BusinessChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/ebikerental-8550a299-f16b-4bf1-b91c-ca57674a301b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/ebikerental-8550a299-f16b-4bf1-b91c-ca57674a301b-415x250-IndiaHerald.jpgభారతదేశ రైల్వేస్ ఎప్పటి కప్పుడు అవసరాలకు అనుగుణంగాను, అలాగే తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా ప్రయాణికులకు పలు సేవలు అందుబాటులోకి తెస్తుంది. సాంకేతికత మారుతున్నకొద్దీ తనను తాను మార్చుకుంటూ రైల్వేస్ ప్రయాణికులకు ఆయా సేవలను పొందటంలో జాప్యం లేకుండా చేయగలుగుతుంది. రైల్వేస్ లో ప్రతిరోజూ ఎంతో మంది వారివారి గమ్యాలకు చేర్చబడుతున్నారు. వీరందరికి తగిన సేవలు అందించడంలో రైల్వే శాఖ కూడా సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటుంది. అందులో బాగంగానే టికెట్ బుకింగ్ నుండి అన్ని సౌకర్యాలు ఆన్ లైన్ లో కి తెచ్చేసిందebikerental;{#}Bikeహిట్ : రైల్వే కు.. e-బైక్ అద్దె కలిసివచ్చింది..!హిట్ : రైల్వే కు.. e-బైక్ అద్దె కలిసివచ్చింది..!ebikerental;{#}BikeSun, 12 Dec 2021 10:47:55 GMTభారతదేశ రైల్వేస్ ఎప్పటి కప్పుడు అవసరాలకు అనుగుణంగాను, అలాగే తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు కూడా ప్రయాణికులకు పలు సేవలు అందుబాటులోకి తెస్తుంది. సాంకేతికత మారుతున్నకొద్దీ తనను తాను మార్చుకుంటూ రైల్వేస్ ప్రయాణికులకు ఆయా సేవలను పొందటంలో జాప్యం లేకుండా చేయగలుగుతుంది. రైల్వేస్ లో ప్రతిరోజూ ఎంతో మంది వారివారి గమ్యాలకు చేర్చబడుతున్నారు. వీరందరికి తగిన సేవలు అందించడంలో రైల్వే శాఖ కూడా సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటుంది. అందులో బాగంగానే టికెట్ బుకింగ్ నుండి అన్ని సౌకర్యాలు ఆన్ లైన్ లో కి తెచ్చేసింది. తద్వారా ప్రయాణికులు కేవలం ఆయా యాప్ ద్వారా లేదా వెబ్ సైట్ ద్వారా వారి ప్రయాణాన్ని ప్రణాళిక వేసుకోవచ్చు.

రద్దీ సమయంలో కూడా తగిన జాగర్తలు వహిస్తూ ప్రయాణికులు అసౌకర్యానికి గురికాకుండా ఆయా ఏర్పాట్లు చేస్తూ వస్తుంది రైల్వే శాఖ. పండుగల సమయాలలో ప్రత్యేక రైళ్ల నుండి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం వరకు అన్నిటిలో మార్పులు చేసుకుంటూ పోతుంది. ఇదే తరుణంలో మొదటి సరిగా దక్షిణ మధ్య రైల్వే లో ని తిరుచ్చి రైల్వే స్టేషన్ లో ఈ-బైకింగ్ రెంటల్ పేరిట ప్రయోగాత్మకంగా సేవలను ఆరంభించింది. ఈ విధానం ప్రవేశపెట్టినప్పటి నుండే ప్రయాణికుల వద్ద నుండి మంచి స్పందన వస్తుంది. తమ మొదటి ప్రయత్నం విజయవంతం కావడంతో ఈ సేవలను విస్తృతం చేసేందుకు రైల్వే శాఖ సమాయత్తం అవుతుంది.

ప్రస్తుతానికి తిరుచ్చిలో ఈ సేవలు ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలోనే ఇదే తొలి ఈ-బైక్ రెంటల్ సేవ, దానిని రైల్వేస్ తో అనుసంధానం చేశారు. ఇప్పటికైతే గంటకు 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ సేవను గంట, రోజు, వారం వరకు కూడా అందుబాటులో ఉంచారు. మొదటిగా తీసుకునే వారు 1000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దానితోపాటుగా ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడిలను కూడా ధ్రువపత్రాలుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ బైక్ లకు జీపీఎస్ అనుసంధానం ఉంటుంది, అది ఎక్కడ ఉన్నది ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునే సౌలభ్యం ఉంటుంది. ఈ సేవను కోరు వారు, రైల్వే ప్రయాణికులు కావాల్సిన పనిలేదు, ఎవరైనా పొందవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ చేసిన బైక్ 130కిమీ వరకు ప్రయాణించడానికి అనుగుణంగా ఉంటుంది.



కోట్ల లెక్కతేలేది ఎలా..!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>