంగా  మందిరాన్ని సువిశాలంగా చేశామని అధికారులు పేర్కంటున్నారు.

అది నాణేనికి ఒక వైపు కోణం మాత్రమే.  మరోవైపు ఏంటో తెలుసా ? ఆలంయు చుట్టూర ఉన్నఆస్తులన్నింటినీ ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకుంది.  కొందరి పరిహారం ముట్టజెప్పింది, మరి కొందరికి ఇంకా పరిహారం అంద వలసి ఉంది. దేవాలయం చుట్టు పక్కల ఉన్న పద్నాలుగు వందలకు పైగా దూకాణాలను అధికారులు, ప్రజాప్రతినిధులు బలవంతంగా ఖా ళీ చేయించారు. వారిని వేరే చోటికి తరలించారు. తరతరాలుగా కాశీ విశ్వనాధుడ్ని, అక్కడికి వచ్చే యాత్రీకులను నమ్మకుని జీవనం సాగిస్తున్న వారి బతుకులు ప్రభుత్వ  చర్యల మూలంగా చల్లాచదురయ్యాయి. ఇదంతా అభివృద్ధి అంటారా ? అని ప్రశ్నించిన వారి గొంతలను అణిచి వేశారు కూడా... ఏది ఏమైనా మన ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ  ఒక ఆశాదూత కదా !







ఊ అంటావా.. ఉఊ అంటావా.. సమంత వీడియో వైరల్?

గులాబీ వ‌నంలో `ఈటెల‌` ముల్లు..?

ఆ ఒక్క మాట.. ఆమెను మిస్ యూనివర్స్ చేసింది?

ఇదేం ట్విస్టు.. వ్యాక్సిన్ వేసుకోకపోతే పింఛన్ కట్?

దేశంలో స్వ‌చ్ఛత‌లో ముందు ఏ న‌గ‌ర‌మో తెలుసా..?

కుల రిజర్వేషన్ లు వద్దంటున్న మాజీ సిఎం.

బిగ్ బాస్ షోలో నాగార్జున సంచలన నిర్ణయం..!!

గణతంత్ర ఉత్సవాలు : ఈసారి.. మరింత కొత్తగా..!

పంజాబ్ లో కాంగ్రెస్ కష్టమేనా.. ఆ సర్వే ఏం చెబుతోంది..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>