Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mantelkima-munaklaaxa-kilo-enthante9dc5348b-dbc5-417a-9ce2-e9e579d8aff7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mantelkima-munaklaaxa-kilo-enthante9dc5348b-dbc5-417a-9ce2-e9e579d8aff7-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో సామాన్యుడి జీవితం ఎంతగానో భారంగా మారిపోతుంది. ఎందుకంటే కరోనా వైరస్ తర్వాత పని దొరకడమే కష్టం గా మారిపోయింది. దీంతో దొరికిన పనితో వచ్చిన దాంట్లో సర్దుకుపోతూ జీవితాన్ని గడుపుతున్నారు సామాన్యులు. ఇలాంటి సమయంలోనే రోజురోజుకు పెరిగిపోతున్న ధరలు మాత్రం సామాన్యుడి జీవితాన్ని అంతకంతకుభారంగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు భారీగా పెరిగిపోవడంతో సామాన్య ప్రజల జీవితం పై గుదిబండలా మారిపోయాయి. ఇటీవలి కాలంలో అటు కూరగాయల ధరలు కూడా అంతకంతకూ పెరిగి పోతూ ఉండటంతో సామాన్యులు బెMunakkaya{#}Chittoor;Petrol;Drumstick;Madanapalli;Coronavirusమంటెక్కిన మునక్కాడా.. కిలో ఎన్ని వందలో తెలుసా?మంటెక్కిన మునక్కాడా.. కిలో ఎన్ని వందలో తెలుసా?Munakkaya{#}Chittoor;Petrol;Drumstick;Madanapalli;CoronavirusSun, 12 Dec 2021 01:00:00 GMTఇటీవల కాలం లో సామాన్యుడి జీవితం ఎంతగానో భారంగా మారి పోతుంది. ఎందుకంటే కరోనా వైరస్ తర్వాత పని దొరకడమే కష్టం గా మారి పోయింది. దీంతో దొరికిన పనితో వచ్చిన దాంట్లో  సర్దుకు పోతూ జీవితాన్ని గడుపు తున్నారు సామాన్యులు. ఇలాంటి సమయం లోనే  రోజు  రోజుకు పెరిగి పోతున్న ధరలు మాత్రం సామాన్యుడి జీవితాన్ని అంత కంతకు భారంగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు భారీగా పెరిగి పోవడం తో సామాన్య ప్రజల జీవితం పై గుది బండలా మారి పోయాయి. ఇటీవలి కాలం లో అటు కూరగాయల ధరలు కూడా అంత కంతకూ పెరిగి పోతూ ఉండటం తో సామాన్యులు బెంబేలెత్తి పోతున్నారు.



 ముఖ్యం గా ఏపీలో అయితే కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ఎందుకంటే ఇటీవల వరదల కారణం గా ఏపీలో భారీగా పంట నష్టం వాటిల్లింది. దీంతో కూర గాయల ధరలు ఒక్క సారిగా కొండెక్కి కూర్చున్నాయి. ఇటీవలే టమాట ధరలు ఏకంగా వంద రూపాయలు దాటటం  తో సామాన్య ప్రజలందరూ ఆందోళన చెందారు. కేవలం టమాటో ధరలు మాత్రమే కాదు అటు మిగతా కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగి పోయాయి.


 ఇక ఇప్పుడు మునక్కాయ ధరలు కూడా ఒక్కసారిగా కొండెక్కి సామాన్యుడికి భారంగా మారి పోయాయ్ అని అర్థమవుతుంది. చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ లో  కిలో మునక్కాయ ధర 600 రూపాయలు పలుకుతూ ఉండడం గమనార్హం. కేజీకి గరిష్టంగా 15 మునక్కాయాలు వస్తాయి. అంటే కిలో 600 చొప్పున లెక్కేస్తే ఒక్క మునక్కాయ 40 రూపాయల వరకు పలుకుతుంది. ఇలా మునక్కాయ ధరలు మండిపోతు ఉండడంతో సామాన్య ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు. మరి మునక్కాయ ధరలు పెరిగిపోవడం సామాన్యుడు పై ఎలా ప్రభావం చూపుతుంది అని మీరు అనుకుంటున్నారు?



బాబోరి రేవంత్ పాద‌యాత్ర‌.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>