MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam8de60ab4-ca1d-46ad-91fc-223d1d860aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam8de60ab4-ca1d-46ad-91fc-223d1d860aaf-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్రహీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న 'రాదే శ్యామ్' సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంRadhe Shyam{#}Pooja Hegde;shyam;Makar Sakranti;Radha Krishna Kumar;Varsham;Prabhas;Bahubali;Love;Japan;India;Hero;News;January;Cinemaవావ్ : 'రాధే శ్యామ్' సినిమాకి అక్కడ ప్రీ పబ్లిసిటీ..!!వావ్ : 'రాధే శ్యామ్' సినిమాకి అక్కడ ప్రీ పబ్లిసిటీ..!!Radhe Shyam{#}Pooja Hegde;shyam;Makar Sakranti;Radha Krishna Kumar;Varsham;Prabhas;Bahubali;Love;Japan;India;Hero;News;January;CinemaMon, 13 Dec 2021 20:16:25 GMTటాలీవుడ్ అగ్రహీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ నటిస్తున్న 'రాదే శ్యామ్' సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. పీరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాపై జపాన్ అభిమానుల ప్రభావం కూడా అధికంగా ఉందనే చెప్పాలి. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఫాలోయింగ్ జపాన్ దేశంలో భారీ రేంజ్ లో పెరిగిపోయింది. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే చాలు జపాన్ అభిమానులు అందరూ ఫుల్ ఆక్టివ్ అయిపోతారు. తమ హీరో సినిమా వస్తోందంటే చాలు సోషల్ మీడియాలో ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి అదృష్టమే ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కు దక్కింది. 

జపాన్ అభిమానులు రాదే శ్యామ్ సినిమాకు సంబంధించి తమదైన శైలిలో డాన్సు చేస్తూ.. పాటలు పాడుతూ.. వరుస పోస్టులు పెడుతున్నారు. జపాన్లో ఈ సినిమాకు ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే జపనీస్ అంతా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటువంటి ఒక అరుదైన ప్రేక్షకుల అభిమానం, ఫ్రీ పబ్లిసిటీ అనేది ప్రభాస్ ఒక్కడికే దక్కడం నిజంగా విశేషంగానే చెప్పాలి. ఇక రాధేశ్యామ్ చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాని జపనీస్ లో సబ్ టైటిల్స్ తో విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాతో జపాన్ మార్కెట్ లో కూడా ప్రభాస్ కాసుల వర్షం కురిపిస్తాడేమో చూడాలి...!!



యూపీ ఎన్నికలు: రాహుల్, ప్రియాంక గాంధీలు అమేథిలో పాదయాత్ర.. ఇందుకేనా..!

జ‌గ‌న్ పాల‌వెల్లువ‌.. విప‌క్షాల పాపాల వెల్లువ‌..!

బ్రేకింగ్: ఏపీలో పీఆర్సీ ఎంత అంటే..?

గోవాలో మమత వ్యూహం వర్కౌట్ అవుతుందా..!

ఆ కీల‌క నేత టీడీపీకి దూరం అయిపోయాడా...!

బ్రేకింగ్ : తొలి ఒమిక్రాన్ మ‌ర‌ణం.. ఎక్క‌డంటే..?

పుష్ప ఈవెంట్.. రచ్చాహ.. రచ్చస్య.. రచ్చభ్యహా!!

భీమ్లా నాయక్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి?

మాజీ న్యాయమూర్తికి నోటీసు జారీ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>