PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu rahul gandhi hand in hand-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu rahul gandhi hand in hand-415x250-IndiaHerald.jpgపొత్తుల రాజ‌కీయం.. రాజకీయ అవ‌స‌రాల కోసం పార్టీలు దోస్తి క‌డుతుంటాయి, ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకున్నా సీట్ల కోసం దోస్తి చేస్తారు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాజ‌కీయాలు అంటే గుర్తుకు వ‌చ్చేది టీడీపీ-కాంగ్రెస్‌లే ఇప్పుడు ఆ పార్టీలు ఉనికి కోసం పోరాడే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తెలంగాణ‌లో టీడీపీ, ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ముగిసిపోయింది. దీంతో త‌మ ఉనికిని నిల‌బెట్టుకోవాల‌ని ఆయా పార్టీలు చూస్తున్నాయి. 2014 వ‌ర‌కు స‌మైక్యాంధ్ర‌లో కాంగ్రెస్ తిరుగులేని పార్టీగా ఉంది. మ‌ధ్య‌లో టీడీపీ అధికారంలో ఉంది. 2014 రTDP and Congress {#}rahul;Rahul Gandhi;Rahul Sipligunj;revanth;Congress;Telangana;TDPకొత్త పొత్తు : ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ దోస్తి..?కొత్త పొత్తు : ఏపీలో టీడీపీ-కాంగ్రెస్ దోస్తి..?TDP and Congress {#}rahul;Rahul Gandhi;Rahul Sipligunj;revanth;Congress;Telangana;TDPSun, 12 Dec 2021 08:28:44 GMTపొత్తుల రాజ‌కీయం.. రాజకీయ అవ‌స‌రాల కోసం పార్టీలు దోస్తి క‌డుతుంటాయి, ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు గుప్పించుకున్నా సీట్ల కోసం దోస్తి చేస్తారు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాజ‌కీయాలు అంటే గుర్తుకు వ‌చ్చేది టీడీపీ-కాంగ్రెస్‌లే ఇప్పుడు ఆ పార్టీలు ఉనికి కోసం పోరాడే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. తెలంగాణ‌లో టీడీపీ, ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి ముగిసిపోయింది. దీంతో త‌మ ఉనికిని నిల‌బెట్టుకోవాల‌ని ఆయా పార్టీలు చూస్తున్నాయి. 2014 వ‌ర‌కు స‌మైక్యాంధ్ర‌లో కాంగ్రెస్ తిరుగులేని పార్టీగా ఉంది. మ‌ధ్య‌లో టీడీపీ అధికారంలో ఉంది. 2014 రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం ఏపీ, తెలంగాణ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ దిక్కు తోచ‌ని స్థితిలో ఉంది. 


రాష్ట్రాన్ని విడ‌దీసినందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌పై మండిప‌డుతున్నారు. అయితే, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీని ఎంత మాత్రం ఆద‌రించ‌లేదు. గ‌త రెండు సాధార‌ణ ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. 2014లో రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తీవ్ర ప‌రాభవాన్ని ఎదుర్కొంది. ఇక 2018లో జ‌రిగిన ముందస్తు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ఒంట‌రిగా పోటీ చేయ‌లేక టీడీపీ తో పొత్తు పెట్టుకుంది. అయినా, కాంగ్రెస్‌కు 20 సీట్లు కూడా రాలేక‌పోయాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు తెలుస్తోంది. 


జాతీయ నేత రాహుల్ గాంధీ కూడా బీజేపీని కొట్టాలంటే చంద్ర‌బాబు లాంటి నేత స‌హాయ స‌హ‌కారాలు అవ‌స‌రం అని భావిస్తున్నార‌ట‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ త‌మ‌తో పొత్తు పెట్టుకుంటే 2024 ఎన్నిక‌ల త‌రువాత కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే అప్పుడు టీడీపీకి ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి అంతా తాము చూసుకుంటామ‌ని రాహుల్ చంద్ర‌బాబుకు హామి ఇచ్చినట్టు స‌మ‌చారం. అయితే, తెలంగాణ‌లో మాత్రం పొత్తు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని, ఉంటే మాత్రం రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ త‌గల‌డం ఖాయం అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.



బూస్టర్ డోస్ వేసుకున్న వదలని ఓమిక్రాన్.. అంతా భయం భయం?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>