MoviesVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthd87aca3c-907b-40fb-90c1-ebbc395e824f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthd87aca3c-907b-40fb-90c1-ebbc395e824f-415x250-IndiaHerald.jpg సూపర్ స్టార్ రజనీకాంత్ అనగానే మంచి వ్యక్తి, వ్యక్తిత్వం కళ్ల ముందు కనిపిస్తుంది. భారతీయ సినిమాలో గత 45 ఏళ్లలో రజనీకాంత్ ఒక కల్ట్ స్టేటస్ సాధించాడు. ఆయన అభిమానులు ఆయనను దేవుడిలా ఆరాధిస్తారు. వెండితెరపై అభిమానుల కోసం ఆయన చేయనిది లేదు. రొమాన్స్ నుండి యాక్షన్ వరకు, రజనీకాంత్ ప్రతి పాత్రలో తనని తాను బాగా మౌల్డ్ చేసుకున్నాడు. ఈరోజు భారతీయ సినిమా సూపర్ స్టార్ పుట్టినరోజు... రజనీకాంత్‌కి 71 ఏళ్లు. ఈ శిఖరానికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు రజనీకాంత్ 'తలైవా'గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయRajini-@-71;{#}apoorva;johnny;srividhya;Anand Annamalai;Johnny;K Balachander;Chitram;Darsakudu;Director;jaaki;Tamil;Muthu;Audience;Rajani kanth;Fidaa;Cinemaరజినీ @ 71 : తలైవా 'సూపర్ స్టార్' ఎప్పటి నుంచి అయ్యాడు?రజినీ @ 71 : తలైవా 'సూపర్ స్టార్' ఎప్పటి నుంచి అయ్యాడు?Rajini-@-71;{#}apoorva;johnny;srividhya;Anand Annamalai;Johnny;K Balachander;Chitram;Darsakudu;Director;jaaki;Tamil;Muthu;Audience;Rajani kanth;Fidaa;CinemaSun, 12 Dec 2021 11:00:00 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ అనగానే మంచి వ్యక్తి, వ్యక్తిత్వం కళ్ల ముందు కనిపిస్తుంది. భారతీయ సినిమాలో గత 45 ఏళ్లలో రజనీకాంత్ ఒక కల్ట్ స్టేటస్ సాధించాడు. ఆయన అభిమానులు ఆయనను దేవుడిలా ఆరాధిస్తారు. వెండితెరపై అభిమానుల కోసం ఆయన చేయనిది లేదు. రొమాన్స్ నుండి యాక్షన్ వరకు, రజనీకాంత్ ప్రతి పాత్రలో తనని తాను బాగా మౌల్డ్ చేసుకున్నాడు. ఈరోజు భారతీయ సినిమా సూపర్ స్టార్ పుట్టినరోజు... రజనీకాంత్‌కి 71 ఏళ్లు. ఈ శిఖరానికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఇప్పుడు రజనీకాంత్ 'తలైవా'గా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను శాసిస్తున్నాడు. బస్ కండక్టర్‌గా ప్రారంభించి, ఆపై తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడు అయ్యాడు.

రజినీ 1975లో దర్శకుడు కె బాలచందర్ యొక్క అపూర్వ రాగంగల్‌తో తెరపైకి అడుగు పెట్టాడు. ఈ సినిమాలో కమల్ హాసన్, శ్రీవిద్య కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ సినీ కెరీర్‌లో తలైవా 170 చిత్రాలకు పైగా నటించాడు. ముల్లుమ్ మలరుమ్ (1978), బాషా (1995), పడయప్ప (1999), పతినర్వ్ వయతినిలే (1977), అన్నామలై (1992), ముత్తు (1995), జానీ (1980), తలపతి (1991), నినైతలే ఇనిక్కుం (1979), బ్లడ్‌స్టోన్ (1988). చంద్రముఖి, శివాజీ, రోబో, రోబో 2.0, పెద్దన్న వంటి వంటి సూపర్ హిట్ చిత్రాలతో ఆయన పేక్షకుల మనసులో అగ్రస్థానం సంపాదించాడు. ఆయన స్టైల్ కు ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. రజనీకాంత్ గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జాకీ చాన్ తర్వాత ఆసియాలో అత్యధిక పారితోషికం తీసుకునే రెండవ నటుడు రజనీకాంత్. నటనతో పాటు, నటుడు స్క్రీన్‌ప్లే రచయితగా, నిర్మాతగా, ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పని చేశారు. ఆయన ప్రఖ్యాత నటుడు మాత్రమే కాదు, పరోపకారి, ఆధ్యాత్మికవేత్త, దక్షిణ భారత రాజకీయాలపై కూడా ఆసక్తిని కలిగి ఉన్నాడు. 1978లో విడుదలైన అతని చిత్రం "బైరవి"తరువాత రజినీని తమిళ సినిమా సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు.  





కోట్ల లెక్కతేలేది ఎలా..!

అబ్దుల్లాపూర్‌మెట్​లో లారీ బీభత్సం..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>