PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu00240746-2626-4918-b8d3-6165b4af8865-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu00240746-2626-4918-b8d3-6165b4af8865-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విషయంలో రాజ‌కీయాలు న‌డుస్తూనే ఉన్నాయి. కానీ, అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ గానీ.. ఇప్పుడు ప‌రిపాలిస్తున్న వైసీపీ గానీ.. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా డిమాండ్ చేసిన సంద‌ర్భాలు లేవ‌నే చెప్పాలి. ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు నాయ‌డు జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు. ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, స‌రిగ్గా 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారుChandrababu{#}MP;రాజీనామా;Hanu Raghavapudi;YCP;TDP;central governmentఅదే స‌వాల్‌.. ఈసారి బాబుగారి వంతు..!అదే స‌వాల్‌.. ఈసారి బాబుగారి వంతు..!Chandrababu{#}MP;రాజీనామా;Hanu Raghavapudi;YCP;TDP;central governmentSun, 12 Dec 2021 08:22:56 GMTఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా విషయంలో రాజ‌కీయాలు న‌డుస్తూనే ఉన్నాయి. కానీ, అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ గానీ.. ఇప్పుడు ప‌రిపాలిస్తున్న వైసీపీ గానీ.. ప్ర‌త్యేక హోదా కోసం కేంద్ర ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా డిమాండ్ చేసిన సంద‌ర్భాలు లేవ‌నే చెప్పాలి. ఇప్పుడు తాజాగా చంద్ర‌బాబు నాయ‌డు జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు. ప్ర‌త్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారంటూ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. అయితే, స‌రిగ్గా 2019 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ మా ఎంపీలు రాజీనామా చేస్తున్నారు మీ ఎంపీల‌తో కూడా రాజీనామా చేయించండి అని చంద్ర‌బాబును డిమాండ్ చేశారు.  


   అయితే, రాజీనామా చేస్తే ఏం వ‌స్తుంది.. పార్ల‌మెంట్‌లో ఉండి కొట్లాడాలి త‌ప్పా అంటూ ఆ రోజుల్లో టీడీపీ చెప్పుకొచ్చింది. తాజా డిమాండ్‌తో వైసీపీ నేత‌లు కూడా ఇదే విధంగా మాట్లాడుతార‌ని చెప్ప‌న‌వ‌స‌రం లేదు.  ఇక్క‌డ గ‌మ‌నించాల్సింది ఏంటంటే.. త‌క్కువ ఎంపీ సీట్లు ఉన్న వాళ్లు ఎక్కువ ఎంపీలు ఉన్న‌వాళ్ల‌ను రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తువ‌స్తున్నారు. ఈ స‌వాళ్ల‌తో పెద్ద‌గా వ‌చ్చింది ఏం లేద‌ని.. కేవ‌లం త‌మ‌పై రాజ‌కీయ ఫోక‌స్ పెంచుకోవ‌డం కోస‌మే ఇలాంటివి చేస్తున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే, రాజీనామాలు చేయ‌కుండా.. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌త్యేక హోదా కోసం పార్ల‌మెంట్‌లో అవిశ్వాస‌తీర్మానం పెట్టిన విధంగా ఈసారి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని దీని ద్వారా త‌మ డిమాండ్‌ను దేశ వ్యాప్తంగా వినిపించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

   
     ఇక చంద్ర‌బాబు ప్రత్యేక హోదా అవ‌స‌రం లేదంటూ.. ప్ర‌త్యేక ప్యాకేజ్ తీసుకుని కేంద్రానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆ త‌రువాత వారి వ్యూహం మార్చుకుని మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం మొద‌లుపెట్టారు. అందువ‌ల్ల ఈ వ్య‌వ‌హారం చూస్తే.. పార్టీలన్నీ రాజ‌కీయ ఆట‌లో ప్ర‌త్యేక హోదాను ఒక ఫుట్ బాల్‌గా వాడుకుంటున్నాయ‌నేది స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైనా రాజీనామాలు, విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌లు కాకుండా ఎంపీలంద‌రూ స‌మైక్యంగా నిల‌బ‌డి పోరాటం చేస్తే ప్ర‌త్యేక హోదా వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
   



బాబోరి రేవంత్ పాద‌యాత్ర‌.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>