Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yuvaraje700329e-9bd2-4875-8f98-247f5dbd2670-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yuvaraje700329e-9bd2-4875-8f98-247f5dbd2670-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న గ్రేటెస్ట్ క్రికెటర్ యువరాజ్ సింగ్. అయితే యువరాజ్ సింగ్ జీవితం మొత్తం పోరాటం అనే చెప్పాలి. ఎన్నో రోజుల పాటు మైదానంలో ప్రత్యర్థులతో పోరాడుతూ ఇక ఆ తర్వాత క్యాన్సర్ బారినపడి జీవితంతో పోరాడాడు. ఇలా యువరాజ్ చేసిన ఊహకందని పోరాటం అందరికీ ఆదర్శప్రాయం గా చెప్పాలి. ఇక భారత క్రికెట్లో యువరాజ్ సింగ్ అనే పేరు తెరమీదికి వచ్చింది అంటే చాలు గుర్తు వచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు మాత్రమే. డేరింగ్ డ్యాషింగ్ క్రికెట్ అనే పదానికిYuvaraj{#}Yuvraj Singh;Cancer;ICC T20;Punjab;Cricket;India;mediaబర్త్ డే స్పెషల్ : చరిత్రకు కేరాఫ్ అడ్రస్ యువీ?బర్త్ డే స్పెషల్ : చరిత్రకు కేరాఫ్ అడ్రస్ యువీ?Yuvaraj{#}Yuvraj Singh;Cancer;ICC T20;Punjab;Cricket;India;mediaSun, 12 Dec 2021 12:30:00 GMTభారత క్రికెట్లో ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న గ్రేటెస్ట్ క్రికెటర్ యువరాజ్ సింగ్. అయితే యువరాజ్ సింగ్ జీవితం మొత్తం పోరాటం అనే చెప్పాలి. ఎన్నో రోజుల పాటు మైదానంలో ప్రత్యర్థులతో పోరాడుతూ ఇక ఆ తర్వాత క్యాన్సర్ బారినపడి జీవితంతో పోరాడాడు. ఇలా యువరాజ్ చేసిన  ఊహకందని పోరాటం అందరికీ ఆదర్శప్రాయం గా చెప్పాలి. ఇక భారత క్రికెట్లో యువరాజ్ సింగ్ అనే పేరు తెరమీదికి వచ్చింది అంటే చాలు  గుర్తు వచ్చేది ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు మాత్రమే. డేరింగ్ డ్యాషింగ్ క్రికెట్ అనే పదానికి యువరాజ్ సింగ్ కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు.



 అయితే యువరాజ్ సింగ్ 19 ఏళ్ల క్రికెట్ ప్రయాణం ఎంతో అద్భుతంగా సాగి పోయింది అని చెప్పాలి 13 ఏళ్ల 11 నెలల వయస్సు ఉన్న సమయంలోనే అండర్ 16 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు. ఆ తరువాత 1996లో అండర్-19 జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. ఇక అండర్ నైన్ టీన్ జట్టు లో తొలి సెంచరీ చేసి సెలక్టర్ల చూపును ఆకర్షించాడు. అండర్ 19 జట్టు లో మెరుపులు మెరిపించిన యువరాజ్ సింగ్ 2000 సంవత్సరంలో ఐసీసీ వరల్డ్ నాకౌట్ ట్రోఫీ సందర్భంగా టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. అలా మొదలైన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ ప్రస్థానం 19ఏళ్ళ పాటు సాగింది.


 19 ఏళ్ల క్రికెట్ కెరీర్ లో 40 టెస్టులు,  304 వన్డే మ్యాచ్ లు, 58 టీ-20 మ్యాచ్లు ఆడాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా భారీగా పరుగులు చేస్తూ టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు అనే చెప్పాలి. 2003, 2007, 2011 వన్డే ప్రపంచకప్ లో ఆడిన యువరాజ్ సింగ్ ఆల్ రౌండర్గా అత్యధిక ఫైనల్స్ ఆడిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. ముఖ్యంగా 2007, 2011 ప్రపంచ కప్ భారత్ గెలవడంలో యువరాజ్ సింగ్ పాత్ర మరువలేనిది అని చెప్పాలి. 2007 టీ20 ప్రపంచకప్ జరుగుతున్న యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన కేవలం 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించడంలో కీలక పాత్ర వహించాడు యువరాజ్ సింగ్. కాగా నేడు యువరాజ్ సింగ్ పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు క్రికెట్ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ చెప్తున్నారు.



కోట్ల లెక్కతేలేది ఎలా..!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>