PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/manchu-vishnu-on-lance-naik-sai-teja-family31008e5a-4f3f-4e76-a032-b336c84a4c1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/manchu-vishnu-on-lance-naik-sai-teja-family31008e5a-4f3f-4e76-a032-b336c84a4c1e-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా మొత్తం 13 మంది మృతి చెందారు. ఇందులో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ మరో 11 మంది దుర్మరణం చెందారు. వీరిలో రావత్ పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్న లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం లాన్స్ నాయక్ సాయితేజ స్వగ్రామం. ఈ దుర్ఘటనతో ఎగManchu{#}manchu vishnu;vidya;vishnu;sree;Syamala;Nayak;madhulika;Hero;Tamilnadu;mandalam;Chittoor;village;Wife;Army"మంచు" మనసు చాటుకున్న హీరో విష్ణు..!"మంచు" మనసు చాటుకున్న హీరో విష్ణు..!Manchu{#}manchu vishnu;vidya;vishnu;sree;Syamala;Nayak;madhulika;Hero;Tamilnadu;mandalam;Chittoor;village;Wife;ArmyThu, 09 Dec 2021 19:21:26 GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రముఖ హీరో మంచు విష్ణు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ సహా మొత్తం 13 మంది మృతి చెందారు. ఇందులో జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి మధులిక రావత్ మరో 11 మంది దుర్మరణం చెందారు. వీరిలో రావత్ పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్న లాన్స్ నాయక్ సాయితేజ కూడా మరణించారు. చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం ఎగువరేడ గ్రామం లాన్స్ నాయక్ సాయితేజ స్వగ్రామం. ఈ దుర్ఘటనతో ఎగువరేడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. లాన్స్ నాయక్ సాయితేజ మరణ వార్త విన్న కుటుంబం కన్నీరు మున్నీరుగా రోధిస్తోంది. సాయితేజ ఆరేళ్ల క్రితం 2015లో సైన్యంలో చేరారు. ఆ తర్వాత ఏడాది 2016లో శ్యామలతో వివాహం జరిగింది. కొద్ది రోజుల పాటు ఢిల్లీలోనే కాపురం చేశారు కూడా.

సాయితేజ, శ్యామలకు ఐదేళ్ల వయసున్న కుమారుడు మోక్షజ్ఞా, రెండేళ్ల వయసున్న పాప దర్శిని ఉన్నారు. చిన్న పిల్లలు కావడంతో ఏడాది నుంచి ఎగువరేడ గ్రామంలోని అత్తమామల వద్దే శ్యామల ఉంటోంది. సాయితేజ మాత్రమే ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నాడు. ప్రతి రోజు వీడియో  కాల్ ద్వారా భార్య, పిల్లలతో కుటుంబంతో సాయితేజ మాట్లాడుతుండే వారు. ప్రమాదం జరిగిన రోజు కూడా ఉదయం వీడియో కాల్‌లో మాట్లాడారు సాయితేజ. జనరల్ బిపిన్ రావత్‌తో కలిసి డ్యూటీపై తమిళనాడు వెళ్తున్నట్లు భార్య శ్యామలకు చెప్పారు. అంతలోనే సాయితేజ మరణ వార్త కుటుంబానికి చేరుకుంది. అయితే సాయితేజ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మంచు కుటుంబం కూడా సాయితేజ కుటుంబానికి అండగా నిలిచింది. తమ శ్రీ విద్యానికేతన్ సంస్థల్లో లాన్స్ నాయక్ సాయితేజ ఇద్దరు పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని హీరో మంచు విష్ణు తెలిపారు. ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు పూర్తిగా ఉచిత విద్య అందిస్తామన్నారు. త్వరలోనే సాయితేజ కుటుంబాన్ని స్వయంగా కలుస్తానని మంచు విష్ణు వెల్లడించారు.





కోవర్టులు సరే బాబు..ఆ బ్యాచ్‌కు కూడా స్వస్తి చెప్పండి!

Crash: పేలడానికి ముందు రావ‌త్ హెలికాప్ట‌ర్‌.. వీడియో వైర‌ల్

టీఆర్ఎస్‌లో మ‌రో కొత్త క్యాండెట్ రెడీ అయ్యాడా... !

క్రాష్ : ఎడుస్తున్న ఎగవ రేగడి పల్లె

వైసీపీ ఎంపీల‌కు ఏపీపై ప్రేమ లేదా ?

కేసీఆర్ వ్యూహాల‌కు ఈట‌ల‌, మ‌ల్ల‌న్న చెక్ పెడుతారా..?

ప్రాజెక్టులు సేఫ్‌గా ఉన్నాయా... జగన్ సమీక్ష..!

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు త్వ‌ర‌లో శుభ‌వార్త‌..!

క్రాష్ : మృత దేహాలను గుర్తించడం కష్టమే... స్పష్టం చేసిన రక్షణ శాఖ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>