Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik44498947-2763-41f1-ad59-b05b37c26332-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/hardik44498947-2763-41f1-ad59-b05b37c26332-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్గా కొనసాగాడు హార్దిక్ పాండ్యా. టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్న నాటి నుంచి తనదైన శైలిలో రాణిస్తూ ఇక టీమిండియా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే చెప్పాలి. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి అటు హార్దిక్ పాండ్యా ఆట సరిగ్గా సరిపోతుంది. చూడడానికి ఎంతో బక్క పలచగా ఉండే హార్దిక్ పాండ్యా అటు ఒక్కసారి మైదానంలోకి దిగి బ్యాట్ జులిపించాడు అంటే చాలు అన్ని ఫోర్లు సిక్సర్లు తప్ప సింగిల్స్ ఉండవు .ఇక అంతే కాదు అటు స్కోర్ బోర్డు సైతం పరుగులు పెడుతూ అలసిపHardik{#}Hardik Pandya;Cricket;BCCI;Pakistanహార్దిక్ పాండ్యాకు అప్పుడే చెప్పా.. వినలేదు : అక్తర్హార్దిక్ పాండ్యాకు అప్పుడే చెప్పా.. వినలేదు : అక్తర్Hardik{#}Hardik Pandya;Cricket;BCCI;PakistanSun, 12 Dec 2021 18:26:42 GMTమొన్నటి వరకు టీమిండియాలో స్టార్ ఆల్రౌండర్గా కొనసాగాడు హార్దిక్ పాండ్యా. టీమిండియా జట్టులో అవకాశం దక్కించుకున్న నాటి నుంచి తనదైన శైలిలో రాణిస్తూ  ఇక టీమిండియా జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు అనే చెప్పాలి. పిట్ట కొంచెం కూత ఘనం అనే పదానికి అటు హార్దిక్ పాండ్యా ఆట సరిగ్గా సరిపోతుంది. చూడడానికి ఎంతో బక్క పలచగా ఉండే హార్దిక్ పాండ్యా అటు ఒక్కసారి మైదానంలోకి దిగి బ్యాట్ జులిపించాడు అంటే చాలు అన్ని ఫోర్లు సిక్సర్లు తప్ప సింగిల్స్ ఉండవు .ఇక అంతే కాదు అటు స్కోర్ బోర్డు సైతం పరుగులు పెడుతూ అలసిపోతుంది.


 అంతలా హార్దిక్ పాండ్యా విజృంభిస్తూ ఉంటాడు.. అందుకే హార్దిక్ పాండ్యా ఆట చూడటానికి క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక తన బౌలింగ్తో కూడా కీలక సమయంలో వికెట్లు పడగొట్టి అదరగొడుతున్నాడు హార్దిక్ పాండ్యా. అయితేఒకప్పుడు టీమిండియాలో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా కెరియర్ కాస్త ప్రస్తుతం ప్రమాదం లో పడిపోయింది. గత కొంత కాలం నుంచి గాయాల బెడత హార్దిక్ పాండ్యాను వేధిస్తూనే ఉంది. దీంతో బౌలింగ్ కి పూర్తిగా దూరమైపోయిన హార్దిక్ పాండ్యా మునుపటిలా బ్యాటింగ్లో కూడా రాణించడం లేదు.


 దీంతో ప్రస్తుతం ఫిట్నెస్ నిరూపించుకోవాలి అంటు బిసిసిఐ హార్దిక్ పాండ్యా కు పరీక్ష పెట్టింది. ఇటీవలే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్పై పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత కొంత కాలం నుంచి వెన్నుముక్క వ్యాధితో బాధపడుతున్న హార్దిక్ పాండ్యాను తాను ఎన్నో రోజుల క్రితమే హెచ్చరించా అంటూ చెప్పుకొచ్చాడు. ఒకసారి నేను పాండ్య వెన్నెముకపై తాకాను అతను చాలా బక్కపలచగా వీక్ గా ఉన్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆడితే గాయపడతావ్ అంటూ హార్దిక్ పాండ్యా ను  హెచ్చరించా. ఇలా హెచ్చరించిన గంటన్నర సమయం లోనే హార్దిక్ పాండ్య గాయం బారిన పడ్డాడు. అంటూ షోయబ్ అక్తర్కు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కాగా వెన్నెముక గాయం కారణంగానే కొంతకాలం నుంచి హార్దిక్ పాండ్యా బౌలింగ్ కు దూరంగా ఉంటున్నాడు అన్న విషయం తెలిసిందే.



అమరావతి రైతులకు సక్సస్ సీక్రెట్ చెప్పిన పవన్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>