PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/----------------------8ee160b0-e1b1-4ec0-91ef-caf722c84400-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/----------------------8ee160b0-e1b1-4ec0-91ef-caf722c84400-415x250-IndiaHerald.jpgపార్లమెంట్ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు మొదలు పెట్టేసింది. ఎలాగైనా ఈ సారి యూపీలో అధికారంలోకి రావాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు రెండేళ్లుగా యూపీ పైనే ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంగా యాత్ర పేరుతో బోటు యాత్ర చేశారు. ఇప్పుడు మహిళల ఓట్ల కోసం ప్రత్యేక మేనిఫెస్టో కూడా ప్రవేశ పెట్టuttar pradesh{#}Ganga;yogi;Ganges;Priyanka Gandhi;Akhilesh Yadav;Survey;Elections;Yatra;Congress;Assembly;March;Bharatiya Janata Party;central government;Partyయూపీలో కాంగ్రెస్ ఓటు పర్సెంట్ ఎంతో తెలుసా..?యూపీలో కాంగ్రెస్ ఓటు పర్సెంట్ ఎంతో తెలుసా..?uttar pradesh{#}Ganga;yogi;Ganges;Priyanka Gandhi;Akhilesh Yadav;Survey;Elections;Yatra;Congress;Assembly;March;Bharatiya Janata Party;central government;PartySun, 12 Dec 2021 18:57:40 GMTపార్లమెంట్ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్ ఎన్నికలకు ఇప్పటికే అన్ని పార్టీలు సిద్ధమయ్యాయి. దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు మొదలు పెట్టేసింది. ఎలాగైనా ఈ సారి యూపీలో అధికారంలోకి రావాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. దాదాపు రెండేళ్లుగా యూపీ పైనే ఆ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంగా యాత్ర పేరుతో బోటు యాత్ర చేశారు. ఇప్పుడు మహిళల ఓట్ల కోసం ప్రత్యేక మేనిఫెస్టో కూడా ప్రవేశ పెట్టారు. తమదే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా. అయితే అధికార బీజేపీ నేతలు మాత్రం మరోసారి తామే అధికారంలోకి వస్తామని బలంగా చెబుతున్నారు. అటు మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పటి నుంచి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పొత్తులపై ఓ క్లారిటీ కూడా వచ్చేసింది. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలో కూడా లెక్క వేసుకున్నారు.

అయితే సర్వేలు మాత్రం యోగి ఆదిత్యానాథ్ సర్కారుకు అనుకూలంగానే వస్తున్నాయి. యూపీ ఎన్నికల కోసం ఏబీపీ - సీ ఓటర్ సంస్థ చేపట్టిన ఓపీనియన్ పోల్ సర్వే ప్రకారం... భారతీయ జనతా పార్టీ మరోసారి సునాయాసంగా అధికారంలోకి వస్తుందని తేలింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు.. బీజేపీ 220 నుంచి 230 స్థానాలను సొంతం చేసుకుంటుందని సర్వేలో తేలింది. ఇక అఖిలేష్ నేతృత్వంలోని ఎస్పీ-ఆప్ అయితే 150 నుంచి 165 స్థానాలు గెలిచే అవకాశం ఉందనేది సర్వే నివేదిక. ఇక మాయవతి సారధ్యంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అయితే 25 స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని... ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే... 10 స్థానాలు కూడా వచ్చే అవకాశం లేదని సర్వే వెల్లడించింది. 2017 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి కేవలం ఏడు సీట్లు మాత్రం వచ్చాయి. ఇక పర్సంటేజ్ ప్రకారం అయితే... గతంలో కంటే 2 శాతం ఓట్లు తక్కువగా భారతీయ జనతా పార్టీ దక్కించుకుంటుందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీకి అయితే కేవలం 7 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేస్తోంది.





అమరావతి రైతులకు సక్సస్ సీక్రెట్ చెప్పిన పవన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>