EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyan1c78237a-650f-4c90-84ad-7979f291db18-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/pawan-kalyan1c78237a-650f-4c90-84ad-7979f291db18-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో దీక్ష చేశారు. దీక్ష విరమణ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. గతానికి భిన్నంగా ఈ ప్రసంగంలో పవన్ కల్యాణ్ కాస్త తన గురించి తాను తెలుసుకోవడం.. తన బలహీనతలను ఒప్పుకోవడం చూస్తే ఆయనలో కాస్త పరివర్తన వచ్చిందేమో అనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచినా.. గెలవకపోయినా.. తాట తీస్తాం.. వంటి ఆవేశపూరిత ప్రసంగాలతో అప్పటికప్పుడు రక్తి కట్టించే పవన్ కల్యాణ్ ఈసారి మాత్రం అంత ఆవేశం చూపించలేదు. ఈ ప్రసంగంలో పవన్ pawan kalyan{#}Prasthanam;CBN;Pawan Kalyan;Partyజ్ఞానోదయం: తన బలహీనత ఏంటో తెలుసుకున్న పవన్‌..?జ్ఞానోదయం: తన బలహీనత ఏంటో తెలుసుకున్న పవన్‌..?pawan kalyan{#}Prasthanam;CBN;Pawan Kalyan;PartySun, 12 Dec 2021 23:38:19 GMTవిశాఖ స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో దీక్ష చేశారు. దీక్ష విరమణ సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. గతానికి భిన్నంగా ఈ ప్రసంగంలో పవన్ కల్యాణ్ కాస్త తన గురించి తాను తెలుసుకోవడం.. తన బలహీనతలను ఒప్పుకోవడం చూస్తే ఆయనలో కాస్త పరివర్తన వచ్చిందేమో అనిపిస్తోంది. ఎన్నికల్లో గెలిచినా.. గెలవకపోయినా.. తాట తీస్తాం.. వంటి ఆవేశపూరిత ప్రసంగాలతో అప్పటికప్పుడు రక్తి కట్టించే పవన్ కల్యాణ్ ఈసారి మాత్రం అంత ఆవేశం చూపించలేదు.


ఈ ప్రసంగంలో పవన్ కల్యాణ్ అనేక విషయాలను స్వయంగా అంగీకరించారు. తన సభలకు జనం వస్తారు కానీ.. వాళ్లంతా ఓట్లు వేయరని తనకు తెలుసని ఒప్పేసుకున్నారు. ప్రజాబలం ఉంది కానీ నేను చట్టసభల్లో బలహీనుడిని అని తనంతట తానే అంగీకరించడం ఆయనలోని పరిణితికి నిదర్శనంగా చెప్పొచ్చు. అంతే కాదు.. గతంలో సాగిన తన రాజకీయ ప్రస్థానాన్ని కూడా ఆయన నెమరువేసుకున్నారు. ఓట్లు చీలకూడదనే ఉద్దేశ్యంతో తాను 2014లో పోటీ చేయలేదని.. కానీ తనను ఆ విషయంలో అంతా ఒక ఐడియలిస్టిక్‌ ఫూల్‌గా చూశారని పవన్ కల్యాణ్ అన్నారు.


ఇంతవరకూ బాగానే ఉన్నా.. తనలోని లోపాలను సరిదిద్దుకునే దిశగా మాత్రం ఆయన ప్రస్థానం సాగుతున్నట్టు కనిపించడం లేదు. జనసేనకు అధికారం ఇస్తే.. ఏం చేయవచ్చో మేం చేసి చూపిస్తామంటున్న పవన్ కల్యాణ్.. తమను గెలిపించుకోవాల్సిన బాధ్యత మాత్రం ప్రజలదే అన్నట్టు మాట్లాడుతున్నారు. తాను మాట్లాడితే జనం చప్పట్లు కొట్టేసి వెళ్లిపోతే సమస్యలు పరిష్కారం కావని పవన్ కల్యాణ్ అంటున్నారు.


మొత్తానికి తన బలహీనలు ఏంటో తెలుసుకున్న పవన్ కల్యాణ్.. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆ దిశగా చర్యలు ఉండాలి. అలాకాకుండా.. నన్ను గెలిపించుకోకపోతే అది మీకే నష్టం అంటూ చంద్రబాబు తరహాలో ప్రజలను ఎమోషనల్ బ్లాక్‌ మెయిల్ చేయడం మొదలైతే.. అది విజయవంతం అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఏమంటారు..?





అమరావతి రైతులకు సక్సస్ సీక్రెట్ చెప్పిన పవన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>