Girls Molested in UP: ఆహారంలో మత్తు మందు కలిపి 17 మంది బాలికలపై ప్రిన్సిపల్ అత్యాచారం!

Girls Molested in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మహిళా కమిషన్.. వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది.​

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 06:49 PM IST
    • ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో దారుణం
    • ఆహారంలో మత్తు మందు కలిపి 17 మంది బాలికలపై అత్యాచారయత్నం
    • నిందితులను విడిచిపెట్టబోమన్న యూపీ మహిళా కమిషన్

Trending Photos

Girls Molested in UP: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. చదువు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడే.. బాలికలపై దారుణానికి పాల్పడ్డాడు. ఆ బాలికలు తినే ఆహారంలో మత్తు మందు కలిపి.. వారిపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. పరీక్షల్లో ఫెయల్ చేయిస్తానని ఆ ప్రిన్సిపల్ బెదిరించాడు. చివరకు తల్లిదండ్రుల సహాయంతో బాలికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏం జరిగిందంటే?

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో నవంబరు 18వ తేదీన ప్రాక్టికల్స్ పరీక్షలు రాసేందుకు ఓ పాఠశాలకు చెందిన 17 మంది బాలికలను ప్రిన్సిపల్ వేరే స్కూల్ కు తీసుకెళ్లాడు. పరీక్ష పూర్తైన తర్వాత వారంతా అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారికి పెట్టిన ఆహారంలో మత్తు మందు కలిపి ఆ తర్వాత ఆ బాలికలపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆ విషయం బయటపెడితే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని ప్రధానోపాధ్యాయుడు బెదిరించిట్లు బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు బాలికలు వారి తల్లిదండ్రుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు.

తాము ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లినప్పుడు పోలీసులు తమను పట్టించుకోలేదని విద్యార్థినుల తల్లిదండ్రులు వాపోయారు. స్థానిక బీజేపీ ఎమ్మేల్యే ప్రమోద్ ఉత్వల్ జోక్యం చేసుకున్న తర్వాతే పోలీసులు తమ కంప్లైయింట్ ను స్వీకరించారని బాలికల పేరెంట్స్ వెల్లడించారు.

ఈ సమాచారాన్ని తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. కేసుకు సంబంధించిన అన్ని వివరాలను తెలియజేయాలని ముజఫర్ నగర్ జిల్లా మెజిస్ట్రేట్ కు తెలిపింది. ఫిర్యాదు తీసుకునే విషయంలో నిర్లక్ష్యయం వ్యవహరించినందుకు పోలీసు అధికారి అభిషేక్ యాదవ్ సస్పెండ్ కు గురయ్యాడు. ఘటనపై విచారణ చేపట్టేందుకు ఐదు పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

More Stories