MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-nu-aadukuntunna-mahesh-abhimanulu-bf36aa56-bb97-4926-a4c8-221011bf1eb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-nu-aadukuntunna-mahesh-abhimanulu-bf36aa56-bb97-4926-a4c8-221011bf1eb1-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత విడాకుల తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయినట్లే అని భావించారు. ఆమె నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ఒక్క సినిమా కూడా ఓకే చేయక పోవడంతో ఇక సినిమాలు చేయదేమో అని అనుకున్నారు ఆమె అభిమానులు. కానీ అనూహ్యంగా ఆమె యశోద సినిమా చేయడం ఒక్కసారిగా అభిమానులలో ఎంతో సంతోషాన్ని నెలకొల్పింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని అభిమానులకు చెప్పినట్లుగానే సినిమాలు చేస్తూ అందరినీ అలరించగా విడాకుల తర్వాత ఎలా ఆమె సినిమాలు చేస్తుందో అని అందరూ తెగ చర్చించుకున్నారు. samantha{#}Naga Chaitanya;marriage;Chitram;Samantha;vegetable market;Posters;mahesh babu;sukumar;Allu Arjun;Cinemaసమంత ను ఆడుకుంటున్న మహేష్ అభిమానులు!సమంత ను ఆడుకుంటున్న మహేష్ అభిమానులు!samantha{#}Naga Chaitanya;marriage;Chitram;Samantha;vegetable market;Posters;mahesh babu;sukumar;Allu Arjun;CinemaSun, 12 Dec 2021 16:58:00 GMTఅక్కినేని సమంత విడాకుల తర్వాత దాదాపు సినిమాలకు దూరం అయినట్లే అని భావించారు. ఆమె నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తరువాత ఒక్క సినిమా కూడా ఓకే చేయక పోవడంతో ఇక సినిమాలు చేయదేమో అని అనుకున్నారు ఆమె అభిమానులు. కానీ అనూహ్యంగా ఆమె యశోద సినిమా చేయడం ఒక్కసారిగా అభిమానులలో ఎంతో సంతోషాన్ని నెలకొల్పింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానని అభిమానులకు చెప్పినట్లుగానే సినిమాలు చేస్తూ అందరినీ అలరించగా విడాకుల తర్వాత ఎలా ఆమె సినిమాలు చేస్తుందో అని అందరూ తెగ చర్చించుకున్నారు. 

అయితే ఆమె స్టార్ హీరోల సినిమాలలో కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్రమే చేస్తూ తన మార్కెట్ ను రోజు రోజుకు పెంచుకోగా తాజాగా ఈ చిత్రంలో ఆమె పుష్ప సినిమా లో ఐటెం సాంగు చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్య పరిచింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన పుష్ప చిత్రం డిసెంబర్ 17వ తేదీన విడుదల కాబోతున్న తరుణంలో సమంత ఐటమ్ సాంగ్ చేసి ఈ చిత్రానికి క్రేజ్ ను మరింతగా పెంచింది. మరి ఈ సినిమాకు ఆమె అందం ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

ఇకపోతే గతంలో మహేష్ బాబు సినిమా విషయంలో ఆమె చేసిన ఓ తప్పు ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. మహేష్ బాబు అభిమానులు ప్రతి సందర్భంలో ఆమెను ఎంతగానో ట్రోల్ చేస్తున్నారు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా సమయంలో ఓ పోస్టర్ ను చూసి ఆమె ట్వీట్ చేసి చిత్ర యూనిట్ ను విమర్శించింది. ఆ విమర్శలు చేసిన కారణంగా ఆమెను చాలా సందర్భాల్లో మహేష్ అభిమానులు ఎంతగానో త్రోల్ చేయగా ఇప్పుడు కూడా ఐటెం పాటలో ఆమె చేయడాన్ని ట్రొల్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అదే దర్శకుడితో కలిసి అదే రకమైన పనులు చేస్తూ సమంత అప్పుడు నీతిని బోధించే పని ఎందుకు పెట్టుకున్నట్లు అని ఆమెను త్రొల్ చేస్తున్నారు. 



ముగిసిన ప‌వ‌న్ దీక్ష

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>