Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/alzheimer-s-e480e08d-b4e9-4d6c-bf22-ed1e3bcf49da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/alzheimer-s-e480e08d-b4e9-4d6c-bf22-ed1e3bcf49da-415x250-IndiaHerald.jpgఅల్జీమర్స్ అనేది నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న వ్యాధి. ఇటీవలికాలంలో ఎంతోమంది అల్జీమర్ వ్యాధి బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మధ్య వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్నగా మొదలైన మతిమరుపు.. చివరికి చిత్తవైకల్యం కి భారత్ దారి తీస్తుంది. చివరికి సొంత వాళ్లని సైతం మరచిపోయే వరకు దారి తీస్తుంటుంది. ఇక ఇలాంటి దుర్భరమైన వ్యాధి బారినపడి ప్రస్తుతం ఎంతో మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే చిత్తవైకల్యం వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తAlzheimer's {#}Cholesterol;Yoga;Indiaఅల్జీమర్స్, చిత్తవైకల్యం రావడానికి 7 కారణాలు.. జాగ్రత్త పడండి?అల్జీమర్స్, చిత్తవైకల్యం రావడానికి 7 కారణాలు.. జాగ్రత్త పడండి?Alzheimer's {#}Cholesterol;Yoga;IndiaSun, 12 Dec 2021 08:02:00 GMTభారత్ దారి తీస్తుంది. చివరికి సొంత వాళ్లని సైతం మరచిపోయే వరకు దారి తీస్తుంటుంది. ఇక ఇలాంటి దుర్భరమైన వ్యాధి బారినపడి ప్రస్తుతం ఎంతో మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే చిత్తవైకల్యం వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తూ ఉంటాయి.  అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి ప్రకారం చిత్తవైకల్యం వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.


 మరి చిత్తవైకల్యం రావడానికి 7 కారణాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు.

 ఆహారం మరియు వ్యాయామం : వ్యాయామానికి దూరంగా ఉండటం వల్ల కూడా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉందట. చిత్త వైకల్యం ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రతిరోజు వ్యాయామం చేయడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా తృణ ధాన్యాలు గింజలు మరియు విత్తనాలు అధికంగా ఉండే ఆహారాన్ని అనుసరించే వారితో పోల్చితే అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వ్యక్తుల్లో చిత్తవైకల్యం ఎక్కువగా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పరిశోధనలో తేలిందని సూచించారు పరిశోధకులు.



 అధికంగా మద్యం సేవించడం :  అయితే ఆల్కహాల్ సేవించే వ్యక్తులలో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది.. మధ్య వయసులో ఉన్నప్పుడు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటే వృద్ధాప్యంలో  చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. తరచు ఆల్కహాల్ సేవించడం వల్ల మెదడు పనితీరులో మార్పు వస్తుందని తద్వారా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందుకే ఆల్కహాల్కు ఎంతో దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.


 హృదయనాళ ప్రమాద కారకాలు : బ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్, అల్జీమర్స్ లాంటివి చిత్తవైకల్యం ఎక్కువగా రావడానికి కూడా కారణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో  కొలెస్ట్రాల్ ఉండటం వల్ల కూడా చిత్తవైకల్యం వచ్చే అవకాశం ఉందట. అయితే మధ్య వయసులో ఊబకాయం హైబీపీ ఉన్నవారిలో కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయన నివేదిక చెబుతుంది అంటున్నారు నిపుణులు.



 ఊబకాయం  : స్థూలకాయం ఉన్న వ్యక్తుల్లో మిగతా వారితో పోలిస్తే 3.5 రెట్లు చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం ఉంది  అని అంటున్నారు నిపుణులు.  బెల్లీ ఫ్యాట్ మెదడుకు ఎంతగానో హాని కలిగిస్తుందని అంటున్నారు.


 మధుమేహం : అయితే మధుమేహం కలిగి ఉండడం వల్ల కూడా చిత్తవైకల్యం ప్రమాదం మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ మధుమేహం సరైన నియంత్రణలో లేకపోతే రక్త నాళాలకు నష్టం కలిగిస్తుంది అని అంటున్నారు. ఇక ఇలా   మెదడు నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల చిత్తవైకల్యం వైకల్యం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు నిపుణులు.

 ధూమపానం : ఇటీవలి కాలంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. అయితే ధూమపానం చిత్తవైకల్యం ప్రమాదం పెరగడానికి కారణం అవుతుందట. సిగరెట్లో ఉండే నికోటిన్ మెదడు ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది.  అంతే కాదు రక్తనాళాల వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచుతుందట.


 ఇలా చిత్తవైకల్యం నుంచి బయటపడటానికి ఒక వైపు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడమే కాదు. కాలుష్యరహిత ప్రాంతాలలో వుండే విధంగా చూసుకోవాలి. అంతేకాకుండా ధూమపానానికి మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం లేదా యోగా అలాంటివి చేయడం వల్ల కూడా చిత్తవైకల్యం నుంచి బయటపడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.



బాబోరి రేవంత్ పాద‌యాత్ర‌.. ప్లాన్ స‌క్సెస్ అయ్యేనా..?

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>