PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/25airportsprivate-2c6d0594-cb10-453c-8ea7-dce15978374c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/25airportsprivate-2c6d0594-cb10-453c-8ea7-dce15978374c-415x250-IndiaHerald.jpgబీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా వచ్చిన సంస్థలు పక్కన పెడితే ప్రభుత్వంలో ఉన్న అనేక సంస్థలను ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు. ఇలా చేయడానికి కారణం అవన్నీ నష్టాలలో ఉండటమే లేక వాటిని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం చెపుతుంది. ప్రభుత్వం గతంలో సంస్థలు ఏర్పాటు చేయడం ఎందుకు వాటిని మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం ఎందుకో సామాన్యులకు మాత్రం అర్ధం కావడంలేదు. అయితే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాత్రం ఒక్క విషయం స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అంటే, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట25airportsprivate;{#}uday kiran;Rajahmundry;Vishakapatnam;central government;Telugu;Minister;Bharatiya Janata Party;Governmenthappy sunday 12-dec : 25 ఎయిర్ పోర్టులు.. ప్రైవేటీకరణ..!happy sunday 12-dec : 25 ఎయిర్ పోర్టులు.. ప్రైవేటీకరణ..!25airportsprivate;{#}uday kiran;Rajahmundry;Vishakapatnam;central government;Telugu;Minister;Bharatiya Janata Party;GovernmentSun, 12 Dec 2021 14:48:53 GMTబీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా వచ్చిన సంస్థలు పక్కన పెడితే ప్రభుత్వంలో ఉన్న అనేక సంస్థలను ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు. ఇలా చేయడానికి కారణం అవన్నీ నష్టాలలో ఉండటమే లేక వాటిని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం చెపుతుంది. ప్రభుత్వం గతంలో సంస్థలు ఏర్పాటు చేయడం ఎందుకు వాటిని మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్ పరం చేయడం ఎందుకో సామాన్యులకు మాత్రం అర్ధం కావడంలేదు. అయితే ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ మాత్రం ఒక్క విషయం స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అంటే, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వారు నిర్వహిస్తారు తప్ప ఆస్తులు అన్నీ ప్రభుత్వం చేతులలోనే ఉంటాయని ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే ఆస్తులు ప్రభుత్వ ఆదీనంలో ఉన్నప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎలా నిర్వహించగలరు అనేది ఇక్కడ సందేహం రావడం సహజం.

 ప్రైవేటీకరణ లో భాగంగా ప్రస్తుత  కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ఆ దిశగా ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం చేస్తూ పోతుంది. ఇప్పటికే ఎయిర్ పోర్టులు కొన్ని ప్రైవేట్ పరం చేసినప్పటికీ, దేశంలో మొత్తం 25 ఎయిర్ పోర్టులను ప్రైవేట్ పరం చేస్తున్నట్టుగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ దిశగా అడుగులు వేస్తుంది. రానున్న ఐదేళ్ళలో కూడా 27 విమానాశ్రయాలను ప్రైవేట్ పరం చేస్తున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. నేషనల్ మానిటైజెషన్ పైప్ లైన్ లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఎంసి లో భాగంగా ఎయిర్ పోర్ట్ విభాగం చేతిలో ఉన్న 25 విమానాశ్రయాలను 2022 నుండి 2025 వరకు ప్రైవేట్ ఆధీనంలోనే ఉండనున్నాయి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. భువనేశ్వర్, వారణాసి, అమృత్ సర్, త్రిచి, ఇండోర్, రాయపూర్, కాలికట్, కోయంబత్తూర్, నాగపూర్, మధురై, సూరత్, రాంచి, జోద్పూర్, చెన్నై, విజయవాడ, వడోదర, భోపాల్, తిరుపతి, ఇంపాల్, అగర్తలా, ఉదయ్ పూర్, డెహ్రాడూన్, రాజమహేంద్రవరం విమానాశ్రయాలు ప్రైవేట్ హస్తగతం కానున్నాయి.

ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ అనుకుంటున్న తెలుగు రాష్ట్రంలో కూడా మూడు ఎయిర్ పోర్టులు ప్రైవేట్ పరం కానున్నాయి. అయితే ముందుగా చెప్పినట్టుగా మూడు ఏళ్ళు మాత్రమే వారి చేతులలో ఉంటాయా, ముందు శాశ్వతం అని చెపితే ఆందోళనలు జరుగుతాయని అలా ప్రకటించారా అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది. లాభాలు వస్తున్నవి, రానివి అన్నిటిని ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సబబు అనేది విపక్షాల ప్రశ్న. ఇప్పటికే ఎన్నో విమర్శలను ఎదురుకొంటున్న బీజేపీ ఈ దెబ్బతో ఇంకా ఎంతగా ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.



కోట్ల లెక్కతేలేది ఎలా..!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>