PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bonda-uma-fires-on-cheap-liquor-and-english-language-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bonda-uma-fires-on-cheap-liquor-and-english-language-415x250-IndiaHerald.jpgఏపీలో అధికారం వైసీపీ పై రోజురోజుకు తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది. జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. మరో రెండున్నర సంవత్సరాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే జగన్ ఆరు నెలలు ముందుగానే సాధారణ ఎన్నికలకు వెళ‌తారన్న ప్రచారం కూడా అధికార వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న‌ ఊహాగానాలతో ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే 2024 ఎన్నికల్Bonda Uma{#}vishnu;Kesineni Nani;Bonda Umamaheswara Rao;MLA;Vijayawada;Elections;Telugu Desam Party;Minister;Jagan;CBN;YCP;TDP;Partyబొండా ఉమాకు మంత్రి ప‌ద‌వా ?బొండా ఉమాకు మంత్రి ప‌ద‌వా ?Bonda Uma{#}vishnu;Kesineni Nani;Bonda Umamaheswara Rao;MLA;Vijayawada;Elections;Telugu Desam Party;Minister;Jagan;CBN;YCP;TDP;PartySat, 11 Dec 2021 14:30:00 GMTఏపీలో అధికారం వైసీపీ పై రోజురోజుకు తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతుంది. జగన్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి. మరో రెండున్నర సంవత్సరాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే జగన్ ఆరు నెలలు ముందుగానే సాధారణ ఎన్నికలకు వెళ‌తారన్న ప్రచారం కూడా అధికార వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న‌ ఊహాగానాలతో ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

కొందరు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే 2024 ఎన్నికల్లో కచ్చితంగా తమ పార్టీ విజయం సాధిస్తుంది అని... తమ‌కు కచ్చితంగా మంత్రి పదవులు వస్తాయని ఆశల్లో కూడా మునిగితేలుతున్నారు. ఇక కొందరు పార్టీ నేతలు అనుచరులు అయితే ఈసారి టిడిపి గెలిచిన వెంటనే తమ నేతకు కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చర్చించుకుంటున్నారు. ఇలాంటి లిస్టులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు పేరు ప్రధానంగా చర్చకు వస్తోంది.

గత ఎన్నికల్లో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి కూడా మల్లాది విష్ణు చేతిలో కేవలం 20 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో తిరిగి బొండా ఉమా ని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అక్కడ ప్రజలు ఎక్కువగా క‌సితో ఉన్న‌ట్టు కనిపిస్తోంది. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే బొండా ఉమా కాపు సామాజిక వర్గం కోటాలో కచ్చితంగా మంత్రి అవుతారని బెజవాడ రాజకీయాల్లో టాక్ వినిపిస్తోంది.

వాస్తవంగా ఉమా గత ప్రభుత్వంలో నే మంత్రి అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అప్పట్లో ఆయన అల‌క బూనారు. కేశినేని నాని ఉమా ను బుజ్జగించారు. అయితే ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా బొండా ఉమా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాటాలు చేస్తున్నారు. ఈసారి కాపు సామాజిక వర్గం కోటాలో ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 



జ‌గ‌న్‌పై వ్య‌తిరేక ప్ర‌చారం ఎందుకు విఫ‌ల‌మ‌వుతోంది..!

మాజీ జస్టిస్ చంద్రు : ఆ వ్యాఖ్యలకు.. స్పందన ఉంటుందా..!

ప్రధాని మోడీకి రేవంత్ లేఖ

బెదిరింపులు : గంభీర్ కు మెయిల్ చేసింది.. పాకిస్తానీ..!

రవితేజ ఖిలాడి కి ఏంటి అడ్డు!!

పొరుగు రాష్ట్రాల సీఎంల‌కంటే జ‌గ‌నే బేష్‌... !

70 సీట్ల లెక్క : బీజేపీ, కాంగ్రెస్ వ్యూహం అదేనా..?

భారతీయ టెలికాం సంస్థలపై ఇన్ని ఫిర్యాదులు వచ్చాయా.. ఎందుకో తెలుసా..?

తమన్ ముందు దేవి శ్రీ బాగానే తేలిపోతున్నాడే!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>